గ్రూప్ 3 బిగ్ అప్డేట్… హాల్ టిక్కెట్స్ ఎప్పటి నుంచి అంటే… Group.3 exam Hall tickets !

గ్రూప్ 3 బిగ్ అప్డేట్… హాల్ టిక్కెట్స్ ఎప్పటి నుంచి అంటే… Group.3 exam Hall tickets !

తెలంగాణలో గ్రూప్ 3 ఎగ్జామ్ రాస్తున్న వారికి శుభవార్త. గ్రూప్ 3 కి ఎగ్జామ్ కి సంబంధించి బిగ్ అప్ డేట్ ఇచ్చింది TGPSC. గ్రూప్ 3 ఎగ్జామ్స్ నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ ఎగ్జామ్ హాల్ టిక్కెట్లు నవంబర్ 10 నుంచి వెబ్ సైట్ లోకి అందుబాటులోకి రానున్నాయి.

రాష్ట్రంలో దాదాపు 1380కి పైగా గ్రూప్‌-3 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు TGPSC నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఎగ్జామ్ కోసం 5.36 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇప్పుడు గ్రూప్ 3 పరీక్ష షెడ్యూల్ ను విడుదల చేసింది TGPSC. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. అయితే దానికి సంబంధించి తాజాగా షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. ఈ ఎగ్జామ్ ను రెండు సెషన్లలో నిర్వహిస్తారు.

2024 నవంబర్ 17 నాడు

Paper- 1 -General Studies & General Abilities
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు

Paper -2 – History-Polity & Society
మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు

2024 నవంబర్‌ 18 నాడు

Paper-3 -Economy and Development
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు

హాల్ టిక్కెట్స్ ఎప్పటి నుంచి ?

2024 నవంబర్‌ 10 నుంచి హాల్‌ టికెట్లు https://websitenew.tspsc.gov.in/ లో అందుబాటులోకి వస్తాయి.

అభ్యర్థులకు నిబంధనలు :

గ్రూప్‌-3 పరీక్ష ఫస్ట్​ సెషన్‌కు ఉదయం 8.30 గంటల నుంచి,
రెండో సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల లోపే ఎగ్జామ్​ సెంటర్లలోనికి అనుమతి ఉంటుంది.
మార్నింగ్​ సెషన్‌లో 9.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటలకు గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని TGPSC అధికారులు తెలిపారు.

హాల్​టికెట్లు జాగ్రత్త !

TGPSC Group.3 ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేంత వరకు అభ్యర్థులు తమ హాల్‌టికెట్లు, క్వశ్చన్‌పేపర్లను జాగ్రత్త గా ఉంచుకోవాలి. డూప్లికేట్‌ హాల్‌టికెట్లను తర్వాత జారీ చేయరు.

గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి రెడీ

గ్రూప్ 3 ఎగ్జామ్స్ తర్వాత 2024 డిసెంబర్​లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తుంది TGPSC. వీటికి సంబంధించిన షెడ్యూల్​ను TGPSC ఇప్పటికే ప్రకటించింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో గ్రూప్ -2 పరీక్షలు యధావిధిగా జరుగుతాయి.

Click here : TGPSC WEB NOTE  GROUP 3 UPDATE 3010

టైమ్ లేదు ఫ్రెండ్స్

గ్రూప్ 3 ఇంకా రెండు వారాలు మాత్రమే టైమ్ ఉంది. అటు గ్రూప్ 2 కూడా నెల రోజులే టైమ్ ఉంది. ఈ సమయంలో మీరు వీలైనన్ని ఎక్కువ టెస్టులు రాసుకుంటూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అందుకోసం మేం Telangana exams plus app లో నిర్వహిస్తున్న GROUP. 2 EXCELLENCE COURSE లో జాయిన్ అవ్వండి. 6 నెలలకు 250 రూపాయలు మాత్రమే.

గ్రూప్ 2కోర్సులో జాయిన్ అయితే… గ్రూప్ 3 కి నిర్వహిస్తున్న డైలీ టెస్టులు, మారథాన్ టెస్టులు, గ్రాండ్ టెస్టులతో పాటు అదనంగా గ్రూప్ 2 కి నిర్వహించే టెస్టులు కూడా రాసుకోవచ్చు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ కింద లింక్ ద్వారా కోర్సులో జాయిన్ అవ్వండి.

TGPSC GROUP 2 EXCELLENCE COURSE లో జాయిన్ అవ్వండి. లింక్ ఇదే

GROUP.2 EXCELLENCE SERIES LINK

మేం ఇప్పటిదాకా ఇచ్చిన టెస్టులు :

TGPSC GROUP.3

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!