TG: Group 4 Final list: 8084 మంది ఎంపిక (Final list pdf)

TG: Group 4 Final list: 8084 మంది ఎంపిక (Final list pdf)

తెలంగాణలో సుదీర్ఘంగా కొనసాగిన గ్రూప్4 ఉద్యోగుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. 8,180 గ్రూప్-4 సర్వీస్ పోస్టులకు Final List ను TGPSC ప్రకటించింది. 8,084 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. రెండేళ్ళుగా ఈ ప్రక్రియ కొనసాగింది. 2022 డిసెంబర్ 1న ఉద్యోగ ప్రకటన రిలీజ్ అయింది. ఈ పోస్టుల కోసం రాష్ట్రంలో 9.51 లక్షల మంది అప్లయ్ చేశారు. 2023 జులై 1 న Group.4 కి Written Test నిర్వహించారు. దీనికి దాదాపు 7.6 లక్షల మంది హాజరయ్యారు. ఫైనల్ కీని 2023 అక్టోబర్ 6న విడుదల చేశారు. న్యాయ వివాదాలు, టెక్నికల్ ప్రాబ్లెమ్స్ తో మొత్తానికి Genral Rank జాబితా లేట్ అయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక జనరల్ ర్యాంక్ జాబితా 2024 ఫిబ్రవరి 9న విడుదల చేసింది TGPSC. ఈ జాబితాలో 7,26,837 మందికి అవకాశం దక్కింది.

జిల్లాల వారీగా అభ్యర్థుల ఎంపిక

Group.4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో పోస్టుల కేటగిరీ వారీగా TGPSC రిలీజ్ చేసింది. 59 పోస్టుల ఫలితాలను withheld లో పెట్టారు. ఆ కేటగిరీల్లో అభ్యర్థులు లేకపోవడంతో 37 ఖాళీలు భర్తీ చేయలేదు. ఇప్పటికే ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళ ఎంపికను రద్దుచేస్తామని TGPSC అధికారులు హెచ్చరించారు.

Documents verification కి చాలా టైమ్

Group.4 అభ్యర్థుల Final List ను TGPSC జూన్ 9న ప్రకటించింది. నిబంధనల ప్రకారం జిల్లా స్థాయి పోస్టుల కోసం General అభ్యర్ధులను 1:3 నిష్పత్తిలో అలాగే దివ్యాంగ అభ్యర్ధులను 1:5 నిష్పత్తిలో Documents verification కు ఎంపిక చేసింది. అయితే Merit Listలో ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపికవడంతో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి 2 నెలల టైమ్ పట్టింది. 2024 జూన్ 20న మొదలు పెట్టి ఆగస్టు 31తో ఈ ప్రక్రియ ముగిసింది. దివ్యాంగులు, స్పోర్ట్స్ అభ్యర్థుల పత్రాల పరిశీలన 2024 నవంబరు 10 వరకు జరిగింది. Documents verification పూర్తయ్యాక అభ్యర్థుల నుంచి పోస్టుల వారీగా ఆప్షన్లు తీసుకుంది TGPSC. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం కమిషన్ Group.4 Final List ను పూర్తి చేసింది.

అభ్యర్థుల ఎంపిక జాబితా ఇదే

CLICK HERE FOR GROUP.4 FINAL LIST

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!