తెలంగాణ ఉద్యమంలో వినూత్న నిరసనలు

తెలంగాణ ఉద్యమంలో వినూత్న నిరసనలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటాల్లో భాగంగా కొన్ని కార్యక్రమాలు, వినూత్న నిరసనలు జరిగాయి. వీటిపై తెలంగాణలో జరిగే గ్రూప్స్ తో పాటు పోలీస్ ఇతర అన్ని ఉద్యోగ నియామక పరీక్షల్లో తప్పకుండా ప్రశ్నలు వస్తాయి.  అందుకే ఈ నిరసనల గురించి Material రూపంలో మన Telangana Exams plus app తో పాటు… Exams Centre247 app & Website ద్వారా అభ్యర్థులకు అందిస్తున్నాం.

శ్రీ కృష్ణ కమిటీ నివేదిక  అస్పష్టంగా ఉండటం, తెలంగాణ ప్రజలు అనుకున్న రీతిలో ఉండకపోవడంతో… ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైంది. తెలంగాణ సమాజంలో వివిధ వర్గాల వారు… విభిన్న రీతుల్లో నిరసనలు చేపట్టారు.  ఈ నిరసనలు దేశంలో వివిధ రాజకీయ పార్టీల నేతలును ఆలోచింపజేశాయి. దాంతో తెలంగాణ ఏర్పాటు తప్పదని కేంద్రంలో ఉన్న అప్పటి UPA ప్రభుత్వం భావించింది.

సహాయ నిరాకరణ ఉద్యమం

తెలంగాణ పొలిటికల్ JAC ( Telangana Political Joint Action Committee) ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగులు, ఉద్యమకారులు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 2011, ఫిబ్రవరి 17న ప్రారంబించి మార్చి 1 వరకు మొత్తం 16 రోజులపాటు నిర్వహించారు. తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులు అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేశారు. కానీ విధులు నిర్వహించకుండా నల్లబ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలిపారు. ఈ ఉద్యమాన్ని కేంద్రంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సమయంలో, రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల టైమ్ లో నిర్వహించడంతో… రాష్ట్ర ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది.

  • సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 2011 ఫిబ్రవరి 17న ప్రారంభించినా… దీని షెడ్యూల్ ను JAC ఫిబ్రవరి 12నే ప్రకటించింది.
  • 2011 ఫిబ్రవరి 18న తెలంగాణ ప్రాంతమంతా గ్రామ గ్రామాన చాటింపులు, ప్రతి ఒక్కరితో దీక్షా కంకణం కట్టించడం.
  • ఫిబ్రవరి 14న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు,
  • ఫిబ్రవరి 15న జైల్ భరో, 16న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు నిర్వహించారు.
  • ప్రజలు కూడా తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను ఘెరావ్ చేశారు. ప్రజాభిప్రాయం ప్రకారం రాజీనామా చేయాలని ప్రజా ప్రతినిధులను నిలదీశారు.
  • సహా నిరాకరణ ఉద్యమంలో దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు స్వచ్చందంగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఉద్యోగులు పెన్ డౌన్, కార్మికులు టూల్ డౌన్, ఉపాధ్యాయులు చాక్ డౌన్, కంప్యూటర్ ఆపరేటర్లు మౌస్ డౌన్ లాంటి కార్యక్రమాల ద్వారా నిరసనలు కొనసాగించారు. దాంతో తెలంగాణలో పరిపాలన స్తంబించిపోయింది..

ఈ ఉద్యమంతో రాష్ట్ర ప్రభుత్వానికి రావల్సిన ట్యాక్సులు, విద్యుత్తు బకాయిలు, రిజిస్ట్రేషన్ డ్యూటీలు లాంటి కలిపి ఈ 16 రోజుల్లో దాదాపు రూ.12,800 కోట్ల ఆదాయం నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల ముందు పికెటింగ్స్, రాస్తారోకోలు, పట్టణాల్లో ‘వాక్ ఫర్ తెలంగాణ’, గ్రామాల్లో ‘ప్రభాత భేరి’ కార్యక్రమాలు జరిగాయి.

మార్చి 1న నిర్వహించిన ‘పల్లె పల్లె పట్టాల పైకి అనే కార్యక్రమం ద్వారా రైల్ రోకో, రైల్ బంద్ నిర్వహించడంతో తెలంగాణ నుంచి నడిచే రైళ్లను ఇతర మార్గాలకు మళ్లించారు. దాంతో దేశవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమ సెగ తగిలింది. దక్షిణ మధ్య రైల్వేలోనూ తెలంగాణ ప్రాంతానికి చెందిన రైల్వే ఉద్యోగుల JAC ఈ ఉద్యమంలో పాల్గొంది. ఈ ఉద్యమ కాలంలో రాష్ట్ర అసెంబ్లీ, లోకసభ సమావేశాల్లో TRS (BRS) సభ్యులు ప్రత్యేక రాష్ట్ర వాదనలు వినిపిస్తూ నిరసన తెలిపారు.

