TGPSC Group.3 Exam : అభ్యర్థులకు బిగ్ న్యూస్… హాల్ టిక్కెట్స్ రెడీ… తక్కువ టైమ్ లో Revision ఎలా ?

TGPSC Group.3 Exam : అభ్యర్థులకు బిగ్ న్యూస్… హాల్ టిక్కెట్స్ రెడీ… తక్కువ టైమ్ లో Revision ఎలా ?

తెలంగాణలో Group.3 రాసే అభ్యర్థులకు TGPSC కీలక update. నవంబర్‌ 17, 18 తేదీల్లో జరిగే పరీక్షల షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. examsకు వారం ముందు నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది. అంటే నవంబర్ 9 లేదా 10 తేదీల నుంచి అభ్యర్థులు tgpsc website ద్వారా తమ హాల్‌టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే మోడల్‌ ఆన్సర్‌ బుక్‌లెట్లను tgpsc websiteలో అందుబాటులో ఉంచినట్టు అదికారులు తెలిపారు.

33 Exam Centres

నవంబ‌ర్‌ 17, 18 ల్లో OMR విధానంలో జరిగే గ్రూప్‌–3 పరీక్షల కోసం రాష్ట్రంలో 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్‌– 3 పరీక్షల నిర్వహణపై ఇప్పటికే TGPSC అధికారులు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రూప్ 3 నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1388 పోస్టులను భర్తీ చేస్తారు.

పెరిగిన పోస్టులు… ఒక్కో పోస్టుకు కాంపిటేషన్ ఎంత అంటే

మొదట 1363 పోస్టులతో 2022 డిసెంబర్ 30న TGPSC Group 3 నోటిఫికేషన్ విడుదలైంది. బీసీ గురుకుల సొసైటీలో ఖాళీగా ఉన్న 12 పోస్టులను ఇందులో చేర్చడంతో మొత్తం పోస్టులు 1375కి పెరిగాయి. ఆ తర్వాత నీటిపారుదల శాఖ ENC ఆఫీసులో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కూడా చేర్చడంతో మొత్తం Group.3 posts సంఖ్య 1,388కి చేరింది. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు దాదాపు 386 మంది దాకా పోటీ పడుతున్నారు.

గ్రూప్‌ 3 పరీక్ష మొత్తం 3 పేపర్లలో జరుగుతుంది. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు. మొత్తం 450 మార్కులకు పరీక్ష.

Paper -1 : General Studies & General Abilities -150 Marks

Paper-2: History, Polity & Society – 150 Marks

Paper-3: Economy & Development -150 Marks

తక్కువ టైమ్ లో రివిజన్ ఎలా ?

TGPSC Group.3 లో ఎగ్జామ్ కి ఇంకా నెల రోజులు కూడా టైమ్ లేదు. ఇంత తక్కువ టైమ్ లో ఎలా రివిజన్ చేసుకోవాలని చాలా మంది టెన్షన్ పడుతుంటారు. ప్రతి నిమిషం కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి… ప్రతి రోజూ స్టడీ ప్లాన్ వేసుకుంటూ మీ ప్రిపరేషన్ సాగించండి… అందుకు ఈ ప్లాన్స్ ఫాలో అవ్వండి.

1) 3 పేపర్లలో కామన్ గా ఉన్న టాపిక్స్ గుర్తిస్తూ వాటిని లింకేజ్ చేసుకుంటూ చదవండి. చదవడంతో పాటు… ఆయా లెసన్స్ మీద Mock Tests, Daily Tests రాసుకోవాలి.

