ప్రస్తుతం తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పూర్తయింది. మెయిన్స్ జరగాల్సి ఉంది. నిరుద్యోగుల డిమాండ్ మేరకు గ్రూప్ 2ని డిసెంబర్ కు వాయిదా వేసింది ప్రభుత్వం.. గ్రూప్ 3 కూడా దాదాపుగా అప్పుడే జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే జాబ్ కేలండర్ తో ఈ గ్రూప్ 2, గ్రూప్ 2 లో పోస్టుల సంఖ్య ఎంత పెరుగుతాయి… ఎగ్జామ్ డేట్స్ పై కొంత వరకూ అవగాహన వచ్చే ఛాన్సుంది. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా ప్రతి యేటా మార్చిలో ఉద్యోగాల్లో ఖాళీలను సేకరించి… డిసెంబర్ 9 లోపు నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రూప్ 2, గ్రూప్ 3 కి సంబంధించి మళ్ళీ అదనపు నోటిఫికేషన్లు పడే అవకాశం ఉంది… అలాగే జాబ్ కేలండర్ ప్రకారం గ్రూప్ 4 లో ఖాళీలను కూడా గుర్తించే ఛాన్సుంది. కొత్తగా మళ్లీ నోటిఫికేషన్లు వస్తే… ఏ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న దానిపై పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా అందిస్తున్నాం. పోటీ పరీక్షల యుద్ధంలో ప్రతి ఒక్కరూ దిగాల్సిందే. ఎవరూ వెనక్కి తగ్గడానికి వీల్లేదు. కనిపించిన ప్రతి నోటిఫికేషన్‌కూ దరఖాస్తు చేయాల్సింది. అలాగని ఓ లక్ష్యం లేకుండా ప్రయత్నం చేయటం వల్లే చాలా మంది అభ్యర్థులు ఫెయిల్ అవుతుంటారు. నాకు కొలువు రాదు… అని నెగిటివ్ థింకింగ్ లోకి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి రాకుండా… positive attitude తో ఉండాలంటే కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి.
గ్రూప్ 1 లో విజయం సాధించాలంటే
గ్రూప్-1 కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కొన్ని లక్షణాలు అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది.
‣ వివిధ విషయాలను విశ్లేషించగలిగిన సామర్థ్యం ఉండాలి. ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్ లో ఇది చాలా అవసరం అవుతుంది.
‣ స్టాటిస్టిక్స్ మీద అవగాహన పెంచుకోవాలి… సరైన సందర్భాల్లో వాటిని తిరిగి ఉపయోగించగలాలి.
‣ చక్కగా, అర్థమయ్యేలా రాసే నేర్పు. చక్కని దస్తూరీ ఉండాల్సిందే. కంప్యూటర్ టైపింగ్ కి అలవాటు పడి… చాలామంది రాయడమే మర్చిపోయారు. రాయడం ప్రాక్టీస్ చేయాలి.
‣ రాత పరీక్షలో అడిగే వివిధ రకాలైన ప్రశ్నలను అర్థం చేసుకొని… వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా సమాధానాలు రాసే నైపుణ్యం అలవాటు చేసుకోవాలి.
‣ సొంతంగా నోట్సు తయారు చేసుకోవడం. ఇది గ్రూప్ 1 అభ్యర్థులకే కాదు… అందరికీ వర్తిస్తుంది.
‣ ఎంతమంది అయినా పోటీ పడనీయండి… వాళ్ళని ఎదుర్కొనగలిగిన ఆత్మవిశ్వాసం, ఉత్సాహం ఉండాలి. పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళాలి.
‣ ఒక్క ఏడాదిలోనే ఉద్యోగం వస్తుంది అనుకుంటే పొరపాటు. దీర్ఘకాలికింగా మనం ప్రిపేర్ అవ్వాలంటే అందుకు తగినట్టుగా… మెటీరియల్ సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా రిఫరెన్స్ బుక్స్, అకాడమీ బుక్స్ తో ఫండమెంటల్స్ దగ్గర నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టారు.
‣ ఒక విషయాన్ని విస్తృతంగా అంటే అనాలసిస్ చేసి రాయగలగాలి… అలాగే దాన్ని క్లుప్తంగా కూడా రాయలగాలి. ఈ రెండు సామర్థ్యాలను అభ్యర్థి అలవాటు చేసుకోవాలి.
‣ ప్రతి రోజు, వారం, నెల, సంవత్సరం వారీగా టైమ్ టేబుల్ ఉండాల్సిందే. టైమ్ ప్రకారం చదవాలి… ఆ ఎగ్జామ్ ని కొట్టేదాకా సహనం, ఓపిక తప్పనిసరిగా ఉండాలి.
వీటిలో ఏ ఒక్క అలవాటు లేదంటే లక్షణం లేకపోయినా మీ సక్సెస్ మీద ప్రభావం పడుతుంది.
