JEE Mains 2025 లో ఈసారి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఈ సారి సిలబస్ యాడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది JEE Mains, Advanced పరీక్షల సిలబస్ తగ్గించారు. 2020లో కరోనా వల్ల 8-12 క్లాసుల వరకూ కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ లో కొన్ని చాప్టర్లు తీసేశారు. ఈ ఏడాది మాత్రం పాత సిలబస్ కలపడంపై అధికారులు ఆలోచిస్తున్నారు.
ఛాయిస్ ఎత్తివేత
JEE మెయిన్ పరీక్షల్లో గత మూడేళ్ళుగా Section B లో ఉన్న ఛాయిస్ ను తొలగించినట్టు NTA ప్రకటించింది. JEE Main లో 75 ప్రశ్నలు ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులు Question Paper ఉంటుంది. Maths, Physics, Chemistry నుంచి 25 చొప్పున ప్రశ్నలు ఇస్తారు. కోవిడ్ వల్ల ప్రతి సబ్జెక్టులో కూడా ఛాయిస్ ప్రశ్నలు ఇచ్చారు. JEE Main 2021 నుంచి ఇలా ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇచ్చారు. ప్రతి సబ్జెక్ట్ కీ A, B అని రెండు సెక్షన్లు ఉండేవి. Section A లో 20 ప్రశ్నలకు మొత్తం Ansers రాయాలి. Section B లో 10 ప్రశ్నలు ఇచ్చి అందులో ఐదింటికి జవాబు గుర్తించేలా ఛాయిస్ ఉండేది. ఈసారి ఆ ఛాయిస్ తీసేసినట్టు NTA అధికారులు ప్రకటించారు.
అక్టోబర్ నెలాఖరుకు JEE నోటిఫికేషన్
JEE 2025 నోటిఫికేషన్ ఈ అక్టోబర్ నెలాఖరులో రిలీజ్ అవ్వనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందుకోసం ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ మొదటి వారంలోనే JEE ONLINE అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. జనవరిలో First Phase JEE Mains నిర్వహిస్తారు. తర్వాత 2025 April/May నెలలో Second Phase JEE Mains జరుగుతుంది.
దేశంలోని IITలు, NITలు, IIITలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి JEE Mains 2025 నిర్వహిస్తారు. ఈ Mains లో అర్హత సాధించిన వాళ్ళల్లో 2.5 లక్షల మందికి JEE Advanced రాసుకునే అవకాశం ఇస్తారు. ఆ తర్వాత Advanced లో పొందిన మార్కుల ఆధారంగా IIT ల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది.