---Advertisement---

TSPSC Group.1 : నెలాఖరులో గ్రూప్ 1 నోటిఫికేషన్… 46యేళ్ళకు పెంపు !

TSPSC ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోడానికి నిరుద్యోగ అభ్యర్థుల వయో పరిమితిని 44 యేళ్ళ నుంచి 46యేళ్ళకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో యూనిఫామ్ సర్వీసులను మినహాయించారు. అంటే పోలీస్ ఉద్యోగాలకు ఈ సడలింపు వర్తించదు.

ఈ నెల 19 తర్వాత ఎప్పుడైనా TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ (TSPSC Group.1 Notification) రిలీజ్ అవబోతోంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గతంలో TSPSC సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దాన్ని ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఈనెల 19న సుప్రీంలో ఈ కేసు విచారణకు వస్తోంది. మొత్తం 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ లేదంటే… 60 పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ ను TSPSC ఇచ్చే ఛాన్సుంది. పరీక్ష విధానం, సిలబస్ లో కూడా మార్పులు జరగబోతున్నాయి. వీటిపై స్పష్టత వచ్చాక… ఫిబ్రవరి నెలాఖరులోగా కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: GROUP 1 preparation plan

పకడ్బందీగా గ్రూప్ 1 టెస్ట్ సిరీస్

గతంలో మనం Telangana Exams plus ద్వారా TSPSC GROUP.1 (Prelims ) టెస్ట్ సరీస్ నిర్వహించాం. చాలామందికి ఉపయోగపడింది. ఇప్పుడు Telangana exams plus యాప్ తో పాటు కొత్తగా మేం తీసుకొస్తున్న Exams Centre247 యాప్ లో కూడా 2024 సిరీస్ నిర్వహించబోతున్నాం. పూర్తిగా గ్రూప్ 1 concentration గా ఈ సిరీస్ ఉంటుంది. ఇటీవల రద్దయిన Group.1 Prelims లో వచ్చిన ప్రశ్నల స్థాయిని దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రశ్నలను Hard Mode లో తయారు చేయిస్తున్నాం. ఇంగ్లీష్ & తెలుగు మీడియంలో ఉంటుంది.

ఈ టెస్ట్ సిరీస్ లో tspsc గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్నలను కూడా మెన్షన్ చేస్తూ… రెండింటినీ కలిపి చదివేలా స్టడీ ప్లాన్ చేస్తున్నాం. అందుకోసం సివిల్స్ కి కోచింగ్ ఇచ్చే కొందరు ఫ్యాకల్టీల సాయం తీసుకుంటున్నాం. ప్రత్యేక Telegram group కూడా నిర్వహిస్తాం. గ్రూప్ 1 విజేతల Success Formulaలు, ప్రిపరేషన్ ప్లాన్స్, డైలీ క్విజ్, కరెంట్ ఎఫైర్స్ టాపిక్స్, జీకే టాపిక్స్ అన్నీ కూడా http://www.examscentre247.com వెబ్ సైట్ లో కవర్ అవుతాయి.

ఇది కూడా చదవండి: ఫంక్లన్లు, ప్రేమలు వదిలేయండి… ఇలా చదివితే 6నెలల్లో గ్రూప్ 1 ఉద్యోగం

2024 కొత్త టెస్ట్ సిరీస్ ఎప్పటి నుంచి

Telangana Exams plus యాప్ తో పాటు Exams Centre247 (రాబోతోంది)లో ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి నెల మొదటి వారం నుంచి TSPSC Group.1 Tests Series -2024 ను మొదలుపెడతాం. వివరాలు తర్వాత తెలియజేయబడతాయి. ఈలోగా నోటిఫికేషన్ వెలువడితే.. కొత్త యాప్ కూడా అందుబాటులోకి వస్తుంది.
Please follow:
http://www.examscentre247.com

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!