తెలంగాణలో నీటి పారుదలశాఖలో కొత్తగా నియామకాలు చేపట్టబోతున్నారు. 1597 మంది లష్కర్లు, 281 మంది హెల్పర్ల పోస్టులు భర్తీ చేస్తారు. దీనికి అర్హత ఏంటంటే… జస్ట్ రాయడం… చదవడం వస్తే చాలు… అవునా… క్వాలిఫికేషన్ ఏవీ లేకుండా… రాయడం… చదవడం వస్తే చాలా ? అని ఆశ్చర్యపోతున్నారా… ఈ ఆర్టికల్ చూడండి..
రాయడం…. చదవడం వస్తే చాలు… మీ ఊళ్ళోనే నీటిపారుదలశాఖలో ఉద్యోగం దొరుకుతుంది. గ్రామాల్లో ఉండే చెరువులు, ఆయకట్టుకు నీరందించే ప్రధాన కాలువలు, డ్యామ్లు/రిజర్వాయర్ల ను పర్యవేక్షించేందుకు లష్కర్లు, హెల్పర్లను నియమించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1597 మంది లష్కర్లు, గేట్ల ఆపరేషన్ కోసం 281 మంది హెల్పర్లను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించుకుంటారు. చదువులతో సంబంధం లేకుండా, 45 ఏళ్లలోపు వయసు ఉండి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అర్హులు. సెలక్ట్ అయిన వారికి గౌరవ వేతనంగా ప్రతీ నెలా రూ.15,600లు ఇస్తారు.
డ్యూటీలు ఏంటి ?
ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు 3 చోట్ల గండ్లు పడ్డాయి. చాలా ఏరియాల్లో చెరువులు తెగిపోయాయి. కాలువల్లో నీళ్ళు ఎలా పారుతున్నాయో సూపర్ వైజ్ చేసేవాళ్ళు లేకపోవడంతోనే చెట్లు, చెదలు పెరిగి, పూడిక కూడా చేరుతోంది. దాంతో కాలువలు దెబ్బతింటున్నాయి… ఇదే విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అందుకే ఈ కొత్త రిక్రూట్ మెంట్ అవసరమవుతోంది. వానాకాలంలో ప్రాజెక్టులు, చెరువుల నుంచి వచ్చే నీరు పొలాలకు పోతున్నాయి… ఎక్కడైనా కాలువ దెబ్బతిందా…? దెబ్బతినే ప్రమాదాలు ఉన్నాయి. ఒకవేళ కాలువ పటిష్టంగా లేకపోతే ఇసుక బస్తాలు వేసి కాలువను కాపాడటం వీళ్ళ డ్యూటీ. కాలువలో ఎంత ఎత్తులో నీళ్లు వెళ్తున్నాయి? ఇంకా ఎంత దాకా నీళ్లు అవసరం? ఆయకట్టుకు ఎంత దాకా నీళ్ళు చేరుతున్నాయి లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ లష్కర్లు, హెల్పర్లే అందిస్తారు.
నియామకాలు ఎలా ?
లష్కర్లు, హెల్పర్ పోస్టుల భర్తీకి ENC లేదా CEO చైర్మన్ గా, SE, డిప్యూటీ AE ని సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేfEKI. తెలంగాణలో ఎక్కెడక్కడ లష్కర్లు, హెల్పర్లను నియమించాలని అనుకుంటున్నారో… ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని వారికి అవకాశం కల్పిస్తారు. జీతం నెలకు రూ.15,600 ఉంటుంది… దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు.
మరిన్ని జాబ్, ఎడ్యుకేషన్ అప్ డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి