---Advertisement---

TS Anganwadi Jobs 2024 : 9000 అంగన్‌వాడీల ఉద్యోగాలు… ఇంటర్ పాసైతే చాలు

తెలంగాణలో 9 వేల అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వం త్వరలో భర్తీ చేయబోతోంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ (Notification) తొందర్లోనే వెలువడనుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులను (Anganwadi Teachers, Helper posts) వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో దాదాపు 9000 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. ప్రభుత్వ అనుమతులు రాగానే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తారు.

అర్హతలేంటి ? భర్తీ ఎలా?

తెలంగాణలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో సెంటర్ లో టీచర్ తో పాటు హెల్పర్ ఉంటారు. గతంలో ఈ పోస్టుల్లో పనిచేస్తున్న వాళ్ళు కొందరు రిజైన్ చేశారు. మరికొందరికి సూపర్‌వైజర్లుగా ప్రమోషన్ వచ్చింది. దాంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. టీచర్‌తో పాటు హెల్పర్లుగా నియమితులయ్యేవారు కనీసం ఇంటర్‌ పాసై ఉండాలి. గతంలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు కనీస విద్యార్హత టెన్త్ మాత్రమే. వయోపరిమితి 18 -35 ఏళ్ల మధ్య ఉండాలి. 65 ఏళ్లు దాటిన తరువాత వాళ్ళు రిటైర్డ్ అయిపోవాలి. ఖాళీల్లో 50 శాతం హెల్పర్లకు ప్రమోషన్లు ఇచ్చి భర్తీ చేస్తారు. అలాగే సూపర్‌వైజర్‌ పోస్టుల్లోనూ 50 శాతం ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలి. ఐదేళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లను రూల్స్ కి అనుగుణంగా నియమించాలి. ప్రస్తుతం మాత్రం హెల్పర్లకు ఎలాంటి విద్యార్హతలు లేకుండానే తీసుకున్నారు. ఇకపై ఇంటర్ పూర్తి చేసిన వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని రాష్ట్ర శిశు సంక్షేమశాఖ నిర్ణయించింది.

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!