UBI LBO Jobs : యూనియన్ బ్యాంక్ లో LBO పోస్టులు : Salary : 77000… ప్రిపరేషన్ ఎలా ?

UBI LBO Jobs : యూనియన్ బ్యాంక్ లో LBO పోస్టులు : Salary : 77000… ప్రిపరేషన్ ఎలా ?

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి యూనియన్ బ్యాంక్ శుభవార్త చెప్పింది.   దేశవ్యాప్తంగా 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయబోతోంది.  అదృష్టం ఏంటంటే… మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 400 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ చదివిన వాళ్ళు… తెలుగు వచ్చిన వాళ్ళు ఈ పోస్టులకు పోటీ పడొచ్చు.  పైగా ఉద్యోగం కొడితే మొదటి నెల నుంచే దాదాపు 77 వేల రూపాయల దాకా జీతం వస్తుంది.   Written Test, Interview కి  ఎలా ప్రిపేర్ అవ్వాలి… ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటన్నది ఈ ఆర్టికల్ లో చూద్దాం.

Union Bank of India (Andhra Bank ఇందులోనే విలీనం అయింది )లో Local Bank Officer పోస్టుల భర్తీకి ప్రకటన రిలీజ్ అయింది. దేశం మొత్తమ్మీద 1500 పోస్టులు ఖాళీగా ఉంటే… అందులో Andhra Pradeshలో  200, Telanganaలో 200 ఉన్నాయి.

లోకల్ బ్యాంకు ఆఫీసర్ పోస్ట్ కొట్టాలంటే… ఖచ్చితంగా స్థానిక భాషలో మాట్లాడటం, చదవడం, రాయడం రావాలి.  అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల వారికి అయితే తెలుగు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఆ పోస్టులోనే దాని అర్థం ఉంది.  UBI తమ బ్యాంక్ సేవల్ని మారుమూల పల్లెలకు కూడా విస్తరించేందుకు  లోకల్ బ్యాంక్ ఆఫీసర్లను రిక్రూట్ చేసుకుంటోంది. మొదట్లో LBO గా జాయిన్ అయిన వారు తర్వాత ప్రమోషన్లతో POలు అంటే Probationary Officers గా మారే ఛాన్సుంది. నిజానికి  పే స్కేల్ చూస్తే… లోకల్ బ్యాంక్ ఆఫీసర్లకీ… ప్రొబేషనరీ ఆఫీసర్లకీ ఒకటే శాలరీ ఉంది. అయితే LBOలు పదేళ్ల వరకు కూడా అదే రాష్ట్రంలో డ్యూటీ చేస్తారు. ఉద్యోగం పొందిన వారు మొదటి నెలలో రూ.48,180లు అందుకుంటారు. వీటికి అలవెన్సులు కూడా యాడ్ అయితే… దాదాపు మొదటి నెల దాదాపు రూ.77 వేల దాకా వస్తాయి.

విద్యార్హతలు ఏంటి ?

ఏదైనా గ్రాడ్యుయేట్. స్థానిక భాషను (తెలుగు) టెన్త్ లేదా ఇంటర్ లో చదవాలి.  లేకపోతే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాలి.

వయస్సు ఎంత ఉండాలి ?

అక్టోబరు 1, 2024 నాటికి కనీసం 20 ఏళ్లు నిండాలి. 30 ఏళ్లకు మించకూడదు. SC/STకు ఐదేళ్లు, OBCలకు మూడేళ్లు. దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంది.

అప్లికేషన్ ఫీజు :

General, EWS వాళ్ళు : రూ.850,   SC/ST/ దివ్యాంగులు : రూ.175

ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోడానికి చివరి తేది: 13 నవంబర్ 2024

Exam date ఇంకా ప్రకటించలేదు.

ఎగ్జామ్ సెంటర్స్ :

Andhra Pradesh :

అమరావతి, అనంతపురం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం.

Telangana :

హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

పూర్తి వివరాలకు : : http://www.unionbankofindia.co.in ను సందర్శించండి.

ఇది కూడా చదవండి : 

Bank Jobs : యూనియన్ బ్యాంక్ లో 1500 ఉద్యోగాలు, 48వేల జీతం

ఎంపిక ఎలా ?

బ్యాంక్ ఎగ్జామ్స్ కి ఉండే పరీక్షను ఆన్ లైన్లో రాయాలి.  క్వొశ్చన్ పేపర్ English/Hindi లోనే ఉంటుంది. తెలుగులో ఎగ్జామ్ ఉండదు.

Reasoning & Computer Aptitude 45 Qns 60 Marks 60 Minutes
General/Economy/Banking Awareness 40 Qns 40 Marks 35 Minutes
Data Analysis & Interpretation 35 Qns 40 Marks 45 Minutes
English Language 35 Qns 40 Marks 40 Minutes
Total 155 Qns 200 Marks 3 Hours
English Language (Letter writing, Essay) 2 Qns 25 Marks 30 Minutes

 

Union Bank of India – Local Bank Officers  Syllabus విశ్లేషణ

General/ Economy/ Banking Awareness :

