తెలంగాణలో రెవెన్యూ శాఖలో కొత్తగా 5 వేల పోస్టులను భర్తీ చేయబోతున్నారు. డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. పోస్టు పేరు : జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ లేదా విలేజ్ రెవెన్యూ సెక్రటరీ ఉండే ఛాన్సుంది. గతంలో VRO స్థానంలో JROల నియామకం చేపట్టబోతున్నారు. రెవెన్యూ సదస్సులోనూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన చేశారు. తెలంగాణలో మొత్తం 10 వేల 54 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిల్లో సగం గ్రామాలకు జూనియర్ రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన సగం పోస్టులు … ప్రస్తుత రెవెన్యూ ఉద్యోగులు VRO, VRAలతో సర్దుబాటు చేస్తారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. రైతులు, విద్యార్థులకు ఇబ్బందులు… సర్టిఫికెట్ల విషయంలో గ్రౌండ్ లెవల్ ఎంక్వైరీ ఉండట్లేదు. క్యాస్ట్, ఇన్ కం, రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు… పంచనామాలు, భూముల రికార్డులు లాంటి వాటికి ఇబ్బంది ఏర్పడింది. ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపుకి JROలు కీలకం కానుంది. భూ సర్వేలక సహాయకారిగా ఉండటం… విపత్తులు, ఇతర అత్యవసర సేవల్లో సహకారం అందిస్తారు. JRO లు లేదా VRS లకు డ్యూటీ ఛార్ట్ కూడా ప్రభుత్వం రెడీ చేస్తోంది. 2020 అక్టోబర్ కి ముందు గ్రామస్థాయిలో VRO, VRA లు ఉన్నారు. ఈ రెండు పోస్టుల్లో 25,750 మంది పనిచేశారు… ఈ వ్యవస్థను BRS రద్దు చేసింది…
JRO ల రిక్రూట్ మెంట్ ఎలా ?
డిగ్రీ అర్హతతో కొత్తగా జూనియర్ రెవెన్యూ ఆఫీసర్లను తీసుకోవాలని భూపరిపాలన ప్రధాన కమిషన్ (CCLA) నుంచి రెవెన్యూశాఖకు ప్రతిపాదనలు వచ్చాయి. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ROR 2024 చట్టం వస్తోంది. అప్పుడే… గ్రామాలకు రెవెన్యూ ఆఫీసర్ల నియామకంపై ప్రభుత్వం ప్రకటన చేసే ఛాన్సుంది. ఈ పోస్టులకు అర్హత డిగ్రీ ఉంటుంది. TGPSC ద్వారానే ఈ 5 వేల పోస్టులు భర్తీకి ఛాన్స్ ఉంటుంది. గతంలో VRO కు ఉన్న సిలబస్ నే కొనసాగించే ఛాన్స్. లేదంటే… గ్రూప్ 4 తీసేశారు కాబట్టి… గ్రూప్ 3 పోస్టుల్లో JRO పోస్టులు భర్తీ చేసే అవకాశం కూడా ఉంది. JRO 5000 Postsలను గ్రూప్ 3లో కలిపితే నెక్ట్స్ 2025 జులైలో వచ్చే కొత్త నోటిఫికేషన్ లో వీటిని చూపించనున్నారు. గత నోటిఫికేషన్ కి ఈ నవంబర్ లో ఎగ్జామ్ ఉంది కాబట్టి…. నెక్ట్స్ నోటిఫికేషన్ లో 5 వేల పోస్టులు యాడ్ చేస్తారు. మళ్ళీ నవంబర్ 2025 లో గ్రూప్ 3 ఎగ్జామ్ జరుగుతుంది.