TG GOVT SCHEMES
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ పథకాలు.. 2024-25 రాష్ట్ర బడ్జెట్లో ఆయా పథకాలకు ఎంత కేటాయింపులు చేశారు.
రెండు ఫ్రైళ్లపై సంతకాలు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంటే… 2023 డిసెంబర్ 7 మొదటి రోజు రోజు రెండు ఫైళ్లపై సీఎం రేవంత్ రెడ్డి సంతకాలు చేశారు. అవి
1) ఆరు గ్యారంటీల ముసాయిదా
2) దివ్యాంగురాలైన రజనీకి ఉద్యోగం
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏంటి అంటే.. ఆ పార్టీ మేనిఫెస్టోలో వీటిని పెట్టారు… మీకు తెలుసు
1) గృహజ్యోతి
2) రైతు భరోసా
8) చేయూత
4) ఇందిరమ్మ ఇండ్లు
5) మహాలక్ష్మి
6) యువ వికాసం
ఆరు గ్యారంటీల పథకాలకు… 2024-25 రాష్ట్ర బడ్జెట్ లో మొత్తం 47 వేల 167 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.
మహాలక్ష్మి పథకం
ఈ పథకాన్ని 2023, డిసెంబర్ 9న ప్రారంభించారు. ఇందులో మళ్ళీ మూడు ఉప పథకాలు… sub schemes ఉన్నాయి.
అందులో
1) RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
2) రూ.500కే గ్యాస్ సిలిండర్
8) మహిళలకు ప్రతి నెలా రూ.2500
మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పథకం 2023 డిసెంబర్ 9న స్టార్ట్ అయింది. ఆర్టీసీ బస్సుల్లో తొలి ఉచిత టికెట్ పొందినది బాక్సర్ నిఖత్ జరీన్.
జన్ ధన్ ఖాతాలకు పదేళ్ళు: పదేళ్ళ ప్రస్థానంపై స్పెషల్
ఫ్రీ బస్సు విధివిధానాలు ఏంటి అంటే….
తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న అన్ని వయసుల బాలికలు, మహిళలు, లింగమార్పిడి వ్యక్తులు దీనికి అర్హులు. తెలంగాణ రాష్ట్రంలోని పల్లె వెలుగు, ఎక్స్ ప్రైస్, హైదరాబాద్‌లో సిటీ ఆర్డినరీ, మెట్రో EXPRESS బస్సుల్లో రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రయాణ సమయంలో స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డు చూపించాలి. దాన్ని ఒరిజినల్ ఆధార్ కార్డుని ప్రమాణంగా తీసుకున్నారు. బస్సులో ప్రయాణం చేసే మహిళలకు జీరో టికెట్ ఇస్తున్నారు. 2024-25 బడ్జెట్ లో మహాలక్ష్మి… ఉచిత బస్సు ప్రయాణం కోసం… 4 వేల 84 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
రూ.500కే గ్యాస్ సిలిండర్
మహాలక్ష్మి పథకంలో మరో ఉప పథకం ఏంటంటే… రూ.500కే గ్యాస్ సిలిండర్. ఈ పథకాన్ని 2024, ఫిబ్రవరి 27న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం- మహిళా సాధికారత, పొగరహిత వంట కోసం… ఈ గ్యాస్ సిలెండర్ పథకంలో అబ్దిదారులను గుర్తించేందుకు ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఇచ్చారు. 500 కే గ్యాస్ సిలెండర్ స్కీమ్ లో రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారులు 39 లక్షల 57 వేల 637 కుటుంబాలను ఈ పథకం కింద గుర్తించారు. వీళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉండాలి. అర్హులైన లబ్దిదారుల పేరు మీద LPG గ్యాస్ కనెక్షన్ ఉండాలి. గత మూడేండ్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని దాని యావరేజ్ ఆధారంగా సిలిండర్లను కేటాయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరం బడ్జెట్ లో 723 కోట్ల రూపాయలను ఈ 500 సిలెండర్ పథకానికి కేటాయించింది.
మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా నెలకు రూ.2500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీల్లో తెలిపింది. అందుకోసం గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో 4 వేల 500 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. తాజా బడ్జెట్ లో ఈ కేటాయింపులను తొలగించింది.
