Telangana : టెన్త్ లో సైన్స్ కి రెండు పరీక్షలు… రెండు రోజులు !

Telangana : టెన్త్ లో సైన్స్ కి రెండు పరీక్షలు… రెండు రోజులు !

తెలంగాణలో ప్రస్తుత విద్యా సంవత్సరం (2024-25) నుంచి 9, పది తరగతుల విద్యార్థులకు సైన్స్ లో Physics, Biology Exams వేర్వేరు రోజులు జరుగుతాయి. ఇప్పటి దాకా ఈ రెండింటికి Exam papers వేర్వేరుగానే ఇస్తున్నారు. కానీ ఒకే రోజు రెండు పరీక్షలు జరుగుతున్నాయి. కానీ ఈ విద్యాసంవత్సం నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒకరోజు… బయాలజీ ఎగ్జామ్ మరో రోజు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ జీవో జారీ చేసింది.

ఒక్కో ఎగ్జామ్ టైమ్ ఎంతంటే ?

గత ఏడాది వరకు ఫిజిక్స్, బయాలజీ ఎగ్జామ్స్ ఒక దాని తర్వాత మరొకటి ఒకే రోజు నిర్వహించేవారు. ఒక్కో పరీక్షకు గంటన్నర టైమ్ ఉండేది. మొదటి పరీక్ష ఫిజిక్స్ ని విద్యార్థులు పూర్తి చేయకపోయినా… ఆ ఆన్సర్ పేపర్లు తీసుకొని… వెంటనే మళ్లీ మరో ఎగ్జామ్ నిర్వహించే వారు. అందుకోసం అదనంగా 20 నిమిషాల టైమ్ ఉండేది. ఇప్పుడు ఫిజక్స్, బయాలజీ వేర్వేరు రోజుల్లో ఉండటంతో… ఒక్కో పరీక్షకు గంటన్నర టైమ్ ఇవ్వనున్నారు.
ఈ రెండూ కాకుండా నైన్త్, టెన్త్ లో మిగిలిన సబ్జెక్టులకు ఒకటే పేపర్ ఉంటుంది. వాటికి యధావిధఇగా 3 గంటల టైమ్ ఇస్తారు. ఛాయిస్ కూడా గతంలో ఎలా ఉందో అలాగే ఉంటుంది… ఎలాంటి మార్పు లేదు. ఈ రూల్స్ నైన్త్, టెన్త్ పరీక్షలు రెండింటికీ వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!