ఇందులో బ్యాంకింగ్ వ్యవహారాల మీద ప్రశ్నలు వస్తాయి. RBI ఏర్పాటు దగ్గర నుంచి రిజర్వ్ బ్యాంక్ వాడే పదజాలం, Insurance, Repo Rate, Reverse Repo Rate, వడ్డీరేట్లు, బ్యాంకుల రోజు వారీ కార్యకలాపాలు, బ్యాంకుల విలీనం, తాజా ఆర్థిక నిర్ణయాలు, ఏ బ్యాంక్ హెడ్డాఫీస్ ఎక్కడ ఉంది. వాటికి ఎవరు హెడ్స్ గా ఉన్నారు. డిజిటల్ బ్యాంకింగ్, ఇటీవల కాలంలో బ్యాంకింగ్ రంగంలో వచ్చిన డిజిటల రంగ సంస్కరణలు తెలుసుకోవాలి.  ఎకానమీలో డిమాండ్- సప్లయ్, ద్రవ్యోల్బణ పరిస్థితులు, పేదరికం, మార్కెట్ రకాలు, జాతీయ, అంతర్జాతీయ కరెంట్ ఎఫైర్స్, ఈవెంట్స్ మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా బ్యాంకు ఆర్థిక వ్యవహారాలు, నిర్ణయాలపై అవగాహన పెంచుకోవాలి.

General Awareness :

పర్యావరణ సమస్యలు, కరెంట్ ఎఫైర్స్, కరెంట్ ఈవెంట్స్, భారతదేశం, పొరుగు దేశాలతో సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పై  ప్రశ్నలు వస్తాయి. ఇవి కాకుండా Static GK కి సంబంధించి వార్తల్లోని వ్యక్తులు, ఎన్నికలు, ఆటలు,  అవార్డులు, పధకాలు, దేశాలు-రాజధానులు, కరెన్సీలు, ముఖ్యమైన దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు స్టడీ చేయాలి. అలాగే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వంలో కొత్త నియామకాలు, విజేతలు, బుక్స్, రైటర్స్,  ప్రముఖుల పర్యటనలు, వార్తల్లో ఉన్న వ్యక్తులు, ప్రదేశాలు, ప్రముఖుల మరణాలు చదువుకోవాలి.

English Language :

Grammar బాగా ప్రాక్టీస్ చేయాలి. Speed కి  గుర్తించడానికి అలవాటు పడాలి.  Comprehension, Cloze Test, Jumble Sentences, Sentence  Improvement/ Correction,  Word Substution, Idiom & Phrases, Synonyms, Antonyms, Passive, Active Voice, Direct, Indirect speech లో ప్రశ్నలు వస్తాయి.

Reasoning & Computer Aptitude :

Syllogism, Analogy, Classification, Coding-Decoding, Clocks, Calendar, Seating Arrangement, Blood Relations, Puzzle Tests, Statements, Series, Ranking etc., Computer/Information Technology కి సంబంధించి Basic knowledge ఉండాలి. బ్యాంకు లావాదేవీలకు  అవసరమయ్యే minimum computer knowledge, technical problems మీద ప్రశ్నలు అడిగే ఛాన్సుంది.

Data Analysis & Interpretation :

ప్రతి ప్రశ్న కూడా తర్కంగా ఆలోచించి రాయాల్సి ఉంటుంది. Bara Graphs, Line Charts, Tablular Format, Pichart, Missing Data, Caselet, Data sufficiency, విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. ఇవి కాకుండా అర్థమెటిక్ అంశాలపైనా ప్రశ్నలు వస్తాయి. శాతాలు, అనుపాతం. లాభ నష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం- దూరం, కాలం- పని, పడవలు- ప్రవాహాలు, రైళ్లు, సరాసరి, భాగస్వామ్య వ్యాపారం, వైశాల్యాలు ఘన పరిమాణాలు లాంటివి

  • మైనస్ మార్కులు ఉంటాయి కాబట్టి… అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడం కంటే… రాసిన ఆన్సర్స్ లో ఎన్ని కరెక్ట్ అవుతాయన్నది ముఖ్యం.  మ్యాథ్స్, రీజనింగ్ లో షార్ట్ కట్ మెథడ్స్ కి అలవాటు పడాలి.  చాలామంది జనరల్ స్టడీస్ , జీకేని ప్రిపేర్ అయి ఉంటారు.  కానీ బ్యాంకు జాబ్స్ కి ప్రత్యేకంగా బ్యాంకింగ్ అవేర్నెస్ మీద పట్టు కావాలి.
  • IBPS Previous papers ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి.  మాక్ టెస్టులు రాయండి.   ఆన్ లైన్లో Objective type Exam పూర్తి అవగానే descriptive కూడా అప్పుడే ఉంటుంది.

ఇంటర్వ్యూ ఎలా ?

ఎగ్జామ్ లో అర్హత సాధించిన వారిని మెరిట్, రిజర్వేషన్ ప్రకారం పిలుస్తారు.  ఒక్కో పోస్టుకే ముగ్గురుని ఎంపిక చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు.  ఆ రాష్ట్రానికి చెందిన భాషలో టెస్టు పెడతారు. పది లేదా ఇంటర్ లో చదవని వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టు జరుగుతుంది. ఇంటర్వ్యూలో వంద మార్కులు ఉంటాయి. ఇందులో అర్హతకు SC/ST/OBC/దివ్యాంగులకు 35,  ఇతర వర్గాలవారికి 80 శాతం మార్కులు రావాలి. ఫైనల్ రిక్రూట్ మెంట్ అనేది Online Test, Interview మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రొబేషన్ పీరియడ్ రెండేళ్ళు ఉంటుంది. సంస్థలో కనీసం మూడేళ్లు కొనసాగుతామని 2 లక్షల రూపాయలకు అగ్రిమెంట్ రాసివ్వాలి.

Bank Jobs : యూనియన్ బ్యాంక్ లో 1500 ఉద్యోగాలు, 48వేల జీతం

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!