తెలంగాణలో 2024-25 సంవత్సరం నుంచి SC విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, Scholarships వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. కేంద్రం గైడ్ లైన్స్ తో దరఖాస్తు విధానంలోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. ST, BC, మైనార్టీ, EBC విద్యార్థులు మాత్రం గతంలో ఉన్న విధానంలోనే అప్లయ్ చేయాలి.
e-pass websiteలో దరఖాస్తు
SC విద్యార్థులకు ప్రభుత్వం ఈ- పాస్ websiteలో దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది. 2024-25లో కొత్తగా చేరినవాళ్ళు, ఇప్పటికే చదువుతున్న విద్యార్థులు అప్లయ్ చేసుకోవాలి.
డెమోగ్రాఫిక్ మ్యాచింగ్, బయోమెట్రిక్ ఆథెంటికేషన్.. తర్వాత అప్లికేషన్ పూర్తిచేయాలి. డే స్కాలర్, కాలేజీల అనుబంధ హాస్టళ్ల విద్యార్థులు కూడా ఇలాగే పూర్తి చేయాలి.
డెమోగ్రాఫిక్ ఆథెంటికేషన్ కోసం ఆధార్ లోని పేరు, పదో తరగతి ధ్రువీకరణ పత్రంలో పేరుతో మ్యాచ్ అవ్వాలి. టెన్త్ హాల్ టికెట్ నంబరు, Date of Birth, ఉత్తీర్ణత సాధించిన ఏడాది రెగ్యు లర్/ప్రైవేటు వివరాలు నమోదు చేయాలి.
విద్యార్థి పేరు, తండ్రి పేరు,+7 పుట్టిన తేదీ, జెండర్, కులం, ఉపకులం, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, చదువుతున్న యూనివర్సిటీ/ బోర్డు, కాలేజీ పేరు, ఊరు ఎంటర్ చేసి.. సబ్మిట్ చేయాలి.
• డెమో ఆథెంటికేషన్ లో ఆధార్.. టెన్త్ వివరాలు సమానంగా ఉంటే.. సక్సెస్ మెసేజ్ వస్తుంది. డెమోగ్రాఫిక్ ధ్రువీకరణ ఫెయిలైతే ఆధార్ లో మార్పులు చేసి ధృవీకరిస్తే అప్లికేషన్ నంబరు వస్తుంది.
• ఆ వివరాలతో మీ సేవ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఇవ్వాలి. అప్పుడే రెండోదశ దరఖాస్తు పూర్తవుతుంది.
బయోమెట్రిక్ పూర్తయిన తరువాత.. వివరాలు నమోదు చేస్తేనే దరఖాస్తు పూర్తవుతుంది. దీన్ని పరిశీలన కోసం కాలేజీల్లో ఇవ్వాలి.