RRB JE Recruitment 2024:
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డులో జూనియర్ ఇంజినీర్ (Junior Engineer) పోస్టుల భర్తీకి Notication రిలీజ్ అయింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా రైల్వేలో 7,951 పోస్టుల్ని భర్తీ చేస్తారు.
ఖాళీలు ఎన్నంటే?
కెమికల్ సూపర్ వైజర్ / రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్ వైజర్ / రీసెర్చ్: 17 పోస్టులు
జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్: 7934 పోస్టులు
అర్హత ఏంటి ?
విద్యార్హతలు పోస్టుల వారీగా RRB అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోండి.
సంబంధిత ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో మూడేళ్ళ డిప్లొమా
సంబంధిత ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో BE/B.Tech
డిగ్రీ /డిప్లొమా చివరి సంవత్సరం విద్యార్థులు RRB JE 2024 రిక్రూట్ మెంట్ కు అప్లయ్ చేయడానికి అర్హత లేదు.
వయో పరిమితి ( 01.01.2024 నాటికి)
అన్ని పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి.
( వయోపరమితిలో SC/ST/OBC, దివ్యాంగులకు మినహాయింపు ఉంది )
ఎంపిక విధానం
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ (ME) దశల్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మొదటి దశ, రెండో దశ అని రెండు దశల్లో ఉంటుంది. CBTలో ప్రతి తప్పు సమాధానానికి కేటాయించిన మార్కులో 1/3వ వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
RRB JE PAPER 1
పేపర్ 1 : మొత్తం 90 నిమిషాలు
1) మ్యాథమెటిక్స్ : 30 ప్రశ్నలు
2) జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ : 25 ప్రశ్నలు
3) జనరల్ అవేర్నెస్ : 15 ప్రశ్నలు
4) జనరల్ సైన్స్ : 30 ప్రశ్రలు
మొత్తం : 100 ప్రశ్నలు … 100 మార్కులు
RRB JE PAPER 2
150 ప్రశ్నలు 120 నిమిషాల టైమ్ (2 గంటలు) ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు, తప్పు ఆన్సర్ కి 1/3 నెగిటివ్ మార్క్
1) జనరల్ అవేర్నెస్ : 15 ప్రశ్నలు
2) ఫిజిక్స్ & కెమిస్ట్రీ : 15 ప్రశ్నలు
3) కంప్యూటర్ అప్లికేషన్ బేసిక్స్ : 10 ప్రశ్నలు
4) పర్యావరణం & కాలుష్యం : 10 ప్రశ్నలు
5) టెక్నికల్ నాలెడ్జ్ : 100 మార్కులు
మొత్తం : 150 మార్కులు… 150 ప్రశ్నలు
RRB JE 2024 ఎలా అప్లయ్ చేయాలంటే :
RRB JE 2024 రిక్రూట్‌మెంట్ కోసం RRB JE 2024 Notifcation లో వివరంగా ఇచ్చారు.
1) అధికారిక RRB వెబ్‌సైట్‌ను సందర్శించండి.
2) RRB JE 2024 రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని లేదా మీరు ఎక్కడికి చెందిన వారో ఎంచుకుని, తెరవండి.
3) RRB JE 2024 అప్లికేషన్ ప్రక్రియ కోసం… మీ పేరు, ఈమెయిల్ ID, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
4) మీ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి సైన్ ఇన్ చేయండి.
5) దరఖాస్తు ఫారమ్‌లో పేర్కొన్న అన్ని వివరాలను పూర్తి చేయాలి
6) మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న పోస్ట్‌ను ఎంచుకోవాలి
7) వీసా, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
8) రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత SUBMIT బటన్ ను క్లిక్ చేయాలి.
దరఖాస్తు ఫీజు
అప్లికేషన్ ఫీజు రూ.500/- చెల్లించాలి. మొదటి దశ CBTకి హాజరైన తర్వాత బ్యాంకు ఛార్జీలు తప్ప రూ.400 తిరిగి RRB చెల్లిస్తుంది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా UPI ద్వారా మాత్రమే ఆన్ లైన్ ఫీజును చెల్లించాలి. అందుకు అయ్యే సర్వీస్ ఛార్జీలను అభ్యర్థి భరించాలి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 30న మొదలవుతుంది. 2024 ఆగస్టు 29న చివరితేది. Application ఫారంలో Modification window ఆగస్టు 30న ప్రారంభమై సెప్టెంబర్ 8, 2024తో ముగుస్తుంది.
లాస్ట్ డేట్ ఆగస్ట్ 29..
పూర్తి నోటిఫికేషన్ rrbald.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది.