RATAN TATA: భారత రత్నాన్ని కోల్పోయాం… రతన్ టాటా మృతి

RATAN TATA: భారత రత్నాన్ని కోల్పోయాం… రతన్ టాటా మృతి

నిజానికి ఇవాళ మన దేశం ఓ మహానుభావుడిని కోల్పోయింది…. టాటా గ్రూప్ ఛైర్మన్ శ్రీ రతన్ టాటా మరణం… నిజంగా భారతీయులందరికీ తీరని లోటు… మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే దాకా… జీవితంలో టాటా ఉత్పత్తులతో మన బంధం అనేది పెనవేసుకొని ఉంది.  సాల్ట్ నుంచి సాఫ్ట్ వేర్ దాకా… గుండు పిన్ను నుంచి విమానం దాకా… టాటా ఉత్పత్తి చేయని ప్రొడక్ట్ అంటూ ఏదీ లేదేమో…

టాటా గ్రూప్ విలువ 400 బిలియన్ డాలర్లు

ఆగస్టు 2024 నాటికి, టాటా గ్రూప్‌లోని అన్ని కంపెనీల మార్కెట్ క్యాప్ 400 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.35 లక్షల కోట్లుగా ఉంది… టాటా గ్రూప్ ఆధ్వర్యంలో 100కు పైగా కంపెనీలు ఉంటే… వీటిల్లో దాదాపు 6 లక్షల 60 వేల మంది పనిచేస్తున్నారు.  రతన్ టాటాకు మన దేశంలోనే కాదు… విదేశాల్లోనూ ఎంతో గుర్తింపు ఉంది…

2011లో ఎకనమిస్ట్ మేగజైన్ పబ్లిష్ చేసిన రతన్ టాటా ప్రొఫైల్ లో టాటా ఒక టైటాన్ అని అభివర్ణించింది అంటే… టాటా గొప్పతనం అలాంటిది….

నిజానికి అక్టోర్ 7న అంటే మూడు రోజుల క్రితమే టాటాకు తీవ్ర అస్వస్థతగా ఉంది… హాస్పటల్ లో జాయిన్ అయ్యారంటూ వార్తలు వచ్చాయి… ఆ తర్వాత రతన్ టాటా సోషల్ మీడియా ద్వారా తాను… సాధారణ వైద్య పరీక్షల కోసమే హాస్పిటల్ కి వెళ్ళాననీ… ఆందోళన చెందవద్దని Xలో ట్వీట్ చేశారు… అదే రతన్ టాటా ఆఖరి ట్వీట్.

ICU లో చికిత్స పొందుతూ 86యేళ్ళ రతన్ టాటా గత రాత్రి కన్నుమూశారు.

అన్ని కోట్ల రూపాయలకు అధిపతి అయినా… రతన్ టాటా ఎంత సాధారణ వ్యక్తిగా జీవించే ఒక్క చిన్న ఉదాహరణ

1992లో ఇండియన్ ఎయిర్ లైన్స్ ఉద్యోగులతో ఓ సర్వే చేశారు. ఢిల్లీ టు ముంబైకి విమానంలో ప్రయాణిస్తున్న టైమ్ లో…. మిమ్మల్ని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసిన ఒక ప్రయాణికుడి గురించి చెప్పని ఎయిర్ లైన్స్ సిబ్బందిని అడిగారు… సర్వే చేస్తున్న వాళ్ళు… అప్పుడు చాలా మంది ఎయిర్ లైన్స్…  రతన్ టాటా పేరే చెప్పారు.

VIPల్లో ఆయన ఒక్కరు మాత్రమే ఒంటరిగా ప్రయాణించేవారు… అంటే తన బ్యాగ్ తీసుకెళ్లడానికి, ఫైళ్లు పట్టుకోవడానికి రతన్ టాటాకు అసిస్టెంట్లు కూడా ఎవరూ ఉండేవాళ్ళు కాదు. విమానంలో ఎక్కగానే సైలెన్స్ గా తన పని తాను చేసుకుంటుండేవారు. ఆ టైమ్ లో తక్కువ చక్కెర వేసిన ఒక బ్లాక్ కాఫీ తాగడం రతన్ టాటాకి అలవాటు.

తాను అడిగినట్టుగా కాఫీ ఇవ్వలేదని ఆయన ఎప్పుడూ ఫ్లయిట్ సిబ్బంది మీద కోప్పడలేదు.

రతన్ టాటా సాదా సీదా జీవితంలో ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఎన్నో ఉన్నాయి.

