తెలంగాణాలో ఖాళీగా ఉన్న 8,180 గ్రూప్ 4 సర్వీస్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షల్లో జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితాను TSPSC విడుదల చేసింది. ఇందులో 7,26,837 మంది అభ్యర్థులు ర్యాంకులు పొందారు. మొత్తం 7.6 లక్షల మంది గ్రూప్ 4 ఎగ్జామ్ రాశారు. మొత్తం 300 మార్కుల ఎగ్జామ్ లో కుమరం భీం అసిఫాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థి 220.458 మార్కులతో రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించాడు.
ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను TSPSC తర్వాత ప్రకటించనుంది. 2023 జులై 1 న గ్రూప్ 4 ఎగ్జామ్స్ రెండు పేపర్లను ఉదయం, మధ్యాహ్నం నిర్వహించారు. పేపర్ 1 లో ఏడు, పేపర్ 2 లో మూడు మొత్తం 10 ప్రశ్నలను TSPSC తొలగించింది. రెండు పేపర్లలో మొత్తం 13 ప్రశ్నలకు జవాబులను మార్పులు చేశారు. ఇందులో ఐదింటికి ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు సరైనవిగా పేర్కొన్నారు. ఫైనల్ కీ ఆధారంగా వ్యాల్యుయేషన్ చేసింది TSPSC. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ కేటాయించకుండా సమాంతర రిజర్వేషన్ పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానిపై స్పష్టత రావడంతో గ్రూప్ 4 ఫలితాను TSPSC ప్రకటించింది.
TSPSC MERIT జాబితా కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
https://hallticket.tspsc.gov.in/downloadGIVresult