---Advertisement---

UPSC CIVILS 2024 Notification: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్‌ రిలీజ్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే Civil Services Examination -2024 కు నోటిఫికేషన్‌ రిలీజ్ అయింది. IAS, IPS, IFS లాంటి వివిధ కేంద్ర సర్వీసులకు చెందిన దాదాపు 1056 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ తో భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అప్లయ్ చేయొచ్చు.

డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏయే సర్వీసులు :
Indian Administrative Service,

Indian Police Service

Indian Foreign Service

Indian Audit & Accounts Service

Indian Civil Accounts Service

ఇలాంటివి మొత్తం 21 సర్వీసులు ఇందులో ఉన్నాయి.

Civils : సివిల్స్ రాయాలంటే ఎలా ? (Complete Guidance)

వయస్సు :
అభ్యర్థుల వయసు ఆగస్టు 1, 2024 నాటికి 21 నుంచి 32 ఏళ్ళు మించరాదు. అంటే ఆగస్టు 02, 1992 నుంచి ఆగస్టు 01, 2003 మధ్య పుట్టి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీకి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎన్ని సార్లు రాసుకోవచ్చు

జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 6 సార్లు, OBCలు, దివ్యాంగులు (GL/EWS/OBC)కు 9సార్లు అటెంప్ట్‌ చేసే అవకాశం ఉంది. SC/ST అభ్యర్థులకు ఎలాంటి పరిమితి లేదు.
ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము కింద రూ.100 చెల్లించాలి. (మహిళలు/ఎస్సీ/ ఎస్టీ/PWD అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

పరీక్ష విధానం..
మొత్తం మూడు దశల్లో సెలక్షన్‌ ప్రాసెస్‌ ఉంటుంది.

1st Stage : ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 2 గంటల్లో 200 మార్కుల చొప్పున ఉంటుంది. ఒకటే రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. 2 పేపర్లలో ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. రెండో పేపర్ జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్‌. ఇందులో 33 శాతం అర్హత సాధించాలి. రెండు పేపర్లకు నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్స్ అనుమతిస్తారు.

2nd Stage : మెయిన్స్ పరీక్షలు మొత్తం 1750 మార్కులకు ఉంటాయి.

3rd Stage: ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది.

ఇలా సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష మొత్తం 2025 మార్కులకు నిర్వహిస్తారు.
పూర్తి వివరాలకు ఈ కింది నోటిఫికేషన్ చూడండి.

CLICK FOR CIVILS NOTIFICATION 2024

 

 

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!