UPSC ఛైర్ పర్సన్ గా 1983 బ్యాచ్ ఏపీ క్యాడర్ IAS అధికారి ప్రీతి సూదన్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఉన్న మనోజ్ సోని ఈమధ్యే రిజైన్ చేయడంతో… ఆ స్థానంలో కేంద్రం ప్రీతి సూదన్ ను నియమించింది. UPSC సభ్యురాలిగా సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న ఆమెకు Chairperson గా బాధ్యతలు అప్పగించింది. ఈమె గతంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా మూడేళ్లపాటు పని చేసి… 2020 జులైలో రిటైర్డ్ అయ్యారు. ఈమె కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో పనిచేసినప్పుడు మోడీ ప్రభుత్వంలో కీలక పథకాలైన బేటీ బచావ్ బేటీ పఢావ్, ఆయుష్మాన్ భారత్ మొదలుపెట్టారు. నేషనల్ మెడికల్ కమిషన్ చట్టాలు కూడా ఈమె హయాంలోనే తయారయ్యాయి. ప్రస్తుతం UPSC ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన ప్రీతి సూదన్ గతంలో ప్రపంచ బ్యాంకు కన్సల్టెంట్ గా పనిచేశారు. 2022 సెప్టెంబర్ 29న UPSC సభ్యురాలిగా నియమితులయ్యారు.
- August 2, 2024
0
41
Less than a minute
You can share this post!
administrator