దేశంలోని వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న కొలువుల భర్తీకి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్ విడుదలైంది. ఎలాంటి Written Exam లేకుండా Tenth (SSC) మార్కులు, గ్రేడ్ మెరిట్ ఆధారంగా నియామకాలు జరుగుతాయి.
ఈ నోటిఫికేషన్ కింద దేశంలో వివిధ పోస్టల్ సర్కిళ్లలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ (GDS2024) ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పోస్టుల సంఖ్య చూస్తే…. ఆంధ్రప్రదేశ్‌లో 1355 పోస్టులు, తెలంగాణలో 981 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్ధులు ఆయా పోస్టల్ బ్రాంచెస్ లో Branch Post Master (BPM), Assistant Branch Post Master (ABPM), డాక్ సేవక్ పోస్టుల్లో పనిచేయాలి. పోస్టుల వివరాలు, బ్రాంచుల వారీగా ఖాళీల వివరాలు, ఏ హోదాలో ఎన్న పోస్టులు ఉన్నాయి, రిజర్వ్‌డ్/ అన్ రిజర్వ్‌డ్ వంటి పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో ఇచ్చారు. వాటి ప్రకారం అభ్యర్థులు అప్లయ్ చేసేటప్పుడు తమ ఆప్షన్లు ఇచ్చుకోవాలి.
అభ్యర్థులు సాధించిన మార్కులు, Rule of reservation ప్రకారం Computer generated methodలో అభ్యర్థులను GDS ఉద్యోగలకు ఎంపిక చేస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకూ ఒకే మార్కులు వస్తే.. వాళ్ళల్లో ఎవరికి ఎక్కువ వయస్సు ఉంటుందే ఆ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. పోస్టులకు ఎంపికైన వారి ఫోన్ నంబర్‌కు SMS/EMail/Post ద్వారా సమాచారం అందిస్తారు. ఈ Information అందుకున్న రెండు వారాల్లోగా అభ్యర్థులు సంబంధిత సెంటర్లకు వెళ్ళి తమ Documentsని verify చేయించుకోవాలి. తర్వాత ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) 2023-24కి GDS రిక్రూట్ మెంట్ కి Cut off Marks ఎలా ఉన్నాయో చూద్దాం.
Category | AP Circle Marks | TG Circle Marks |
UR | 99.3333 | 93.8333 |
EWS | 99.3333 | 95 |
SC | 99 | 95 |
ST | 95.6667 | 95 |
OBC | 99.1667 | 95 |
PWD-A | 92.5 | 93.4167 |
PWD-B | 76.8333 (4th list) | 68.4 |
PWD-DE | — | 90.25 |
PWD-C | 92.6667 | 90.25 |