2) కరెంట్ ఎఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతూ… అందులో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ లాంటి సబ్జెక్టులకు సమాచారాన్ని కూడా అన్వయించుకోండి. పూర్తి వివరాలకు Telangana exams YT లో ఉన్న వీడియోను చూడండి

3) గ్రూప్ 3 టార్గెట్ గా పెట్టుకున్న వాళ్ళు ముఖ్యంగా థర్డ్ పేపర్ ఎకానమీ మీద ఎక్కువ concentration చేయాలి.. మిగతా సబ్జెక్టుల్లో 50 మార్కుల చొప్పున ఉంటే… ఒక్క ఎకానమీయే 150 మార్కులకు ఉందన్న విషయం గుర్తుంచుకోండి… అందుకోసం మేం ప్రత్యేకంగా తయారు చేసిన వీడియోను చూడండి…

TARGET GROUP.3 VIDEO 1 

TARGET GROUP.3 VIDEO 2

4) ఈ టైమ్ లో మీరు రివిజన్ కి మాత్రమే ప్రియారిటీ ఇవ్వాలి… ఇప్పటి వరకూ మీరు ఏం చదివారో వాటిని రివిజన్ చేసుకోండి… కొత్త వాటి మీద దృష్టి పెట్టవద్దు. అంటే ఇప్పుడు కొత్తగా పుస్తకాలు కొనే ప్రయత్నం చేయకండి.

5) కొత్త అప్ డేట్స్ మాత్రం మిస్ అవ్వొద్దు: కొత్త పుస్తకాలు కొనవద్దని చెప్పాం కానీ… కొత్త అప్ డేట్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు. అంటే ఎకానమీలో బడ్జెట్ అంశాలు… కొత్త పథకాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, స్కీములు, నిధుల కేటాయింపునకు సంబంధించి అప్ డేటెడ్ మెటీరియల్ ని మాత్రమే ఫాలో అవ్వండి. అలాగే పాలిటీలో అయితే కోర్టులు ఇచ్చిన ప్రస్తుత తీర్పులు…వాటికి సంబంధించి గతంలో ఉన్న చట్టాలు… వాటి పనితీరు మీద చదువుకోండి.

6) మీ నోట్సును తిరగేయండి: ఇప్పటికే మీరు description విధానంలో చదువుకుంటూ సొంతగా Notes తయారు చేసుకొని ఉంటారు. ఆ నోట్సును ఇప్పుడు తిరగేయండి… అందులో మైండ్ మ్యాప్స్, క్లుప్తంగా రాసుకున్న పాయింట్స్ మీద దృష్టి పెట్టండి.

7) ప్రతి రోజూ… ప్రతి సబ్జెక్ట్ కీ టైమ్ కేటాయించాలి. ఇంకా 20 రోజులు మాత్రమే టైమ్ ఉంది… అందుకే రోజుకు మీరు కనీసం 8 నుంచి 10 గంటలు మీ ప్రిపరేషన్ కి టైమ్ కేటాయించాలి. అందులో ప్రతి సబ్జెక్టు కూడా కవర్ అయ్యేలాగా రోజువారీ టైమ్ టేబుల్ తయారు చేసుకోండి. ఉదయం లేవగానే… ఇవాళ ఏ టైమ్ లో ఏం చదవాలో ఓ పేపర్ మీద రాసుకోండి… అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి.

8) కరెంట్ ఎఫైర్స్ ఎప్పటి దాకా చదవాలి ? : కరెంట్ ఎఫైర్స్ ని గత ఏడాది నుంచి చదవాలి… లేదా ఖచ్చితంగా 2024 జనవరి నుంచి మాత్రం మిస్ అవ్వొద్దు. అలాగే గ్రూప్ 3ఎగ్జామ్ రాసేవారు… సెప్టెంబర్ 30 లేదా అక్టోబర్ 15 వరకూ కరెంట్ ఎఫైర్స్ చదివితే బెటర్. ఈ కరెంట్ ఎఫైర్స్ లో ముఖ్యమైన వాటి గురించి… Multiple Choice Questions వాటికి జవాబులు, వివరణలు, background వివరణలతో మన Telangana exams YT Channel లో వీడియోలు ఉన్నాయి. చూడండి… ప్రస్తుతం అక్టోబర్, సెప్టెంబర్ కు సంబంధించినవి… లేటెస్ట్ బడ్జెట్ లు, ఆర్థిక అంశాలు, సైన్స్ టెక్నాలజీ అంశాల మీద వీడియోలు ఉన్నాయి. 7PM MCQs అనే play List కింద ఉన్నాయ… ఆ లింక్ ఇక్కడ పెడతాను. ఫాలో అవ్వండి…ఒక్కసారి అన్ని వీడియోలు చూడండి.