2011 ఫిబ్రవరి 22, 28 తేదీల్లో 48 గంటలపాటు సంపూర్ణ తెలంగాణ బంద్ జరిగింది. సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో విద్యుత్తు కేంద్రాలకు, సిమెంటు పరిశ్రమలకు బొగ్గు సప్లయ్ ఆగిపోయింది. 2011 ఫిబ్రవరి 23న తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ సభ్యుల…. జై తెలంగాణ నినాదాలతో లోక్ సభ దద్దరిల్లింది.  తెలంగాణలో సహాయ నిరాకరణ ఉద్యమం 2011 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 4 వరకు కొనసాగింది.

సకలజనుల సమ్మె

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన మరో ఉద్యమం… సకల జనుల సమ్మె. ఇది 2011, సెప్టెంబరు 13 నుంచి అక్టోబరు 24 వరకు అంటే 42 రోజుల పాటు కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను స్పీడప్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమకారులు చేపట్టిన మరో వినూత్న కార్యక్రమం ఇది. తెలంగాణలోని అన్ని వర్గాల వారు ఇందులో పాల్గొన్నారు. సకల జనుల సమ్మెను 42 రోజుల పాటు ఆగకుండా నిర్వహించారు. సకల జనుల సమ్మె ప్రారంభానికి ఒక రోజు ముందుగా 2011 సెప్టెంబరు 12న కరీంనగర్ లో ‘జనగర్జన’ పేరుతో బహిరంగ సభ జరిగింది.  ఈ సభకు కేసీఆర్ తో పాటు తెలంగాణ జేఏస్, బీజేపీ, న్యూడెమోక్రసీ నాయకులు హాజరై సెప్టెంబరు 13 నుంచి సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయించారు. ఆ విధంగా సమ్మె మొదలైంది.

సమ్మెలో భాగంగా రాస్తారోకోలు, రైల్ రోకోలు, మానవహారాలు, ర్యాలీలతో తెలంగాణ దద్దరిల్లింది. ప్రభుత్వ ఆఫీసులు మూతపడ్డాయి. విద్యార్థులు రోడ్లు ఎక్కారు. ఉద్యోగులు, లాయర్లు విధులు బహిష్కరించారు. సింగరేణి పూర్తిగా స్తంబించింది. హైదరాబాద్ తప్ప మిగిలిన తెలంగాణ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆఫీసులు మూతబడ్డాయి. ఆర్టీసీ, విద్యుత్తుశాఖ, సింగరేణి గని కార్మికులు, విద్యార్థులు, లాయర్లు, డాక్టర్లు,  రైతులు, రాజకీయ పార్టీల లీడర్లు దాదాపు మొత్తం పౌర సమాజమంతా ఈ సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

రోడ్లపై వంటావార్పు నిర్వహించారు. రైతులు ట్రాక్టర్ ర్యాలీలు, మహిళలు బతుకమ్మ, బోనాలు, గీత కార్మికులు మోకు ర్యాలీలు, కుమ్మరులు కుండలతో ర్యాలీలు, ఆటోడ్రైవర్లు ఆటో ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సెకల జనుల సమ్మెను అడ్డుకోలేకపోయింది. ఈ సమ్మెతో తెలంగాణ ఉద్యమం తారస్థాయికి చేరింది.  2011, సెప్టెంబరు 13 నుంచి అక్టోబరు 24 వరకు అంటే 42 రోజుల పాటు కొనసాగింది.

మిలియన్ మార్చ్ (2011, మార్చి 10)

మిలియన్ మార్చ్ కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రాంతం మీద గత 55 యేళ్ళుగా తెలంగాణేతర పాలకుల ఆధిపత్యానికి తెరవేయాలన్నది లక్ష్యం.  శ్రీకృష్ణ కమిటీ నివేదిక 8వ అధ్యాయంలో తెలంగాణ ఉద్యమాన్నిఎలా అణచివేయాలో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దానికి నిరసనగా కేసీఆర్ 2011, మార్చి 10న హైదరాబాద్ దిగ్బంధానికి పిలుపునిచ్చారు. అయితే కేసీఆర్ ఈ నిర్ణయాన్ని తెలంగాణ పొలిటికల్ JAC,  ఉస్మానియావర్సిటీ JACని సంప్రదించకుండా…. ఏకపక్షంగా ప్రకటించారు. అయినా… TPJAC, OU విద్యార్థి JAC, ఇతర JACలు కేసీఆర్ ప్రకటనకు మద్దతు తెలిపాయి. KCR సూచించిన “హైదరాబాద్ దిగ్బందం’ బదులుగా ‘మిలియన్ మార్చ్’ పేరుతో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాయి. దాంతో ఉద్యమం రాజకీయ నాయకుల నుంచి ప్రజల చేతుల్లోకి వెళ్ళింది.

