కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన SSC Combined Graduate Level Examination – 2024 (SSC CGL-2024) (టైర్-1) సమాధానాల Preliminary Keyని Staff Selection Commission (SSC) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ సెంటర్లలో September 9 నుంచి 26 వతేదీ దాకా Computer based testలు నిర్వహించారు.
ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ Registered Login ID, Passwordతో Answers Keyతో పాటు Response Sheetను చూసుకోవచ్చు. Key పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే… రూ.100 చెల్లించి… అక్టోబర్ 3 నుంచి 6లోగా తెలియజేయాలి.
కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని 17,727 ఖాళీలను భర్తీ చేయడానికి ఈసారి SSC CGL నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ టైర్-1లో కటాఫ్ మార్కులు తెచ్చుకున్న వారిని టైర్-2 ఎగ్జామ్ కి అనుమతిస్తారు. తర్వాత Data entry speed test, PSM, Medical Tests, Documents verification నిర్వహించి ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Website : https://ssc.nic.in/