READ THIS ARTICLE ALSO A Comprehensive Guide to TSPSC Group 2 Exam: Pattern, Syllabus, Reference Books, Time Table, and Preparation Tips
గ్రూప్-2 ఆఫీసర్ అవ్వాలంటే
ఇది ఆబ్జెక్టివ్ పరీక్ష విధానం. అందువల్ల చాలామంది అభ్యర్థులు గ్రూప్ 2 పైన ఉత్సాహం చూపిస్తారు. గ్రూప్-2ని పకడ్బందీగా చదివితే గ్రూప్-3, ఇతర పరీక్షల్లో జనరల్ స్టడీస్ ని అవలీలగా కొట్టేయొచ్చు. అందుకే చాలామంది గ్రూప్-2 పరీక్షపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. గ్రూప్-2లో సక్సెస్ కావాలంటే ఈ లక్షణాలు మస్ట్ గా ఉండాల్సిందే.
‣ చిన్న చిన్న అంశాల నుంచి పెద్ద పెద్ద విషయాల దాకా విస్తృతంగా స్టడీ చేయాలి. ఎందుకంటే ఏ మూల నుంచి ఎలాంటి బిట్ వచ్చినా రాయగలిగి ఉండాలి.
‣ తెలుగు అకాడమీ స్పెషల్ బుక్స్, యూనివర్సిటీల ఇంటర్, బీఏ పుస్తకాలు, ప్రభుత్వ అధికారిక ప్రచురణలు, వెబ్‌సైట్ల నుంచి సోర్స్ సేకరించాలి. పేపర్ల వారీగా, చాప్టర్ల వారీగా, అంశాల వారీగా చదవడం అలవాటు చేసుకోవాలి.
‣ గ్రూప్-1 పరీక్షలో విశ్లేషణతో రాయాలి. కానీ గ్రూప్-2 పరీక్షలో సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా అవసరం. అందుకే అవసరమైతే బట్టీ పట్టయినా కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలని నిపుణులు చెబుతుంటారు.
‣ ఎకానమీ లాంటి పేపర్లో స్టాటిస్టిక్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి.
‣ భారతదేశ, తెలంగాణ చరిత్రలతో పాటు… తెలంగాణ ఉద్యమంలో వాస్తవ ఆధారిత అంశాలను జ్ఞాపకం ఉంచుకోవాలి.
‣ రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్స్, కోర్టు తీర్పులపై పట్టు పెంచుకోవాలి.
‣ సోషియాలజీలో సామాజిక సమస్యలపై అవగాహన ఉండాలి. వీటిని తెలంగాణ సమాజానికి అన్వయించుకుని చదువుకోవాలి.
‣ జనరల్ స్టడీస్ లో చాలా విభాగాలు ఉండాలి. వాటిల్లో బేసిక్స్ మీద అవగాహన ఉండాలి. అలాగే బేసిక్స్ ని కరెంట్ ఎఫైర్స్ తో లింక్ చేసుకుంటూ చదువుకోవాలి. అప్పుడే జనరల్ స్టడీస్‌లో కనీసం 65 నుంచి 70శాతం మార్కులు తెచ్చుకోడానికి అవకాశం ఉంటుంది.
గ్రూప్-3 ఆఫీసర్ కొలువు కొట్టాలా ?
గ్రూప్-2లో ఉన్న సిలబస్ అంతా గ్రూప్-3లో ఉంటుంది. గ్రూప్-2 గట్టిగా ప్రిపేరయితే గ్రూప్-3ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. కొంతమంది గ్రూప్-2 స్థాయిలో తాము చదవలేమని అనుకొని గ్రూప్-3 మాత్రమే రాయాలని అనుకుంటారు. వాళ్ళ కోసం టిప్స్
‣ సిలబస్‌లోని అంశాలపై అవగాహనకు రావాలి.
‣ ఏ స్థాయిలో ప్రశ్నలు వస్తున్నాయి… ఈజీ, మోడరేట్… ఇలా ప్రశ్నలమీద దృష్టి పెట్టాలి.
‣ ఫ్యాక్ట్ ఆధారిత ప్రశ్నలు, సమాచారం సేకరిస్తూ ప్రిపరేషన్ సాగించాలి.
‣ గ్రూప్-2 అభ్యర్థులతో పోటీ పడేందుకు విశ్లేషణాత్మక, అన్వయాత్మక ప్రశ్నలకు కూడా తయారయ్యేలా సమయం కేటాయించుకోవాలి.
గ్రూప్-4 లో కొలువు మీదే… ఇలా ఫాలో అయిపోండి…
ప్రతి నిరుద్యోగీ రాసే పరీక్ష గ్రూప్. 4. అందువల్ల పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది. గ్రూప్-4 మాత్రమే రాసే అభ్యర్థులు తీవ్రమైన పోటీని దృష్టిలో పెట్టుకుని హార్డ్ గా ప్రిపేర్ అవ్వాల్సిందే.
