TGPSC : ఆ రెండు ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

TGPSC : ఆ రెండు ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

తెలంగాణాలోని మహిళా శిశు సంక్షేమశాఖలో CDPO, EO పోస్టులకు TGPSC కొత్త షెడ్యూల్ ప్రకటించింది. ఈ రిక్రూట్ మెంట్ కింద CDPO-23 పోస్టులు, విస్తరణ అధికారులు (EO-181 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో పరీక్ష జరిగింది. ఆ పేపర్లు లీక్ కావడంతో ఈమధ్యే పరీక్షలను రద్దు చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక విచారణ బృందం, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా 2023లో నిర్వహించిన Written Testsను ఇటీవల TGPSC రద్దు చేసింది. CDPO పోస్టుల ఎంపిక జాబితాను వెనక్కు తీసుకుంది. మళ్ళీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. CDPO పోస్టులకు 2025 జనవరి 3, 4 తేదీల్లో ఎగ్జామ్ ఉంటుంది. అలాగే Extension Officer పోస్టులకు 2025 జనవరి 6, 7 తేదీల్లో CBRT విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్ తెలిపింది. Written Test కి వారం ముందు TGPSC Website లో Hall Tickets విడుదల చేస్తారు. Normalisation విధానంలో మార్కులు లెక్కిస్తామని TGPSC వర్గాలు తెలిపాయి.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!