గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణపై ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయబోతోంది. రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలని అభ్యర్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీనికి తోడు BJP, BRS లాంటి రాజకీయ పార్టీలు కూడా నిరుద్యోగులకు మద్దతు పలికాయి. శనవారం అంతా హైదరాబాద్ లో నిరుద్యోగుల ఆందోళన, పార్టీల నేతల ధర్నాలు, ఆందోళనలతో రణరంగంగా మారింది. కేంద్రమంత్రి బండి సంజయ్ స్వయంగా ధర్నాలో పాల్గొనడంతో ఆందోళనలు హీటెక్కాయి.
అర్థరాత్రి మంత్రుల మీటింగ్
గ్రూప్ 1 మెయిన్స్ వాయిదాపై నిరుద్యోగుల ఆందోళనతో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మంత్రులతో సమావేశం అయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇ:ట్లో జరిగిన మీటింగ్ లో దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. జీవీ 29 ఇష్యూ వల్ల ఏం జరిగింది ? గతంలో జీవో 55లో ఏముంది… ఈ జీవలో వల్ల భవిష్యత్తులో న్యాయ సమస్యలు ఎదురవుతాయా… అన్న దానిపై చర్చించారు. TGPSC అధికారులతో పాటు న్యాయ నిపుణులతోనూ మంతనాలు జరిపారు మంత్రులు. ఈ జీవోల వల్ల ఏ అభ్యర్థికీ నష్టం జరగదని ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయొద్దని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అర్థరాత్రి దాకా మంత్రుల, అధికారుల మీటింగ్ కొనసాగింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి గ్రూప్ 1 మెయిన్స్ పై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది.
అపోహలు వీడండి : రేవంత్ రెడ్డి పిలుపు
గ్రూప్ 1 అభ్యర్థులు అపోహలు వీడాలని, ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు రాజకీయ పార్టీల నాయకులు అశోక్ నగర్ కు వెళ్తున్నారని బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. కొంతమంది రాజకీయ నేతలు కావాలనే గ్రూప్ 1 అభ్యర్థులను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. నిరుద్యోగులను ఉసిగొలిపి వారి ప్రాణాలను బలిగొని రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పోలీస్ అకాడమీలో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్ 2024 ముగింపు కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రూప్ వాయిదాకు ప్రభుత్వం ఇష్టపడటం లేదని సీఎం రేవంత్ మాటలు బట్టి తెలుస్తోంది