తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జర్మనీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇంటర్ పాసైన వారిని జర్మనీలో డిగ్రీ, డిప్లొమా చదివిస్తారు. అక్కడే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తారు. Triple Win పేరుతో తెలంగాణ ప్రభుత్వంతో 3 నెలల క్రితం ఒప్పందం కుదిరింది. ప్రతి జిల్లాలో ఉన్న Employment Exchangeల్లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకు జర్మన్ భాష నేర్చుకోడానికి, అర్హత పరీక్షలో పాస్ అవడానికి Telangana Overseas Manpower Company Limited (TAMCAM)ను సంప్రదించాల్సి ఉంటుంది.
TRIPLE WIN అంటే
విదేశీ విద్యార్థులను జర్మనీకి తీసుకెళ్ళి అక్కడే చదివించి, జర్మన్ వీసాలు ఇప్పించి, ఉద్యోగాలు ఇప్పించేలా చేయడమే ట్రిపుల్ విన్ లక్ష్యం. జర్మనీలోని 16 ఫెడరల్ రాష్ట్రాల్లోని పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలు, వైద్యరంగంలో ఉద్యోగులు, సిబ్బంది కొరత బాగా ఉంది. అయితే ప్రతి ఏటా విదేశాల నుంచి ఉపాధి కోసం వస్తున్న వారు నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారు. అందువల్ల జర్మనీ ప్రభుత్వం ఆయా రంగాల్లో వేల మంది విదేశీయులను రప్పించేందుకు కిందటేడాది ప్లాన్స్ రూపొందించింది. జర్మన్ ఛాన్స్ లర్ 2023 నవంబరులో Triple Win పేరుతో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలశాఖ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
* ఇంటర్లో 60శాతం మార్కులు వచ్చినవారు జర్మనీ భాష నేర్చుకున్న తర్వాత జిల్లా ఉపాధి కల్పన, టామ్ కామ్ అధికారులిచ్చిన సర్టిఫికెట్లతో జర్మనీకి తీసుకెళ్తారు.
*జర్మనీలోని వేర్వేరు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో మూడేళ్ల పాటు డిగ్రీ, డిప్లొమా కోర్సులు చదివిస్తారు. ఉపకార వేత నాలు ఇస్తారు.
* చదువు పూర్తయ్యాక వెంటనే కొన్ని నెలలు Apprenticeship, Traineeలుగా ఉద్యోగాలు ఇప్పిస్తారు. ప్రొబేషన్ పూర్తయ్యాక ఒక్కో ఉద్యోగికి భారత కరెన్సీలో 60 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల దాకా జీతం ఇస్తారు.
ఇవి గుర్తుంచుకోండి !
*ఇంటర్లో 60 శాతం మార్కులతో పాసై, 25 ఏళ్లలోపు వయసున్నవారు జర్మనీకి వెళ్లేందుకు అర్హులు.
* 6 నెలల్లో జర్మన్ భాష నేర్చుకోవాలి. తర్వాత జర్మనీ అధికారులు, ఇక్కడి అధికారుల సమక్షంలో అర్హత పరీక్ష నిర్వహిస్తారు.
*పాసైనవాళ్ళని టీమ్స్ గా ఎంపిక చేస్తారు. వాళ్ళ కి On Building కోర్సుల్లో జర్మనీలో ఫెడరల్, రాష్ట్ర ప్రభుత్వాలు శిక్షణ ఇస్తాయి.
*భాష నేర్చుకునేవారు హైదరాబాద్ లోని టామ్ కామ్ ఆఫీసు ప్రతినిధులను సంప్రదించాలి.
*సొంతంగా జర్మన్ భాష నేర్చుకునే వారు టామ్ కామ్ ప్రతినిధులను సంప్రదిస్తే వారు జర్మనీకి వెళ్లాక ఎలా ఉండాలో అంశాలపై శిక్షణ ఇస్తారు.
*ఇతర వివరాలకు : 040- 23342040 ద్వారా తెలుసుకోవచ్చు.
లేదా అధికారిక Website… http://www.tomcom.telangana.gov.in