IMPORTANT 7PM MCQS VIDEOS PLAY LIST

9) ఈ టైమ్ లో మీరు ఎక్కువగా టెస్టులకు ప్రియారిటీ ఇవ్వండి. టెస్టుల వల్ల మీరు ఎంత వరకూ చదివారు… ఇంకా ఏం టాపిక్స్ లో తక్కువ మార్కులు వస్తున్నాయో తెలుసుకోడానికి అవకాశం ఉంటుంది. Lesson wise Mock Tests, Daily Tests, Grand Tests లో updated ప్రశ్నలతో ఇస్తున్న కోర్సులు మన Telangana Exams plus యాప్ లో ఉన్నాయి. వాటిల్లో చేరండి. గ్రూప్ 2, గ్రూప్ 3 రాసేవారు… GROUP.2 EXCELLENCE COURSE లోనే జాయిన్ అవ్వండి. ఇప్పుడు గ్రూప్ 3 వాళ్ళకి ఇస్తున్న గైడెన్స్, టెస్టులతో పాటు… గ్రూప్ 2కి సంబంధించి అదనపు టెస్టులు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. ఆ కోర్సు లింక్ ఇదే

10) ఎక్కువ మార్కులకు ఛాన్స్ ఉన్న టాపిక్స్ ఇవే

1) International- National -Regional current affairs
2) International Relations & Events
3) Economy & Development
4) Indian Polity
5) General Abilities & Reasoning
6) Basic English
7) Telangana History & Movement
8) Telangana Culture, Arts
9) Telangana Geography
10) Telangana Govt Policies (especially focus on CM Revanth Reddy’s Govt)
11) Central Govt, State Govt Budgets 2024-25 – Latest Schemes, Allocations
12) India, Telangana’s Social Issues (SC/ST/BC/Women, Minority etc., problems, Schemes)
13) Indian Geography & Disaster environmental issues
14) Latest Indexes, Latest COPs

ప్రత్యేకంగా గ్రూప్ 3 ని టార్గెట్ పెట్టుకున్నవాళ్ళు గానీ. ప్రస్తుతం గ్రూప్ 3 రాస్తున్న వాళ్ళు గానీ… ఈ వీడియో తప్పక చూడండి….
వీడియో లింక్

TARGET GROUP.3 VIDEO 1 

TARGET GROUP.3 VIDEO 2

ఈ కోర్సుతో 20 రోజుల్లో పక్కాగా రివిజన్

TGPSC Gropup.2 & Group 3 పరీక్షలను రాస్తున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉండే కోర్సులను మేం డిజైన్ చేశాం. ఈ రెండు కోర్సుల్లో

1) Lesson wise Mock Tests

2) Daily Tests

3) Grand Tests ఉన్నాయి.

మీరు గ్రూప్ 3 తో పాటు గ్రూప్ 2 కూడా రాస్తుంటే… GROUP.2 EXCELLENCE COURSE లోనే జాయిన్ అవ్వండి. ఇప్పుడు గ్రూప్ 3 వాళ్ళకి ఇస్తున్న గైడెన్స్, టెస్టులతో పాటు… గ్రూప్ 2కి సంబంధించి అదనపు టెస్టులు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. ఆ కోర్సు లింక్ ఇదే.. ఈ ఆర్టికల్ ను మీ ఫ్రెండ్స్ తో పాటు ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో ఫార్వార్డ్ చేయండి.
All the best

1) Telangana Exams YT Channel 7PM MCQs Link

2) Telangana Exams plus : GROUP.2 EXCELLENCE COURSE Link

Join this Telegram group for more Jobs, Exams notifications, Results updates of Central & APPSC, TGPSC etc Updates: https://t.me/group1aspirants_ExamsCentre

 

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!