---Advertisement---

TSPSC Group 2 Topper : గ్రూప్ 2 విజేతలు ఎలా అయ్యారు ?

 

  • గ్రూప్ 2 ఉద్యోగమే డ్రీమ్ గా పెట్టుకొని … సక్సెస్ సాధించారు… స్టేట్ ఉమెన్ టాపర్ గా నిలిచారు… సత్తుపల్లికి చెందిన దేవగిరి నిర్మల…
  • ఈ ఇంటర్వ్యూ 2019లో వచ్చింది… అప్పటికి ఏడేళ్ళ క్రితం నుంచే ఆమె గ్రూప్ 2 ప్రిపరేషన్ మొదలుపెట్టారు.
  • ఆ తర్వాత మ్యారేజ్, బాబు పుట్టడంతో కొంత గ్యాప్ వచ్చింది… అయినా గోల్ రీచ్ కావాలి… జీవితంలో ఏదైనా పెద్ద ఉద్యోగం సంపాదించాలి అన్న పట్టుదలే ఆమెను స్టేట్ ఉమెన్ టాప్ గా నిలబెట్టింది.
  • కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వందశాతం పేపర్ అటెంప్ట్ చేయడం కష్టం. కానీ మన ఎఫర్ట్ 100 శాతం ఉండాలంటారు నిర్మల.
  • స్టాండర్డ్ బుక్స్ తీసుకొని… చదవడం, ఎక్కువసార్లు రివిజన్ చేయడం…లాంటివి చేస్తే ఉద్యోగం సంపాదించడం గ్యారంటీ
  • రోజుకు ఎన్ని గంటలు చదివాం అన్నది ముఖ్యం కాకుండా… ఆ చదివిన గంటల్లో ఎంత వరకు మన మైండ్ కి ఎక్కించుకున్నాం అన్నది ముఖ్యం అంటున్నారు
  • సబ్జెక్ట్ ఎక్కడం లేదు అనుకున్నప్పుడు పుస్తకం పక్కన పెట్టేయడం బెటర్.
  • నెక్ట్స్ టైమ్ మళ్ళీ మొదలుపెట్టేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది.
  • ప్రతి రోజూ న్యూస్ పేపర్ చదవడం… దాని క్లిప్పింగ్స్ కట్ చేసుకునేవారు… వాటిని రివిజన్
  • గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యేవాళ్ళంతా… తప్పని సరిగా సిలబస్ అర్థం చేసుకొని… స్టాండర్డ్ బుక్స్ చదివితే విజేతలు కావడం గ్యారంటీ.
  • ఎవరైనా సరే… బిట్లుగా….. బిట్ బ్యాంక్స్ చదువుకుంటే ఎంత మాత్రం ప్రయోజనం ఉండదు…
  • సబ్జెక్ట్ లో లెసన్స్ పూర్తిగా చదివితేనే ప్రయోజనం ఉంటుంది… బిట్స్ చదివితే కాన్సెప్ట్ అర్థం కాదు… అదే లెసన్ చదివితే… అందులో ఎన్ని అనుబంధ ప్రశ్నలు ఇచ్చినా ఖచ్చితంగా సరైన సమాధానం గుర్తించే అవకాశం ఉంటుంది
  • పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ లో… మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ సరిగా రాయలేదు… కాకపోతే అందరికీ అలాంటి పరిస్థితే కావడంతో… మిగతా పేపర్లన్నీ హ్యాపీగా రాసినట్టు నిర్మల తెలిపారు.
  • ఈ విజేత ఇంటర్వ్యూ ద్వారా మనం గ్రహించాల్సింది ఏమంటే…
  • ప్రతి రోజూ టైమ్ పెట్టుకోవాలి… కానీ మనకు concentration ఉన్నంత సేపే చదవాలి…
  • మొక్కుబడిగా ముందేసుకొని టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. మనకి ఏకాగ్రత కుదరడం లేదు అన్నప్పుడు… కొంచెం సేపు రిలాక్స్ అవ్వాలి… మ్యూజిక్ వినడం, గార్డెనింగ్ లాంటి పనులతో కొద్దిసేపు గడపాలి..
  • తను సొంతంగా నోట్స్ రాసుకోలేదు… కానీ ప్రతి రోజూ పేపర్ కటింగ్స్ తీసుకొని… వాటిని సబ్జెక్ట్, టాపిక్ వైజ్ గా భద్రం చేసుకొని… రివిజన్ చేశారు
  • మీరు నోట్స్ రాసుకున్నా ఓకే… లేకపోయినా ఫర్వాలేదు… కానీ ఏ రోజు డైలీ పేపర్ ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలి… పెండింగ్ అనేది ఉండొద్దు… అన్నీ ఒకేసారి చదువుకుందాం అని మాత్రం అనుకోవద్దు
  • బిట్ బ్యాంక్స్ ఫాలో కాలేదు… సబ్జెక్ట్ లో టాపిక్స్ లేదా లెసన్ వైజ్ గా చదువుకొని అర్థం చేసుకున్నారు.
  • బిట్ బ్యాంక్స్ మాత్రమే ఫాలో అయితే… సరిపోదు… మనకు అనుకున్న స్థాయిలో మార్కులు వచ్చే ఛాన్స్ లేదు
  • సిలబస్ అర్థం చేసుకొని… స్టాండర్డ్ బుక్స్ ఫాలో అయితేనే విజేతలుగా నిలుస్తారు.
  • తెలుగు అకాడమీ బుక్స్… ఫేమస్ రైటర్ల బుక్స్
  • 6-10 class బుక్స్ మస్ట్… కొత్తవి అయినా… పాతవి అయినా… ఓకే.
  • ఇంగ్లీష్ మీడియం వాళ్ళు… 6- 12th standard దాకా NCERT బుక్స్ బాగా పనికొస్తాయి.
  • మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ని మొదటి రోజు నుంచే ఫాలో అవ్వాలి… ఒక్కోసారి ఈ టాపిక్ వల్లే మనం ఎగ్జామ్ కోల్పోయే ఛాన్సుంది
  • ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు… మనకి మనం 100 శాతం ఎలా ప్రిపేర్ అవుతున్నాం అన్నది చెక్ చేసుకోవాలి…
  • అందుకోసం ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి.. అది కూడా స్టాండర్డ్ వెబ్ సైట్స్… స్టాండర్డ్ బుక్స్ నుంచి మాత్రమే.
  • ఓల్డ్ క్వొశ్చన్ పేపర్స్ అన్నీ ఒక్కసారి తిరగేయాలి…
  • నిర్మల గారి విక్టరీ రహస్యాలు ఇవి.
  • ఇలాంటి ఇంటర్వ్యూలు మీకు Inspiration గా నిలుస్తాయి.
  • మీ strategy లో ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకోడానికి అవకాశం కలుగుతుందౌ

 

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!