Staff selection commission (SSC) నిర్వహించే GD Constables పరీక్షలకు T-SAT లో ఉచితంగా క్లాసులు నిర్వహిస్తున్నారు. మొత్తం 39,481 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి SSC నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ exam కి ప్రిపేర్ అయ్యేవారికి సోమవారం (21 అక్టోబర్ 2024) నుంచి 2025 జనవరి 31 దాకా టీశాట్ నెట్ వర్క్ ఛానెళ్ళల్లో క్లాసులు జరుగుతాయి. ఈ పోస్టుల్లో తెలంగాణలో 718, ఏపీలో 908 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
SSC GD Constables ఎగ్జామ్ కి తగ్గట్టుగా T-SAT ప్రత్యేకంగా లెసన్స్ తో ప్రణాళిక తయారు చేసింది. 112 రోజుల పాటు ఈ ఆన్ లైన్ క్లాసులు జరుగుతాయి. ఇందులో మొత్తం 448 episodes లో 224 గంటల క్లాసులను నెట్ వర్క్ ఛానెల్స్, you tube channels ద్వారా ప్రసారం చేస్తున్నారు.
T-SAT లో క్లాసుల టైమింగ్స్
ప్రతి సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7గంటల వరకూ విద్యా ఛానెల్ లో ఇస్తారు. తెల్లారి 5 గంటల నుంచి 7 గంటల వరకూ ప్రసారం చేస్తారు. నవంబర్ 17 న నిర్వహించే TGPSC గ్రూప్ 3 పోస్టుల కంటెంట్ ను మరో రెండు గంటల పాటు అదనంగా అందిస్తున్నట్టు TSAT CEO వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.