తెలంగాణలో కొత్తగా జూనియర్ రెవెన్యూ అధికారులు రాబోతున్నారు. రెవెన్యూ గ్రానికి ఒక JRO (video) ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో VRA, VRO లుగా పనిచేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. దీనికి సంబధించిన ప్రతిపాదనలను CCLA ప్రభుత్వానికి సమర్పించింది. ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. గతంలో VRO, VRAలు కలసి మొత్తం 25 వేల 750 పోస్టులు ఉండేవి. ఈ వ్యవస్థను గత BRS ప్రభుత్వం రద్దు చేసింది. వారిని ఇతర శాఖలకు ట్రాన్స్ ఫర్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల 954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన వారిని ఈ పోస్టుల్లో తీసుకోవాలని CCLA రికమండ్ చేసింది. గతంలో 5 వేల 195 మంది VROలు, 20 వేల 555 మంది VRAలు ఉన్నారు. వాళ్ళల్లో డిగ్రీ పాసైన వారిని JRO పోస్టుల్లో నియమిస్తారు. మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా నియమించే అవకాశముంది.