మిలియన్ మార్చ్ కార్యక్రమానికి స్ఫూర్తి

ఈజిప్టు దేశాధినేత హోస్నీ ముబారక్ నిరంకుశ పాలన, పోలీసుల అకృత్యాలను నిరసిస్తూ 2011, జనవరి 25 నుంచి ఫిబ్రవరి 11 వరకు 18 రోజులపాటు కైరోలోని తెహిరీర్ స్క్వేర్ లో 5 లక్షల మంది చేసిన కార్యక్రమమే మిలియన్ మార్చ్ కి స్ఫూర్తి  కలిగించింది. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై జరిగిన మిలియన్ మార్చ్ ఒక రోజు మాత్రమే జరిగింది.. తెలంగాణ సాధన కోసం కృషి చేస్తామని జనంతో ప్రమాణం చేయించడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, కోర్టులు అనుమతి ఇవ్వలేదు. అయినా విజయవంతమైంది.

‘మిలియన్’ మార్చ్’ను 2011 మార్చి 10న ఉదయం నిర్వహించాలనుకున్నారు. కానీ ఆ రోజు ఇంటర్మీడియట్ పరీక్షలు ఉండటంతో… తల్లిదండ్రుల విజ్ఞప్తితో మధ్యాహ్నం 1 నుంచి 4 గంటలకు మార్చారు. మిలియన్ మార్చ్ లో పాల్గొనడానికి అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్ కు  వచ్చే విద్యార్థులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడిక్కడ ఆపి వెనక్కి పంపారు. ఎన్ని నిర్భంధఆలు పెట్టినా… దాదాపు 50 వేల మంది ఉద్యమకారులు ట్యాంక్ బండ్ పైకి చేరుకున్నారు. ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించిన కొన్ని ఆంధ్ర నాయకుల విగ్రహాలను ధ్వంసం చేశారు.

1986లో అప్పటి రాష్ట్ర సీఎం ఎన్.టి.రామారావు తెలుగు వాళ్ళకి చెందిన 33 మంది మహనీయుల విగ్రహాలను ట్యాంక్  బండ్ పై ఏర్పాటు చేయించారు.  వాటిల్లో ఏడు మాత్రమే తెలంగాణ ప్రముఖులవి. మిగిలినవి ఆంధ్ర ప్రముఖులవి.  దాంతో ఇది కూడా వివక్షగానే భావించిన ఉద్యమకారులు వాటిల్లో కొన్నింటిని ధ్వంసం చేశారు.

ట్యాంక్ బండ్ పై విగ్రహాల ధ్వంసం తర్వాత. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ, తెలంగాణ పొలిటికల్ జేఎస్ , తెలంగాణ జాగృతి మొదలైన సంఘాలు తెలం రాష్ట్రం ఏర్పాటయ్యే దాకా ట్యాంక్ బండ్ పై వీరిగిన విగ్రహాలను యధాతథంగా ఉంచాలని డిమాండ్ చేశాయి. తెలంగాణకు చెందిన అన్ని JACలు కలసి ‘స్వాబిమాన్ యాత్ర ర్యాలీ’ నిర్వహించాయి. విగ్రహాల ధ్వంసం ఆగ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని పునర్నిర్మించడానికి ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనలతో విరిగిన 16 విగ్రహాలతో పాటు తెలంగాణకు చెందిన కొమురం భీమ్ విగ్రహాన్ని కూడా 2012, అక్టోబరు 5 నాడు ప్రతిష్ఠించారు.

సాగర హారం 2012 సెప్టెంబరు 30:

సాగర హారాన్నే తెలంగాణ మార్చ్ అని కూడా అంటారు. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ నెక్లెస్ రోడ్ లో సాగర హారాన్ని నిర్వహించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్రభుత్వం నిషేదాజ్ఞలు విధించింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు క్యాంపస్ నుంచి బయటికి రాకుండా కట్టడి చేసింది.  అన్ని నిర్బంధాలను ఛేదించి ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో మద్యాహ్నం 2 గంటలకే నెక్లెస్ రోడ్డుకు చేరుకున్నారు. సాయంత్రం 7 గంటలకు అనుమతి ముగిసిన తర్వాత కూడా నిరసన కొనసాగింది.  ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని అర్ధరాత్రి వరకు జై తెలంగాణ నినాదాలు చేస్తూ ఉద్యమించారు. కానీ భారీ వర్షం  కురవడంతో ఎక్కడిక్కడికి వెళ్ళిపోయారు.

