తెలంగాణ రాష్ట్రంలో 563 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు 21 అక్టోబర్ 2024 నుంచి 27 వరకూ జరగనున్నాయి. ఈ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరవుతారు. వాళ్ళ కోసం రాష్ట్రంలో 46 exams centres ని TGPSC ఏర్పాటు చేసింది. ఉమ్మడి హైదరాబాద్ (HMDA) పరిధిలో ఈ Exams centres ఉన్నాయి.
Hyderabad District – 8
Ranga Reddy District : 11
Medchal Malkajgiri district : 27
Group.1 Mains ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరుగుతాయి. సీసీ కెమెరాల ద్వారా ఈ పరీక్షల నిర్వహణను TGPSCలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులు సమీక్షిస్తారు.
Exams centres లో రూల్స్
పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా జరుగుతాయి. మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను సెంటర్లలోకి అనుమతిస్తారు. 1.30 తర్వాత రూమ్స్ లోకి అనుమతి ఇవ్వరు.
దివ్యాంగులకు మరో గంట అదనంగా టైమ్ కేటాయిస్తారు. పరీక్ష రాయడానికి scribe అవసరమైతే హాల్ టిక్కెట్ల మీద ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. scribes ద్వారా ఎగ్జామ్స్ రాసే వారికి ప్రత్యేకంగా 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దివ్యాంగులు తమ వెంట సదరం సర్టిఫికెట్ తెచ్చుకోవాలి.
ప్రతి పరీక్షా కేంద్రం దగ్గరా వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు.
స్పెషల్ ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు.
ఇవి గుర్తుంచుకోండి
-
అభ్యర్థులు మొదటి రోజు ఎగ్జామ్ కి తీసుకొచ్చిన హాల్ టిక్కెట్ నే అన్ని పరీక్షలకూ తీసుకురావాలి… మారిస్తే ఎగ్జామ్ కి అనుమతించరు. హాల్ టిక్కెట్ పై పేర్కొన్న స్థలంలో ప్రతి రోజూ అభ్యర్థితో పాటు ఇన్విజిలేటర్ సంతకం చేయాలి.
-
హాల్ టిక్కెట్లు, Question papers అన్నీ తుది నియామకం అయ్యే దాకా అభ్యర్థులు భద్రపరుచుకోవాలి.
-
అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూ రంగు బాల్ పాయింట్ పెన్, పెన్సిల్, రబ్బరు, హాల్ టికెట్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు (ID Card) తీసుకురావాలి
-
బొమ్మలు పెన్సిల్ లేదా పెన్ తో వేయాలి. జెల్, స్కెచ్ పెన్నులు వాడరాదు
-
జవాబులు రాసేందుకు Answer Booklet ఇస్తారు. Additional sheets ఇవ్వరు.
-
అభ్యర్థి ఎంపిక చేసుకున్న భాష (General English తప్ప) లోనే answers రాయాలి. వేర్వేరు భాషల్లో జవాబులు రాస్తే వాటిని TGPSC అనర్హమైనవిగా గుర్తిస్తుంది.