రతన్ టాటాకి ఎంత మానవతావాదో చెప్పడానికి ఇంకో ఉదాహరణ

2018 ఫిబ్రవరి 6న బ్రిటన్ ప్రిన్స్ అయిన… చార్లెస్… బకింగ్ హామ్ ప్యాలెస్‌లో రతన్ టాటా దాతృత్వానికి సంబంధించిన ‘రాక్‌ ఫెల్లర్ ఫౌండేషన్ లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు ఇవ్వాల్సి ఉంది. కానీ, వేడుకకు కొన్ని గంటల ముందు తాను రాలేనని చెప్పారు రతన్ టాటా… అంతా ఆశ్చర్యపోయారు… బ్రిటన్ ప్రిన్స్ ఛార్లెస్ అవార్డు ఇస్తుంటే రాకపోవడం ఏంటని అనుకున్నారు…

అందుకు రతన్ టాటా చెప్పిన రీజన్ ఏంటో తెలుసా ?

తన కుక్క టీటోకు హఠాత్తుగా జబ్బు చేసిందని నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు రతన్ టాటా.  ప్రిన్స్ చార్లెస్‌కు ఆ విషయం చెప్పగానే ఆయన ‘‘దట్స్ ఎ మ్యాన్. దట్ ఈజ్ ద మ్యాన్ రతన్ ఈజ్’’ అన్నారు.

జేఆర్డీ టాటా లాగే రతన్ టాటా కూడా టైమ్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. సరిగ్గా సాయంత్రం ఆరున్నరకు ఆఫీసు నుంచి వెళ్లిపోయేవారు. ఆఫీసుకు సంబంధించిన పని కోసం ఎవరైనా ఇంట్లో కలవడానికి వస్తే చిరాకు పడేవారు. ఇంట్లో ఏకాంతంగా ఫైళ్లు, ఇతరత్రా…  చూస్తుండేవారు.  రతన్ టాటా ముంబై ఉన్నప్పుడు వీకెండ్స్ లో అలీబాగ్‌లోని తన ఫాంహౌస్‌లో గడిపేవారు.  ఆ టైమ్ లో ఆయన పెంపడు  కుక్కలు తప్ప… ఎవరూ ఉండేవారు కాదు. టాటాకు ప్రయాణాలు చేయడం, ఉపన్యాసాలు ఇవ్వడం లాంటివి పెద్దగా నచ్చవు.  ఆడంబరాలంటే ఆయనకు చికాకు.

చిన్నప్పుడు కుటుంబం రోల్స్ రాయిస్ కారులో ఆయన్ను స్కూలు దగ్గర దింపేటప్పుడు… రతన్ టాటా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు.  ఆయనకున్న మొండి స్వభావం తన కుటుంబంలోనే ఉంది.  JRD టాటా… రతన్ తండ్రి నావల్ టాటా నుంచి అది వారసత్వంగా వచ్చిందని అంటుంటారు. మీరు తలకు తుపాకీ గురిపెట్టినా, నన్ను కాల్చండి. కానీ, నేను దారిలోంచి పక్కకు వెళ్లను అంటారు రతన్ టాటా. రతన్ టాటా యువకుడిగా ఉన్నప్పుడు… టాటా గ్రూప్‌లో తన ప్రారంభ రోజుల్లో రతన్‌ తన సర్‌ నేమ్ ఒక భారంలా భావించేవారు. ప్రోటోకాల్… గౌరవ మర్యాదలంటే ఆయనకు నచ్చవు. అమెరికాలో చదివేటప్పుడు…  క్లాస్‌మేట్స్ కి తన కుటుంబ నేపథ్యం తెలియదు కాబట్టి… రతన్ టాటాకి ఏ ఇబ్బంది ఉండేది కాదు. వేల కోట్ల రూపాయలకు వారసుడు అయి ఉండి… అమెరికాలో డబ్బులకు ఆయన పడిన ఇబ్బందుల గురించి రతన్ టాటా ఓ ఇంటర్వ్యూలో  చెప్పారు.  ఆ రోజుల్లో విదేశాల్లో చదవడానికి రిజర్వ్ బ్యాంక్ చాలా తక్కువ విదేశీ కరెన్సీ  వాడానికి అనుమతించేది. మా నాన్నకు చట్టాలను ఉల్లంఘించడం నచ్చదు. నా కోసం బ్లాక్‌లో డాలర్లు కూడా కొనేవారు కాదు. దీంతో తరచూ నెల అయిపోగానే… నా దగ్గర డబ్బులు అయిపోయేవి. దాంతో నా ఫ్రెండ్స్ దగ్గర అప్పుచేసేవాడిని. ఒక్కోసారి అవి కూడా సరిపోక… అదనంగా డబ్బు సంపాదించడానికి నేను గిన్నెలు కూడా కడిగాను అని రతన్ టాటా చెప్పారు.

