PARAM RUDRA : వాన రాక పక్కాగా తెలుస్తుందా ?  అర్కా, అరుణిక ఎలా పనిచేస్తాయి ?

PARAM RUDRA : వాన రాక పక్కాగా తెలుస్తుందా ?  అర్కా, అరుణిక ఎలా పనిచేస్తాయి ?

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 3 పరమ్‌ రుద్ర కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోడీ ఈ సెప్టెంబర్ 26న ప్రారంభించారు.  మొత్తం 130 కోట్ల రూపాయల ఖర్చుతో ఢిల్లీ, కోల్‌కతా, పుణెల్లో వీటిని ఏర్పాటు చేశారు.

అసలు పరమ్‌ రుద్ర సూపర్ కంప్యూటర్లు అంటే ఏంటి? ఇందులో వాన రాకను ఖచ్చితంగా కనిపెట్టే అర్కా, అరుణికల ఎలా పనిచేస్తాయి అన్నది తెలుసుకుందాం.

పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లతో ఉపయోగం ఏంటి ?

పరమ్‌ రుద్ర సూపర్‌ కంప్యూటర్లు ‘రుద్ర సర్వర్లతో అనుసంధానమై పని చేస్తాయి. వీటిని దిల్లీ, పుణె, కోల్‌కతా నగరాల్లో ఇన్‌స్టాల్ చేశారు. వీటి డిజైన్ దగ్గరి నుంచి పూర్తిగా తయారీ వరకు కూడా మన భారతదేశంలోనే జరిగింది. National Super computing machine లో భాగంగా Central for development of advanced computing (C-DAC) సంస్థ ఈ సూపర్‌ కంప్యూటర్లను develop చేసింది.

ఎర్త్ సైన్స్, ఫిజిక్స్, కాస్మాలజీ లాంటి అంశాల్లో లోతైన పరిశోధనలు చేసేందుకు ఈ సూపర్ కంప్యూటర్లు ఉపయోగపడతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ సూపర్ కంప్యూటర్ల సేవలను దేశవ్యాప్తంగా ఉన్న 350కి పైగా యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్లలోని పరిశోధకులు వాడుకునే వీలుంటుందని చెబుతున్నారు.

ఇందులో అర్కా, అరుణిక అని రెండు వ్యవస్థలు ఉన్నాయి… అవి ఏం చేస్తాయి?

వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు…. అలాగే వాతావరణ శాస్త్రంలో పరిశోధనల కోసం High performance computing (HPC) వ్యవస్థలను రూపొందించారు. వాటికి ఆర్కా, అరుణిక అని పేరు పెట్టారు.

డేటాను అత్యంత వేగంగా ప్రాసెస్ చేసి, అత్యంత క్లిష్టమైన లెక్కల్ని కూడా స్పీడ్ గా పూర్తి చేసే వ్యవస్థనే High performance computing (HPC) System అంటారు.

ఈ వ్యవస్థలను పుణెలోని Indian Institute of tropical metalorgy (IITM), నోయిడాలోని Nation Centre for Medium range weather forecasting  (NCMRWF)లో ఏర్పాటు చేశారు.

ఈ లేటెస్ట్ టెక్నాలజీ వల్ల భారీ తుపాన్లు, అధిక వర్షపాతం, వరదలు, ఉరుములు, పిడుగులు, వడగళ్లతో పాటు ఎంతటి క్లిష్టమైన వాతావరణ మార్పులను అయినా సరే… మరింత కచ్చితత్వంతో అంచనా వేయచ్చని ప్రభుత్వం అంటోంది.

నిజానికి వానం రాకడ… ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరు అన్నట్టుగా… వాతావరణ మార్పులను అత్యంత వేగంగా, కచ్చితత్వంతో అంచనా వేయగలిగే వ్యవస్థ అనేది ఇప్పటి వరకూ మన దగ్గర లేదు.

ఈ అర్కా, అరుణిక వ్యవస్థలు పనిచేస్తే… ప్రకృతి విపత్తుల వల్ల కలిగే నష్టాన్ని చాలా వరకు తగ్గించుకునే ఛాన్సుంటుంది. ఈ లేటెస్ట్ టెక్నాలజీ వ్యవస్థలు అందుకు ఉపయోగపడతాయని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ఇది నిజంగా గుడ్ న్యూసే.

మరో రెండు నెలల్లో ఈ వ్యవస్థలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి… పుణెలోని సూపర్ కంప్యూటర్ అర్కా… వాతావరణ మోడల్స్ నే కాదు… వాతావరణ మార్పులపైనా పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నిగ్ టెక్నాలజీలను కూడా ఉపయోగించుకునేలా డెవలప్ చేశారు…ఇంకా … పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లు వ్యవసాయ రంగానికి కూడా ఉపయోగపడతాయంటున్నారు

ఈ సూపర్ కంప్యూటింగ్ సాయంతో చేసే లోతైన పరిశోధనలు, డేటా విశ్లేషణ ఆధారంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ…తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో తెలిపారు…

ఈ సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్స్ తో చేసే పరిశోధనల ఆధారంగా శాస్త్రవేత్తలు మెరుగైన విత్తనాలను, నాణ్యమైన ఎరువులను అభివృద్ధి చేయవచ్చట. నేల సారాన్ని పెంచడానికి ఛాన్సు ఉంటుంది. అలాగే, వాతావరణ మార్పులను అత్యంత కచ్చితత్వంతో అంచనా వేయడం వల్ల రైతులు ఎప్పుడు విత్తనాలు వేయాలి? పంట ఎప్పుడు కోయాలి? లాంటి అంశాలు ఈజీగా తెలుసుకునే ఛాన్సు ఉంటుంది.

మొత్తానికి ఈ పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లతో… మన దేశం కూడా సూపర్ కంప్యూటింగ్‌లో ‌అగ్రగామిగా ఉన్న ప్రపంచ దేశాల వరుసలో నిలబడింది.  అంతేకాదు…వాన రాకడను ముందుగా అంచనా వేయడం వల్ల ప్రకృతి విపత్తుల్లో ప్రాణనష్టం జీరోకి తేవడానికి అవకాశం ఏర్పడుతుందని అనుకోవచ్చు.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!