Telangana Job Calendar : పోస్టుల సంఖ్య లేకుండా జాబ్ క్యాలెండర్

Telangana Job Calendar : పోస్టుల సంఖ్య లేకుండా జాబ్ క్యాలెండర్

తెలంగాణ ప్రభుత్వం జాబ్ కేలండర్ రిలీజ్ చేసింది. కానీ ఏడాది కాలంలో తాము భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్యను ప్రకటించలేదు. జాబ్ కేలండర్ పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ ప్రకటన సీఎం  రేవంత్ రెడ్డి చేస్తారు అనుకుంటే… ఆయన వేరే ప్రోగ్రామ్ కి వెళ్ళారు. అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టితో ముగుస్తుండటంతో… డిప్యూటీ సీఎం ప్రకటన చేశారు. జాబ్ కేలండర్ కి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు.  దాని గురించి కూడా ఎలాంటి ఊసు లేదు. డిప్యూటీ సీఎం ప్రకటన తర్వాత… BRS సభ్యులు మాట్లాడే ఛాన్స్ ఇవ్వమని అడిగారు… ఇది ప్రకటన మాత్రమే… దానికి డిస్కషన్ ఉండదు అంటూ… డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క… అసెంబ్లీ రూల్ బుక్ తీసి చదివారు… దీని మీద BRS లీడర్లు మండిపడుతున్నారు… ఉద్యోగాల సంఖ్య వెల్లడించకుండా ప్రభుత్వం అసెంబ్లీలో జాబ్ కేలండర్ ప్రకటించడం మీద ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది… నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిందని BRS MLA లు, MLC లు… హైదరాబాద్ గన్ పార్కులో ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు…నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు అన్నది మాత్రం జాబ్ కేలండర్ లో ప్రకటించారు.

OCTOBER లో ట్రాన్స్ కో… డిస్కల ఇంజినీరింగ్, AEE పోస్టులకు నోటిఫికేషన్

నవంబర్ లో టెట్ నోటఫికేషన్

అక్టోబర్ లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్

2025 ఫిబ్రవరిలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కొత్త నోటిఫికేషన్ కి

2025 జులైలో గ్రూప్ 1 మెయిన్స్

2025 ఫిబ్రవరిలో డీఎస్సీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్

2025 ఏప్రిల్ లో SI, CONSTABLE నోటిఫికేషన్

ఆగస్టులు పోలీస్ ఉద్యోగాల రిటన్ టెస్ట్

2025 జూన్ లో గురుకుల లెక్చరర్స్ నోటిఫికేషన్

2025 మే లో మళ్ళీ కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది.

పూర్తి వివరాలకు ఈ PDF చూడండి.

JOB CALENDAR

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!