సమరదీక్ష (2013 జనవరి 25):

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పొలిటికల్ JAC 2013 జనవరి 25 నుంచి 16 గంటలపాటు ఇందిరా పార్కులో సమర దీక్ష చేయాలని నిర్ణయించింది. అందుకు పోలీసులు ముందు ఒప్పుకోలేదు. ఆ తర్వాత జనవరి 27, 28 తేదీల్లో అనుమతి ఇవ్వడంతో దీక్ష నిర్వహించారు.

చలో అసెంబ్లీ (2013 జూన్ 13):

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టే ప్రక్రియను స్పీడప్ చేయాలంటూ పొలిటికల్ JAC పిలుపుతో 2013, జూన్ 13న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం జరిగింది. తెలంగాణ ప్రజలంతా కదం తొక్క డంతో ఉద్యమం పతాకస్థాయికి చేరింది.

Important Points for Exams

  • తెలంగాణ పొలిటికల్ JAC ( Telangana Political Joint Action Committee) ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగులు, ఉద్యమకారులు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 2011, ఫిబ్రవరి 17న ప్రారంబించి మార్చి 1 వరకు మొత్తం 16 రోజులపాటు నిర్వహించారు
  • 2011 ఫిబ్రవరి 18న తెలంగాణ ప్రాంతమంతా గ్రామ గ్రామాన చాటింపులు, ప్రతి ఒక్కరితో దీక్షా కంకణం కట్టించడం.
  • ఫిబ్రవరి 14న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు,
  • ఫిబ్రవరి 15న జైల్ భరో, 16న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు
  • ఉద్యోగులు పెన్ డౌన్, కార్మికులు టూల్ డౌన్, ఉపాధ్యాయులు చాక్ డౌన్, కంప్యూటర్ ఆపరేటర్లు మౌస్ డౌన్ లాంటి కార్యక్రమాల ద్వారా నిరసనలు
  • ఈ ఉద్యమంతో రాష్ట్ర ప్రభుత్వానికి రావల్సిన ట్యాక్సులు, విద్యుత్తు బకాయిలు, రిజిస్ట్రేషన్ డ్యూటీలు లాంటి కలిపి ఈ 16 రోజుల్లో దాదాపు రూ.12,800 కోట్ల ఆదాయం నిలిచిపోయింది
  • 2011 ఫిబ్రవరి 22, 28 తేదీల్లో 48 గంటలపాటు సంపూర్ణ తెలంగాణ బంద్ జరిగింది. సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో విద్యుత్తు కేంద్రాలకు, సిమెంటు పరిశ్రమలకు బొగ్గు సప్లయ్ ఆగిపోయింది
  • తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన మరో ఉద్యమం… సకల జనుల సమ్మె. ఇది 2011, సెప్టెంబరు 13 నుంచి అక్టోబరు 24 వరకు అంటే 42 రోజుల పాటు కొనసాగింది
  • మిలియన్ మార్చ్ (2011, మార్చి 10) మార్చ్ లో దాదాపు 50 వేల మంది ఉద్యమకారులు ట్యాంక్ బండ్ పైకి చేరుకున్నారు. ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించిన కొన్ని ఆంధ్ర నాయకుల విగ్రహాలను ధ్వంసం చేశారు.
  • మిలియన్ మార్చ్ కార్యక్రమానికి స్ఫూర్తి: ఈజిప్టు దేశాధినేత హోస్నీ ముబారక్ నిరంకుశ పాలన, పోలీసుల అకృత్యాలను నిరసిస్తూ 2011, జనవరి 25 నుంచి ఫిబ్రవరి 11 వరకు 18 రోజులపాటు కైరోలోని తెహిరీర్ స్క్వేర్ లో 5 లక్షల మంది చేసిన కార్యక్రమమే మిలియన్ మార్చ్ కి స్ఫూర్తి కలిగించింది.
  • ట్యాంక్ బండ్ పై విరిగిన 16 విగ్రహాలతో పాటు తెలంగాణకు చెందిన కొమురం భీమ్ విగ్రహాన్ని కూడా 2012, అక్టోబరు 5 నాడు ప్రతిష్ఠించారు.
  • సాగర హారం 2012 సెప్టెంబరు 30: సాగర హారాన్నే తెలంగాణ మార్చ్ అని కూడా అంటారు. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ నెక్లెస్ రోడ్ లో సాగర హారాన్ని నిర్వహించారు
  • సమరదీక్ష (2013 జనవరి 25): జనవరి 27, 28 తేదీల్లో అనుమతి ఇవ్వడంతో దీక్ష నిర్వహించారు.
  • చలో అసెంబ్లీ (2013 జూన్ 13): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టే ప్రక్రియను స్పీడప్ చేయాలంటూ పొలిటికల్ JAC పిలుపుతో 2013, జూన్ 13న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం జరిగింది
administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!