తెలంగాణలోని 10 యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ (Vice Chancellors) పోస్టులను భర్తీ చేయడానికి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి (ఆదివారం) దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 12 సాయంత్రం 5 గంటల దాకా వీసీ పోస్టుల కోసం అప్లయ్ చేసుకోవచ్చు.
ఇందులో ఏవేవి యూనివర్సిటీలు ఉన్నాయంటే
1) JNTUH
2) Osmania University
3) Kakatiya University
4) Telangana University
5) Satavahana University
6) Palamuru University
7) Mahatma Gandhi University
8) Telugu University
9) Archtecture (JNAFAU)
10) Ambedkar Oopen University
2019 జూన్, జులైలోనే వీళ్ళ పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాత రెండేళ్ళకు కొత్త వీసీలను గత BRS ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత వీసీల పదవీకాలం ముగియక ముందే కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని విద్యాశాఖాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
అర్హతలు, వయస్సు, అనుభవం, ఎంపిక విధానం తదితర వివరాలకు ….
నోటిఫికేషన్ వివరాలు : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెబ్ సైట్ లో ఉన్నాయి.
Visit : http://www.tsche.ac.in
మరో రెండు యూనివర్సిటీలు పెండింగ్
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బాసరలోని RGUKT కి (Basara) వైస్ ఛాన్సలర్ ను నియమించలేదు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు కూడా గవర్నరే ఛాన్సలర్. కానీ RGUKT కి మాత్రం మొదట్లో ఛాన్సలర్ ను నియమించారు. ఇప్పుడు వీసీని నియమిస్తారా … ఛాన్సలర్ ను నియమిస్తారా అన్నదానిపై సందేహాలు ఉన్నాయి. కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీగా ( Koti Women University) అప్ గ్రేడ్ చేస్తూ రెండేళ్ళ క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ అసెంబ్లీలో ఇప్పటిదాకా బిల్లు ప్రవేశపెట్టలేదు. ఆ ప్రక్రియ పూర్తి అయ్యాకే మహిళా వర్సిటీకి వీసీని నియమించాల్సి ఉంటుంది.