---Advertisement---

TG TET Results: తెలంగాణలో టెట్ ఫలితాలు (Results Link)

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) ఫలితాలు రిలీజ్ అయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి వీటిని విడుదల చేశారు. టెట్‌ పేపర్‌-1లో 67.13 శాతం యంది ఉత్తీర్ణులయ్యారు. 85,996 మంది అభ్యర్థుల్లో 57,725 మంది క్వాలిఫై అయ్యారు. టెట్‌ పేపర్‌-2లో 34.18 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 1,50,491 మంది హాజరవగా… 51,443 మంది ఉత్తీర్ణత సాధించారు. 2023తో పోలిస్తే పేపర్‌-1లో 30.24 శాతం, పేపర్‌-2లో 18.88 అర్హత శాతం పెరిగింది.

ఫలితాల కోసం క్లిక్ చేయండి

టెట్‌ దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. అర్హత సాధించని వారు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అర్హత సాధించిన వారు Dscకి ఉచితంగా అప్లయ్ చేసుకోవచ్చు. టెట్ ఫీజును వెయ్యి రూపాయలుగా నిర్ణయించడంపై అప్పట్లో ఉపాధ్యాయ నిరుద్యోగులు అభ్యంతరం చెప్పారు. రెండు పేపర్లు రాసిన వారు రెండు వేల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. అయితే ఎన్నికల కోడ్‌ వల్ల టెట్‌-2024 అప్లికేషన్ ఫీజును ప్రభుత్వం తగ్గించలేకపోయింది. అందువల్ల నెక్ట్స్ టెట్‌, Dscకి అప్లయ్ చేసేవారికి రిలీఫ్ కలిగించింది ప్రభుత్వం.

 

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!