SSC GD Constable Recruitment : కేంద్ర సాయుధ బలగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. BSF, CISF, SSB, CRPF, SSF, ITBP, Assam Rifles, Narcotics Control Bureau లో మొత్తం 39,481 కానిస్టేబుల్ (GD) పోస్టుల్ని భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 14వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
Application Fees అక్టోబర్ 15 రాత్రి 11 గంటల వరకు చెల్లించవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశముందని SSC (Staff Selection Commission) తెలిపింది. ఇంగ్లిష్, హిందీ భాషలతో పాటు… తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ GD Constablee పరీక్ష నిర్వహిస్తారు.
ఏ విభాగంలో ఎన్ని ?
SSC రిలీజ్ చేసిన GD Notification లో 39,481 ఉద్యోగాలు ఉన్నాయి. వీటిల్లో 35,612 పురుషులు, 3869 మహిళా కేటగిరీలో భర్తీ చేస్తారు. BSF లో అత్యధికంగా 15,654 పోస్టులు, CISFలో : 7,145; CRPFg 11,541; SSBలో 819; ITBPలో 3017; ARర్‌లో 1248; SSFలో 35, NCBలో 22 చొప్పున ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
నోటిఫికేషన్ లో ముఖ్యాంశాలు:
వేతనం: పే లెవెల్ -1 కింద NCBలో సిఫాయి ఉద్యోగాలకు రూ.18 వేల నుంచి 56,900 వరకూ ఇస్తారు. ఇతర పోస్టులకు పే లెవెల్-3 కింద (రూ. 21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది.
అభ్యర్థుల వయసు: జనవరి 1, 2025 నాటికి 18 నుంచి 23 ఏళ్లు మించరాదు. వివిధ వర్గాలకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
Application Fees: Rs.100 ( Women, SC/ST/Ex-Servicemen వర్గాలకు మినహాయింపు)
ఎలా ఎంపిక చేస్తారు ?
Computer based test (CBT), PET/PST వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
CBT ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. 60 నిమిషాల durationలో మొత్తం 80 ప్రశ్నలకు 160 మార్కులకు ప్రశ్నాపత్రం రాయాలి
ఎగ్జామ్ లో ఏమేమి ఉంటాయంటే :
General Intelligence, Reasoning, General Knowledge, General Awareness, Elementary Mathematics;
English/ Hindi సబ్జెక్టుల్లో ఒక్కో అంశంలో 20 ప్రశ్నలు చొప్పున మొత్తం 80 ప్రశ్నలు ఇస్తారు.
ఒక్కో తప్పు సమాధానానికి పావు వంతు నెగిటివ్ మార్కు ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్ : చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం
తెలంగాణ : హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి