వచ్చే 10 ఏళ్లల్లో 50 వేల మంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించబోతోంది రిలయన్స్ ఫౌండేషన్. 2022లోనే ఈ నిర్ణయం తీసుకొని… 2022, 2023లో ఏడాదికి ఐదు వేల మంది అండర్ గ్రాడ్యుయేట్లకు Reliance Scholarships మంజూరు చేసింది. ఏడాదికి వంద మంది చొప్పున PG కోర్సుల్లో చేరిన First Year విద్యార్థులకు కూడా ఈ Scholarship అందిస్తోంది. ఈ ఏడాది 2024-25 సంవత్సరానికి మరో 5 వేల మంది UG, 100 మంది PGలకు అవకాశం ఇవ్వడానికి రిలయన్స్ సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ Reliance Scholarship పథకానికి ఎంపికైతే… వాళ్ళు కోర్సు పూర్తి చేసేదాకా సంస్థ నుంచి ఆర్థిక సాయం అందుతుంది. మెరిట్ కామ్ మీన్స్ ప్రాతిపదికన వీటిని అందిస్తున్నారు.
Reliance Scholarship పొందిన UG డిగ్రీ వారికి 2 లక్షల రూపాయల దాకా ఇస్తారు. అలాగే PG విద్యార్థులు అయితే 6 లక్షల వరకు ఇస్తారు. స్కాలర్షిప్ ను ట్యూషన్/ హాస్టల్ ఫీజు తో పాటు, ల్యాప్టాప్, అకడమిక్ పుస్తకాలు, కోర్సుల కోసం వాడుకోవచ్చు. వీళ్ళకి రిలయన్స్ ఫౌండేషన్ నుంచి కెరియర్ పరంగా కూడా సహకారం అందిస్తారు. ఏటా కొంత మొత్తాన్ని విద్యార్థి బ్యాంకు అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు. క్యాష్ ప్రోత్సాహకంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ, వర్క్ షాపులు, అలమ్నీ నెట్వర్క్ తో లింకేజ్ లాంటివి అదనంగా అందుతాయి. వేరే ఇతర స్కాలర్షిప్పులు పొందుతున్న వారు కూడా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లయ్ చేయాలి ?
UG లేదా PG First Year చదువుతున్న విద్యార్థులు రిలయెన్స్ ఫౌండేషన్ websiteలో పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి.
1) Passport Size Photo
2) Address Proof
3) SSC Marks Memo
4) Inter Marks Memo
5) ప్రస్తుత కళాశాల/సంస్థ నుంచి Bonafide Certificate
6) కుటుంబ వార్షికాదాయం వివరాలు
7) దివ్యాంగులైతే సంబంధిత రుజువు పత్రాలు అప్లోడ్ చేయాలి.
దరఖాస్తు చేసుకున్నవారికి ఏ తేదీ, ఏ సమయంలో Online Aptitude Test నిర్వహిస్తారో సమాచారం ఇస్తారు.
UG వాళ్ళకి పరీక్ష
ఇది రిమోట్ ప్రోక్టర్డ్ విధానంలో ఉంటుంది. ఇంటర్నెట్ సౌకర్యంతో కంప్యూటర్/ల్యాప్టాప్ ఉన్న వారు ఇంటి దగ్గర నుంచే ఈ Online పరీక్ష రాసుకోవచ్చు. లేనివారు ఏదైనా ఇంటర్నెట్ కేంద్రానికి వెళ్లి పూర్తి చేసుకోవచ్చు. కెమెరా, మైక్రోఫోన్ ఆన్లో ఉంచాలి. వాటి ద్వారా పర్యవేక్షణ ఉంటుంది.
Exam Time : 1 Hour… 60 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వస్తాయి.
ప్రతి ప్రశ్నలకు ఒక మార్కు. వెర్బల్, అనలిటికల్ అండ్ లాజికల్, న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలు.
ఒక్కో విభాగం నుంచీ 20 చొప్పున ఉంటాయి.
ప్రతి సెక్షన్ ని 20 నిమిషాల్లో పూర్తిచేయాలి.
వెర్బల్ ఎబిలిటీలో.. స్పాటింగ్ ఎర్రర్, సెంటెన్స్ కంప్లీషన్, ఫౌండేషన్, గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రశ్నలు వస్తాయి.