చేయూత పథకం
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరో పథకం… చేయూత. ఈ పథకంలో రెండు కార్యక్రమాలు ఉన్నాయి. అందులో 1) 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రెండో… వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు రూ.4 వేల నెలవారీ పెన్షన్ ఈ పథకం ఇంకా అమల్లోకి రాలేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫించన్ చెల్లింపుల కోసం… చేయూత పథకానికి 22 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్ లో కేటాయించింది. ప్రస్తుతం పెంచకముందు ఫించన్లకు 12 వేల కోట్లు ఖర్చవుతున్నాయి. 2024-25 బడ్జెట్ లో ఈ 14 వేల 861 కోట్లు కేటాయించారు. ఇందులో సాధారణ ఫించన్ దారులకు నెలకు 2 వేల 16 రూపాయలు, దివ్యాంగులకు నెలకు 3 వేల 16 రూపాయలను అందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీ మేరకు దాన్ని సాధారణ ఫించన్ దారులకు 4 వేలు, దివ్యాంగులకు 6 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది.
రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంకో పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా. 2023, డిసెంబర్ 9న శాసనసభ ఆవరణలో రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకం ప్రారంభించారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం ‘ఆరోగ్య భద్రత కల్పించడం’. గతంలో రూ.5 లక్షల వరకు కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందించేవారు. దీన్ని ప్రస్తుతం రూ.10 లక్షలకు పెంచింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ పథకం BPL (Below poverty line) రేఖకు దిగువన ఉన్న 90 లక్షల 10 వేల కుటుంబాలకు వర్తింపజేస్తారు. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకం కింద… 2024-25 బడ్జెట్ లో ఒక వెయ్యి 65 కోట్ల రూపాయలను కేటాయించారు.
గృహజ్యోతి
తెలంగాణ ప్రభుత్వంలో మరో పథకం గృహజ్యోతి. ఈ గృహజ్యోతి పథకాన్ని 2024, ఫిబ్రవరి 27న సచివాలయంలో ప్రారంభించారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం- గృహ అవసరాలకు, 200 యూనిట్లలోపు గల వారికి ఉచిత విద్యుత్ అందించడం.
ఈ పథకం విధివిధానాలు
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు అవకాశం కల్పించారు. వాళ్ళల్లో తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండి వాటిని లింక్ చేసి ఉండాలి. ఇది కేవలం గృహ అవసరాలకు మాత్రమే వర్తిస్తుంది. బిజినెస్ చేసుకునే వారికి కాదు… ఈ పథకానికి సంబంధించిన జీరో కరెంట్ బిల్లులను జారీ చేస్తున్నారు. 2024 మార్చి మొదటి వారం నుంచి జీరో బిల్లులు జారీ అవుతున్నాయి. బడ్జెట్ కేటాయింపులను చూస్తే…2024-25 సంవత్సరానికి సంబంధించి గృహజ్యోతికి ఇచ్చిన బడ్జెట్ కేటాయింపులు చూస్తే…. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 2 వేల 418 కోట్లు కేటాయించింది. ఈ పథకంలో భాగంగా 2024 జులై 15 నాటికి 45 లక్షల 81 వేల 676 ఇళ్ళకు జీరో కరెంట్ బిల్లులు జారీ అయినట్టు ప్రభుత్వం బడ్జెట్ లో తెలిపింది.
ఇందిరమ్మ ఇండ్ల పథకం.
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మరో ప్రతిష్టాత్మక స్కీమ్… ఇందిరమ్మ ఇండ్ల పథకం. 2024, మార్చి 11న భద్రాచలంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల ముఖ్య ఉద్దేశ్యం…
- ఇల్లు లేని వారికి ఇంటి స్థలం + రూ.5 లక్షలు
- సొంత ఇంటి స్థలం కలిగి ఉంటే… వాళ్ళకి రూ.5 లక్షలు ఇస్తారు.
- ఇదే స్కీమ్ లో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తారు.
- ఇందిరమ్మ ఇండ్లు పొందడానికి… ఆహార భద్రత కార్డు ఆధారం చేసుకొని లబ్ధిదారుల గుర్తిస్తారు.
