తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు ఇప్పటికే హాల్ టిక్కెట్స్ రిలీజ్ అయ్యాయి. నవంబర్ 10 నుంచి ఇష్యూ అవుతున్నాయి. ఈ వీడియో చూసే వాళ్ళల్లో చాలామంది డౌన్లోడ్ చేసుకునే ఉంటారు.
నవంబర్ 17, 18 తేదీల్లో GROUP.3 ఎగ్జామ్ జరగగబోతోంది. రెండు సెషన్లలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. . నవంబర్ 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష,
మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 దాకా పేపర్ 2 పరీక్ష జరుగుతుంది. నవంబర్ 18న పేపర్ 3 పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఇలా మొత్తం 3 పేపర్లకు గ్రూప్ 3 పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షలకుపైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు
GROUP.3 ఎగ్జామ్స్ రాసేవారికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని సూచనలు చేసింది…గ్రూప్-3 పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి మీకు తెలుసు…
పేపర్ 1లో… జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్,
పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ
పేపర్ 3లో ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులకు పరీక్షలు.
రాత పరీక్ష ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ ఉండదు.
రిటన్ టెస్టులను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ.. మూడు భాషల్లో నిర్వహిస్తారు.
గ్రూప్ 3 పరీక్షలు ఆఫ్‌లైన్ విధానంలోనే ఉంటాయి. అందువల్ల అభ్యర్ధులు బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ తెచ్చుకోవాలి.
- TGPSC వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింటవులు తీసుకున్న Group.3 exam హాల్‌టికెట్‌ని తీసుకెళ్ళాలి.
- హాల్‌టికెట్లను A4 సైజు పేజీపై మాత్రమే ప్రింట్ తీసుకొని వెళ్ళండి. కలర్ ప్రింట్ తీసుకోవాలి… ఒకవేళ అభ్యర్థి ఫొటో, సిగ్నేచర్ లాంటివి హాల్ టిక్కెట్ మీద ప్రింట్ కాకుంటే…ఎగ్జామ్ సెంటర్ కి వెళ్లేటప్పుడు తమతోపాటు మూడు పాస్‌పోర్టు ఫొటోలపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ తీసుకుని, పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్‌కు హామీపత్రం ఇవ్వాలి.
- ఇంకా పాస్ పోర్టు సైజ్ ఫోటో, పాన్ కార్డు, ఓటరు కార్డు, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపుకార్డు, డ్రైవింగ్ లైసెన్సు లాంటి వాటిల్లో ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును తమతోపాటు తీసుకెళ్లాలి.
టైమింగ్స్ చూసుకుంటే…
మొదటి సెషన్‌కు ఉదయం 8.30 గంటల నుంచి, రెండో సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
ఉదయం సెషన్‌లో 9.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటలకు గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. ఉదయం 8 గంటలకల్లా ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోండి.
- అభ్యర్థులు First Paperకు.. అంటే General studies కి తీసుకెళ్లిన హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష వరకూ తీసుకెళ్లాలి.
- పరీక్షల తర్వాత కూడా హాల్‌టికెట్ కాపీని, Exam papers భద్రంగా పెట్టుకోవాలి. డూప్లికేట్ హాల్‌టికెట్లను తర్వాత జారీ చేయబోమని TGPSC అధికారులు క్లియర్ గా చెప్పారు.
- పరీక్ష సమయంలో ప్రశ్నపత్రం ఓపెన్ చేయగానే అందులో అన్ని ప్రశ్నలు ప్రింట్ అయ్యాయా? లేదా? అనేది ముందు చెక్ చేసుకోండి.. ఎక్కడైన ప్రింటింగ్ సరిగా లేకపోతే ఇన్విజిలేజర్ ద్రుష్టికి తీసుకురావాలి.
- అలాగే తప్పుడు గుర్తింపు పత్రాలతో హాజరైనా, ఒకరి పేరుతో మరొ అభ్యర్థి ఎగ్జామ్ రాసేందుకు వచ్చినా క్రిమినల్ కేసులు పెడతార. డిబార్ చేస్తామని కమిషన్ వర్గాల హెచ్చరించాయి.
ఎగ్జామ్ హాల్లో ఈ సూచనలు పాటించండి
ఎగ్జామ్ పేపర్ ఒక్కసారి 150 మార్కుల ప్రశ్నలు ప్రింటింగ్ మంచిగా ఉన్నాయో లేదో చూసుకొని… ఆ తర్వాత పైపైన చూడండి… ఓ 5 మినిట్స్ చూశాక…అందులో నెంబర్ 1 ప్రశ్న నుంచి 150 ప్రశ్న వరకూ …
మీకు బాగా ఈజీగా… ఈ ఆన్సర్ నాకు ఖచ్చితంగా తెలుసు అనుకున్న వాటికి సమాధానాలు గుర్తించండి
ఆ తర్వాత
సెకండ్ అటెంప్ట్ లో కొద్దిగా ట్రై చేస్తే వచ్చేవి… ఇంకా స్ట్రైక్ చేసుకుంటూ పోతే మిగిలేవి… అంటే ఈ ప్రశ్నకు ఇది ఖచ్చితంగా సమాధానం కాదు… అనుకున్నవి తీసేయండి… ఇక మిగిలిన దానికి జవాబులు పెట్టండి…
థర్డ్, ఫోర్త్ ఎటెంప్ట్ లో మిగిలినవి పెట్టుకుంటూ పోండి.
జనరల్ ఎబిలిటిస్ చేసేటప్పుడు… టైమ్ ని ద్రుష్టిలో పెట్టుకోండి….
ఈ వారం రోజులు కూడా ప్రాక్టీస్ టెస్టులు రాసుకోండి… రోజుకి కనీసం 10 గంటలైనా ప్రిపరేషన్ మీద ద్రుష్టి పెట్టండి. రివిజన్ ఎలా చేసుకోవాలో గతంలో వీడియో ఇచ్చాను. Telangana Exams youtube channel ను subscribe చేసుకోండి. అందులో వీడియోలు ఉంటాయి. Click here for : Preparation video Plan Link
Click here : TSPSC website link for Group3 Hall Tickets
గ్రూప్ 3 రాస్తున్నవాళ్ళల్లో ఎవరైనా గ్రూప్ 2 కూడా రాస్తుంటే… వెంటనే మన TGPSC GROUP.2 EXCELLENCE COURSE లో జాయిన్ అవ్వండి. ఈ వారం రోజులు గ్రూప్ 3 ప్రాక్టీస్ కోసం టెస్టులు ఉన్నాయి. ఇవి
కాకుండా గ్రూప్ 2కి కూడా పనికొస్తాయి. అందుకు డబుల్ బెనిఫిట్ కోసం గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ లో మాత్రమే జాయిన్ అవ్వండి.
ఎవరైనా TGPSC Group.2 కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే లింక్
https://atvqp.on-app.in/app/oc/447150/atvqp?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
All the best on behalf of Telangana Exams
Thank you.