---Advertisement---

TSPSC Group.1 Recruitment: 600 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ?

తెలంగాణలో గ్రూప్–1 (Telangana Group 1 posts) పోస్టులను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోని 503 ఖాళీలకు తోడుగా మరో 160కి పైగా పోస్టులను చేర్చాలని భావిస్తోంది. రాష్ట్ర మంత్రమండలిలో దీనిపై చర్చ జరిగింది.  కొత్త పోస్టులతో కలిపి మొత్తం ఖాళీలు 600 వరకూ ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి వరకు మరో 160 పోస్టులు ఖాళీ అవుతాయని అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఆయా శాఖలు ఖాళీల వివరాలను ఆర్థికశాఖ తెప్పించుకుంది. మంత్రిమండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించారు.  గ్రూప్-1 నోటిఫికేషన్‌పై నిర్ణయాన్ని అతి తొందర్లోనే  ప్రకటించే అవకాశముంది.

గత BRS హయాంలో 503 గ్రూప్ –1 పోస్టులను గుర్తించారు. అప్పట్లో నోటిఫికేషన్ ఇవ్వడం… ప్రిలిమ్స్ ఎగ్జామ్ (Group1 Prelims) ఒకసారి పేపర్ల లీకేజీ కారణంగా రద్దవడం… మరోసారి ఎగ్జామ్స్ నిర్వహించేటప్పుడు అభ్యర్థుల బయో మెట్రిక్ సరిగా నిర్వహించకపోవడంతో హైకోర్టు దాన్ని రద్దు చేసింది. హైకోర్టు తీర్పు సవాలు చేస్తూ… అప్పటి ప్రభుత్వం ఆదేశాలతో TSPSC  సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తుది తీర్పు ఇంకా పెండింగ్ లో ఉంది. ఆ కేసు విచారణ పూర్తయి, తుది తీర్పు వచ్చేసరికి టైమ్ పడుతుంది. అందుకే  కేసు వెనక్కి తీసుకొని… హైకోర్టు ఆదేశాల ప్రకారం గతంలో జరగిన పరీక్షను  రద్దు చేసి… కొత్తగా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. TSPSC GROUP-1 పరీక్షపై ఎలా వ్యవహరించాలన్న దానిపై కొత్త TSPSC బోర్డు, ప్రభుత్వం న్యాయ నిపుణులను సంప్రదించింది. హైకోర్టు ఆదేశాలతో పరీక్ష రద్దుచేసి ముందుకెళ్లాలా? లేదంటే సుప్రీంకోర్టు  తీర్పు వచ్చే దాకా వెయిట్ చేయాలా… కొత్తగా గుర్తించే ఖాళీలతో లేటెస్ట్ గా మరో గ్రూప్-1 నోటిఫికేషన్ వేయాలా… లేదా పాత నోటిఫికేషన్‌కు అనుబంధంగా చేర్చడమా? అనే దానిపై నిర్ణయం రావాల్సి ఉంది. ఇప్పటికే వివిధ విభాగాల్లోని అదనపు ఖాళీలు గుర్తించారు. ఆర్థికశాఖ దగ్గరకు ప్రతిపాదనలు వచ్చి చేరాయి. ఈ వివరాలను TSPSC రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు, సర్వీసు నిబంధనలు, విద్యార్హతలు అన్నీ పరిశీలించాకే కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముంది.

గ్రూప్ 2,3 ఇతర పోస్టులపై కేబినెట్ లో చర్చ

తెలంగాణలో  గ్రూప్ 2, 3 పోస్టుల భర్తీపైనా కేబినెట్ లో చర్చ జరిగింది.  అలాగే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి వెంటనే ఖాళీల వివరాలు తెప్పించాలనీ, మెగా డీఎస్సీ నిర్వహణపై కసరత్తు చేయాలని అధికారులను మంత్రిమండలి ఆదేశించినట్టు సమాచారం.  వ్యవసాయ శాఖలో AEO పోస్టులను కూడా భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

2024 UPDATED NEW TEST SERIES WILL BE START in TELANGANA EXAMS PLUS … Coming Soon…..

Download app:https://atvqp.on-app.in/app/oc/70565/atvqp?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral-wa%26utm_campaign%3Dcourse-overview-app

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!