- లబ్దిదారుడు దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి. అంటే పేదవాళ్ళయి ఉండాలి.
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే మొత్తం 4 లక్షల 16 వేల 500 వందల ఇళ్ళు వస్తాయి. రాష్ట్ర రిజర్వు కింద… మరో 33 వేల 500 ఇళ్ళను కేటాయించింది… మొత్తమ్మీద ప్రభుత్వం ఏడాదికి నాలుగున్నర లక్షల ఇండ్లను నిర్మించబోతోంది. ఇందిరమ్మ ఇల్లుని మహిళల పేరుతోనే మంజూరు చేస్తారు. జిల్లా ఇన్చార్జి మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇండ్లు మంజూరు చేస్తారు. గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాత కలెక్టర్ ఎంపిక చేస్తారు. ఇందిరమ్మ ఇళ్ళకు నాలుగు దశల్లో సబ్సిడీ లబ్దిదారులకు అందుతుంది.
అందులో
1) బేస్మెంట్ స్థాయి- రూ.1 లక్ష
2) పై కప్పు స్థాయి- రూ.1 లక్ష
8) పై కప్పు నిర్మాణం తర్వాత-రూ.2 లక్షలు
4) నిర్మాణం పూర్తయిన తర్వాత- మరో లక్ష… మొత్తం 5 లక్షల రూపాయలను ఒక్కో ఇంటి నిర్మాణానికి లబ్దిదారుడికి అందిస్తారు.
ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పథకం… అయితే 2024-25 రాష్ట్ర బడ్జెట్ లో ఈ పథకానికి కేటాయింపులు ఎలా ఉన్నాయంటే…అంతకుముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఇందిరమ్మ ఇళ్ళపథకానికి 7 వేల 740 కోట్లను ప్రతిపాదించింది… లేటెస్ట్ రాష్ట్ర బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ లో 9 వేల 184 కోట్లుగా పేర్కొంది. 2023-24 లో అప్పటి ప్రభుత్వం 12 వేల కోట్లు గృహ నిర్మాణానికి కేటాయించింది… ప్రస్తుత సర్కార్ ఒక్కో ఇంటి నిర్మాణానికి SC, ST లబ్దిదారులకైతే… 6 లక్షలు, ఇతర వర్గాల వారికి 5 లక్షల రూపాయలను అందించనుంది.
ఇందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్ళ పథకం కింద 4 వేల 644 కోట్ల రూపాయల ఆర్థిక సాయం కేంద్రం నుంచి అందుతుందని స్టేట్ గవర్నమెంట్ అంచనా వేసింది. ఇందిరమ్మ ఇళ్ళ కోసం రాష్ట్రంలో ప్రజాపాలన ద్వారా మొత్తం 82 లక్షల 82 వేల 332 మంది లబ్దిదారులు అప్లయ్ చేసుకున్నారు. వీళ్ళ నుంచి అర్హులను ఎంపిక చేస్తారు.
అభయహస్తం లోగో – ప్రజాపాలన
2023, డిసెంబర్ 27న అభయహస్తం లోగో, ప్రజాపాలన లోగోను ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఆరు గ్యారంటీలతో పాటు… ఇతర పథకాలకు అప్లయ్ చేసుకోడానికి ప్రజాపాలన పేరుతో గ్రామసభలను నిర్వహించారు. 2023, డిసెంబర్ 28 నుంచి 2024, జనవరి 6 వరకు ప్రజాపాలనలో లబ్దిదారులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ ప్రజాపాలన దరఖాస్తులో 5 పథకాల వివరాలు ఉన్నాయి. ఇందులో లేనిది యువ వికాసం. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలుకు 2024, జనవరి 8న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఈ మంత్రివర్గ ఉప సంఘంలోని సభ్యులు ఎవరంటే… ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్ గా వ్యవహరిస్తారు. అలాగే మిగతా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర సభ్యులుగా ఉన్నారు. ప్రజాపాలనలో 1 కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. అభయహస్తం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 2024-25 మధ్యంతర బడ్జెట్లో 58 వేల 196 కోట్లు కేటాయించింది.
