IBPS POs SOs Notification: IBPS PO, SO పోస్టుల నోటిఫికేషన్‌ రెడీ

IBPS POs SOs Notification: IBPS PO, SO పోస్టుల నోటిఫికేషన్‌ రెడీ

ప్రభుత్వ బ్యాంకుల్లో PO/SO పోస్టుల భర్తీకి IBPS త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయబోతోంది. దేశంలోని వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీస‌ర్, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులను భ‌ర్తీ చేస్తారు.
October లో PO, November లో SO ప్రిలిమ్స్‌ పరీక్షలు జరుగుతాయి.

ఈ పోస్టుల భర్తీకి కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌(CRP) పీఓ/ ఎంటీ-XIV, CRP SPL-XIV నోటిఫికేష‌న్ విడుద‌ల చేయనుంది IBPS. ఈ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు విడి విడిగా ఖాళీలను ప్రకటిస్తారు.
పోస్టులను బట్టి. సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, B.E., B.Tech., PG, MBA, PG Diploma ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోడానికి అర్హులు.
ప్రిలిమినరీ, మెయిన్స్ కి ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హత, అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్ చేయాలి. 2023-24 సంవత్సరానికి 3049 ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీలు, 1402 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది IBPS. ఈసారి కూడా అంతే పోస్టులు ఉండవచ్చని అంటున్నారు.

ఏయే బ్యాంకుల్లో భర్తీ చేస్తారు ?

బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

విద్యార్హత లు ఏమి ఉంటాయి:

బ్యాచిలర్స్‌ డిగ్రీ, B.E., B.Tech., PG, MBA, PG Diploma అర్హతలు ఉంటాయి.

వయస్సు : PO, SOలకు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

IBPS క్యాలెండర్‌ 2024-25 ప్రకారం ఈ తేదీలను గుర్తించుకోండి:

ప్రిలిమిన‌రీ పరీక్ష : PO పోస్టులకు- 19, 20.10.2024;
SO పోస్టులకు : 09.11.2024.
మెయిన్ పరీక్ష తేదీ:
PO పోస్టులకు- 30.11.2024;
SO పోస్టులకు 14.12.2024.
https://www.ibps.in/

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!