‣ గ్రూప్-3 పరీక్షలో లాగే ఫ్యాక్ట్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. అందువల్ల ఆయా విషయాలపై దృష్టి పెట్టాలి.
‣ సెక్రటేరియల్, మానసిక సామర్థ్యాల అంశాలపై పట్టు సాధించాలంటే… రెగ్యులర్ ప్రాక్టీస్ కావాలి. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ రెగ్యులర్ ప్రాక్టీస్ లేకపోతే చాలా నష్టపోతారు.
‣ వీలైనన్ని పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల వాటిపై పట్టు సాధించాలి.
TSPSC: Group.1,2,3,4 Preparation tips for newbies!
Group 1 Prelims is now completed in Telangana. Mains to be held. As per the demand of the unemployed, the government has postponed Group 2 to December.. Group 3 is also likely to happen around then. With the job calendar introduced in the assembly, how much will the number of posts in this group 2, group 2 increase… there is a chance to get some understanding about the exam dates. In the election campaign, the Congress party promised to fill up 2 lakh jobs. Accordingly, the government aims to collect the vacancies in the jobs every year in March… and complete the appointments before December 9.
There is a possibility that there will be additional notifications regarding Group 2, Group 3… Also there is a chance to identify vacancies in Group 4 as per the job calendar.If there are new notifications again… we are providing complete details on how to prepare for any exam through this article. Everyone has to enter the battle of competitive exams. No one can back down. Apply for every notification that appears. Many candidates fail because of trying without a goal. They go into negative thinking saying, “I don’t know how to measure”. To avoid such a situation, to have a positive attitude, some things should be remembered.
To win Group 1
Candidates preparing for Group-1 can definitely succeed if they adopt certain qualities.
‣ Must be able to analyze various things. This will be essential especially in Group 1 Mains.
‣ Develop awareness of statistics… and be able to re-use them in appropriate situations.
‣ Ability to write well and understandably. There should be a nice dastur. Getting used to computer typing…many have forgotten to write. Practice writing.
‣ Understand the different types of questions asked in the written test… and practice the skill of writing answers according to their ideas.
‣ Making own notes. This applies not only to Group 1 candidates… to all.
‣ No matter how many people compete… one should have the confidence and enthusiasm to face them. Go ahead with a positive attitude.
‣ If you think that you will get a job in one year, it is a mistake. If we want to prepare for the long term, we have to prepare the material accordingly. Especially starting from the fundamentals with reference books and academy books.
‣ One should be able to analyze and write a subject broadly…and also write it briefly. Both these abilities should be practiced by the candidate.
‣ There should be a time table for every day, week, month and year. Study according to time… Patience and patience is a must till you crack that exam.
Absence of any one habit or trait will affect your success.
To become a Group-II officer
It is objective mode of examination. Hence most of the candidates are enthusiastic about Group 2. If you read Group-2 carefully, you can crack General Studies in Group-3 and other exams. That’s why many show interest in Group-II exam. To succeed in Group-2, these qualities must be present.
‣ Study extensively from small topics to big topics. Because it should be able to write any bit from any source.
‣ Source should be collected from Telugu Academy Special Books, University Inter, BA Books, Government Official Publications, Websites. Make it a habit to read paper wise, chapter wise and topic wise.
‣ Write with analysis in group-1 exam. But subject knowledge is very important in group-2 exam. That’s why experts say to remember some things even if necessary.
‣ Statistics should be memorized well in a paper like Economics.
‣ In addition to the history of India and Telangana… the fact-based aspects of the Telangana movement should be remembered.
‣ Have a good grasp of the Articles of the Constitution and court judgments.
‣ Sociology involves understanding of social problems. These should be studied and applied to Telangana society.
‣ There should be many sections in General Studies. They should have an understanding of the basics. Also, you should study the basics by linking them with current affairs. Only then there is a chance to get at least 65 to 70 percent marks in General Studies.
Should Group-3 officer be scaled?
All the syllabus in Group-2 will be in Group-3. Group-2 can be easily cracked if Group-2 is prepared hard. Some people think that they cannot read at the level of Group-2 and think that they should write only Group-3. Tips for them
‣ Understand the topics in the syllabus.
‣ At what level questions are coming…easy,moderate…we should focus on the questions.
‣ Fact-based questions, gathering information and preparation.
‣ To compete with Group-II candidates, time should be allocated to prepare analytical and applied questions as well.
The measure is yours in Group-4… Follow this…
A group of tests written by every unemployed person. 4. Hence the competition is also intense. Candidates writing Group-4 only have to prepare hard keeping in mind the intense competition.
‣ As in Group-3 exam more fact based questions will come. Therefore