పరీక్షకు వారం ముందు Websiteలో ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్టు అందుబాటులో ఉంచుతారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ స్కోరు. అకడమిక్, పర్సనల్ సమాచారం ఆధారంగా అర్హులను ఎంపికచేస్తారు. విద్యార్థినులు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైనవారి వివరాలు డిసెంబరులో ప్రకటిస్తారు.
రిలయెన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ కి అర్హతలు ఇవే !
ఏదైనా UG కోర్సు First Year రెగ్యులర్ విధానంలో చదువుతున్నవారే దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. గరిష్ఠ వయసు నిబంధన లేదు. Online, Distance, Remote విధానంలో చదివే వారికి Second Year, Final year కోర్సుల వారికి అర్హత లేదు.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.15 లక్షల లోపు ఉంటేనే అర్హులు. రూ.2.5 లక్షల లోపు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇంటర్/ప్లస్ 2లో 60 శాతం మార్కులు ఉండాలి. పది తర్వాత డిప్లొమా పూర్తి చేసుకున్న వారికి అవకాశం లేదు.
PG వాళ్ళకి
దేశంలో ఏదైనా సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్, రెన్యూవబుల్ అండ్ న్యూ ఎనర్జీ, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, లైఫ్ సైన్సెస్ కోర్సులు చదువుతున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధికి మొత్తం రూ.6 లక్షల వరకు అందిస్తారు. ఇందులో 80 శాతం విద్యా సంవత్సరం ప్రారంభంలో, మిగతా 20 శాతం ప్రొఫెషనల్ డెవలప్మెంట్, కాన్ఫరెన్సులు, పర్సనల్ డెవలప్మెంట్….తదితర ఖర్చుల కోసం చెల్లిస్తారు. నిపుణులతో సమావేశం, సంబంధిత రంగంపై అవగాహన పెంచడం కూడా ఈ స్కాలర్షిప్పులో భాగంగా భావిస్తారు.
అప్లయ్ చేసేటప్పుడు ఇవి మర్చిపోవద్దు
రిలయన్స్ ఫౌండేషన్ Website లో Eligibility Questionare పూర్తి చేయాలి. పర్సనల్, అకడమిక్, Extra curricular activities నమోదు చేయాలి. రెండు రిఫరెన్స్ లెటర్లు
జతచేయాలి. వీటిలో ఒకటి అకడమిక్ నైపుణ్యాలు, రెండో వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు
తెలిపేది ఉండాలి. రెండు ఎస్సేల్లో.. ఒకటి పర్చనల్ స్టేట్మెంట్, రెండోది స్టేట్మెంట్ ఆఫ్
పర్పస్ రాసివ్వాలి. వీరికి ఆన్లైన్ ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహిస్తారు. గంట వ్యవధిలో 60
మల్టిపుల్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. వెర్బల్, ఎనలిటికల్ అండ్ లాజికల్, న్యూమరికల్ ఎబిలిటీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. (యూజీ పరీక్ష లాగే PG ఎగ్జామ్ కూడా నిర్వహిస్తారు). ఇండస్ట్రీ నిపుణులు, అకడమిషియన్లు, సంబంధిత విభాగంలో నాయకత్వ స్థాయిలో
ఉన్నవారు బృందంగా ఏర్పడి దరఖాస్తులు పరిశీలిస్తారు. ఇలా పరిశీలించి ఎంపిక చేసిన వారికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్, వెబినార్లు ఉంటాయి. Experts వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూ
నిర్వహిస్తారు.
మొత్తం ఈ ప్రాసెస్ లో టాలెంట్ చూపించిన వంద మందికి స్కాలర్షిప్పుల అందిస్తారు. PG First year కోర్సు చదివేవాళ్ళకి గేట్ స్కోరు 550-1000 ‘మధ్య ఉండాలి. ఈ పరీక్ష రాయనివాళ్లైతే UGలో 7.5 CGPA ఉండాలి. (గేట్ 550 కంటే తక్కువ స్కోరు పొంది. యూజీలో 7.5 కంటే ఎక్కువ CGPA ఉన్నవారు కూడా అనర్హులే)
రిలయెన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్స్ కి అప్ల చేసుకోడానికి చివరి తేదీ: అక్టోబరు 6 (UG & PG)
Website http://: https://scholarships.reliancefoundation.org/ RF Scholarship.aspx