తెలంగాణ మహిళాశక్తి
ఈ పథకాన్ని 2024, మార్చి 12న సీఎం రేవంత్ రెడ్డి… సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రారంభించారు. ఈ పథకం ఉద్దేశం: మహిళా సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలను మళ్ళీ ప్రారంభించారు. ఈ పథకం 2014 నుంచి అమల్లో ఉంది. 2019-20 నుంచి నిధులు నిలిపివేశారు. దాంతో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక… తిరిగి మహిళా శక్తి పథకాన్ని ప్రవేశ పెట్టింది. 2024-25 రాష్ట్ర బడ్జెట్ లో ఈ మహిళలకు వడ్డీలేని రుణాలను అందించే మహిళా శక్తి పథకానరికి 13 వందల 2 కోట్ల రూపాయలను కేటాయించారు. వీరికి క్యాంటీన్లను మంజూరు చేయడంతో పాటు… ఇతరత్రా పథకాల కింద మహిళలకు ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. అందుకోసం తాజాగా బడ్జెట్ లో 80 కోట్ల 90 లక్షలను కేటాయించారు.
తెలంగాణ మహిళా శక్తి పథకం విధివిధానాలు
ఒక్కో గ్రామ పరిధిలో రూ. కోటి వరకు రుణం అందిస్తారు. మొదటి ఏడాదిలో 5 వేల గ్రామాలకు రూ.5000 కోట్ల రుణాలను అందించనున్నారు. మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రత్యేకంగా రుణ బీమా పథకం అమలుకు హామీ ఇచ్చారు. అందే దురదృష్టవశాత్తూ… సభ్యులు మరణిస్తే వారి రుణాలను మాఫీ చేస్తారు. అందుకోసం బీమాను అమలు చేయనున్నారు. ఇక 63 లక్షల 86 వేల మంది మహిళలకు 2 లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. తెలంగాణ స్టేట్ బడ్జెట్ లో బీమాకు కూడా నిధులను కేటాయించారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే మహిళా సంఘాల సభ్యురాళ్ళకు 2 లక్షల ప్రమాద బీమా పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో 96 వేల 53 కోట్ల రూపాయలను కేటాయించింది.
టీ–సేఫ్
కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చిన మరో ప్రోగ్రామ్ .. టీ సేఫ్. ట్రావెల్ సేఫ్‌ను 2024, మార్చి 12న ప్రారంభించారు దీని ఉద్దేశం మహిళలు, చిన్నారుల కోసం భారతదేశంలోనే మొట్ట మొదటి రైడ్ మానిటరింగ్ సర్వీస్ ఇది. ఈ టీ సేఫ్‌ను పోలీస్ శాఖ నిర్వహిస్తుంది. ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ఆపద సమయంలో రక్షించడం కోసం దీన్ని ప్రవేశ పెట్టారు. ఈ సేవలు స్మార్ట్ ఫోన్, ప్రాథమిక ఫోన్లలో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫోన్ ద్వారా 100 లేదా 112 నంబర్‌కు కాల్ చేసి IVR OPTION ద్వారా 8 నంబర్‌ను ఎంపిక చేసుకొని ఈ సేవలను పొందవచ్చు.
గిగ్ వర్మర్ల కోసం ప్రమాద బీమా
ఈ పథకాన్ని 2023, డిసెంబర్ 24న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం ద్వారా పుడ్ డెలివరీ, క్యాబ్‌లు, ఆటోరిక్షా కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా అందిస్తారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం 10 లక్షల ఆరోగ్య భద్రతను కూడా కల్పిస్తుంది. ఆ ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది.
అమ్మ కోసం
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన మరో పథకం అమ్మ కోసం. ఆ పథకాన్ని 2024, మార్చి 11న ప్రారంభించారు. దీని ఉద్దేశం కొత్తగా ప్రసవించిన తల్లుల కోసం. బిడ్డ ప్రసవించిన ఏడాది పాటు మహిళల మానసిక ఆరోగ్యం, ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యలను పరిష్కరించడానికి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వారంలో ఒక రోజును ప్రత్యేకంగా తల్లుల ఆరోగ్యాన్ని పరిశీలించడానికి కేటాయిస్తారు. ఇవి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన కొత్త పథకాలు… వాటికి 2024-25 స్టేట్ బడ్జెట్ లో కేటాయింపులు
4 Comments