రతన్ అమెరికాలో ఏడేళ్లు ఉన్నారు. అక్కడ కార్నెల్ యూనివర్సటీలో ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశారు. లాస్ ఏంజలస్‌లో మంచి ఉద్యోగం, అద్భుతమైన ఇల్లు ఉండేవి.  కానీ తన నానమ్మ కోరికతో ఆయన భారత్‌కు తిరిగి వచ్చారు. USA ఉన్నప్పుడు ఓ అమెరికన్ అమ్మాయిని టాటా ప్రేమించారు. ‘‘ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నారట…  తనతో భారత్‌కు తీసుకురావాలని అనుకున్నారు. కానీ, అప్పట్లో అంటే 1962 లో భారత్, చైనా మధ్య యుద్ధం జరుగుతోంది. దాంతో, ఆ అమ్మాయి తల్లిదండ్రులు… ఇండియాకు తీసుకెళ్ళడానికి ఒప్పుకోలేదట. దాంతో రతన్ టాటా జీవితాంతం పెళ్ళి చేసుకోకుండానే ఉండిపోయారు. భారత్‌లో కోవిడ్ మహమ్మారి వ్యాపించినపుడు రతన్ టాటా అప్పటికప్పుడు టాటా ట్రస్టుల నుంచి రూ.500 కోట్లు, టాటా కంపెనీల నుంచి రూ.1000 కోట్లు దానం చేశారు. ఆ టైమ్ లో కరోనా రోగులకు వైద్యం చేయడానికి ప్రాణాలకు తెగించిన డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ఉండటానికి తమ లగ్జరీ హోటళ్లను వాడుకోవచ్చని చెప్పిన మొట్టమొదట వ్యక్తి రతన్ టాటా.

రతన్ టాటా పెళ్ళి చేసుకోలేదు… మరి వారసుల సంగతేంటి… టాటా సామ్రాజ్యం ఎలా నడుస్తుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రతన్‌ టాటా.. అందుకోసం ఎప్పుడో ఏర్పాట్లు చేశారు. టాటా గ్రూప్‌కి ప్రస్తుతం N చంద్రశేఖరన్….టాటా సన్స్ ఛైర్మన్‌గా ఉన్నారు. 2017 నుంచి ఆ బాధ్యతల్లో పనిచేస్తునారు.  చంద్రశేఖరన్ కుటుంబంలోని సభ్యులంతా వ్యాపారంలో వివిధ రంగాలకు నాయకత్వం వహిస్తున్నారు. సో… భవిష్యత్తులో టాటా గ్రూప్‌కు బాధ్యత వహించడానికి చాలా మందే ఉన్నారు. కానీ వారసత్వంగా వచ్చే వారసులు ఎవరు అంటే… నోయెల్ టాటా ఇతను రతన్ టాటాకి సవతి సోదరుడు. టాటా వారసత్వాన్ని అందుకునే ప్రధాన పోటీదారుల్లో ఈయన ఒకరు. నోయెల్ టాటాకు ముగ్గురు పిల్లలు. మాయ, నెవిల్లే, లేహ్ టాటా. వీరు కూడా వారసులే.

మాయా టాటా : 34 ఏళ్ల మాయా టాటా టాటా గ్రూప్‌లో కీలక పదవిలో ఉన్నారు. ఈయన టాటా ఆపర్చునిటీస్ ఫండ్ అండ్‌ టాటా డిజిటల్‌లో కీలక పదవులు నిర్వహించారు. టాటా కొత్త యాప్‌ను ప్రారంభించడంలో ఈయనదే కీలక పాత్ర.

నెవిల్లే టాటా: నెవిల్లే టాటాకు 32 యేళ్లు. కుటుంబ వ్యాపారంలో చురుకుగా ఉన్నవాళ్ళల్లో నెవిల్లే టాటా ఒకరు. టయోటా కిర్లోస్కర్ గ్రూప్‌కు చెందిన మాన్సీ కిర్లోస్కర్‌ను పెళ్ళి చేసుకున్నారు నెవిల్లే.

ట్రెంట్ లిమిటెడ్ కింద స్టార్ బజార్ అనే కంపెనీకి అధిపతి.

లేహ్ టాటా : 39 ఏళ్ల లియా టాటా.. టాటా గ్రూప్ హాస్పిటాలిటీ రంగంలో కీలక వ్యక్తి.  టాటా తాజ్ హోటల్స్ రిసార్ట్స్, ప్యాలెస్‌లలో కీలక హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం, ఆమె ప్రస్తుతం హాస్పిటాలిటీ రంగంలో ఇండియన్ హోటల్ కంపెనీని నిర్వహిస్తున్నారు.

చివరగా ఓ మాట

ఇప్పటికీ మన దేశంలో ట్రక్ డ్రైవర్లు… తమ వెహికిల్స్ వెనుక భాగంలో ఓకే టాటా అని రాసుకుంటారు…

అంటే నేను నడిపే ఈ ట్రక్కు టాటాది, ఇది విశ్వసనీయమైనది అని చెప్పడానికి….

టాటా ఉత్పత్తులు అంటే… మన భారతీయులకు అంత భరోసా…

 

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!