2018 గ్రూప్-1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 15వ ర్యాంక్ సాధించి.. SC విభాగంలో స్టేట్ టాపర్ గా నిలిచారు వై.ఓబులేష్. మున్సిపల్ కమీషనర్ గా ఎంపికయ్యారు. IAS, IPS…Group-1 ఏదైనా సరే… సాధించాలన్న కోరిక లక్షల మందికి ఉంటుంది. కానీ వీళ్ళల్లో సిన్సియర్ గా కసితో చదివేది ఎంతమంది ? లవ్, అట్రాక్షన్… ఫ్రెండ్స్, పార్టీలు, ఫంక్షన్లు… అన్నీ పక్కనబెట్టి… ఏడాది పాటు సిన్సియర్ గా ప్రిపేర్ అయితే…. 30 ఏళ్ళ పాటు బంగారు భవిష్యత్తును అనుభించవచ్చు అంటున్నారు ఓబులేష్.
టార్గెట్ సివిల్స్… గ్రూప్ 1 కొట్టేశారు !
Group.1 టాపర్ గా నిలిచి … మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం సంపాదించిన ఓబులేష్… IAS సాధించాలన్న కోరిక బలంగా ఉండేది. వెనుకబడిన గ్రామీణ ప్రాంతంలో… దిగువ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. వాళ్ళ గ్రామంలో డిగ్రీ పూర్తి చేసిన మొదటి వ్యక్తి. సర్కారీ నౌకరు కొట్టిన మొదటి వ్యక్తి కూడా. ఎంతో కష్టపడి టెన్త్, ఇంటర్ పూర్తి చేశారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఉంది చదువుకున్నారు. అక్కడ తనకంటే ఎక్కువ సమస్యలున్న వాళ్ళని చూశాడు… పేదల మధ్య గడిపిన ఆయనలో నిత్యం కసిని రగిల్చింది. అనుకున్నది సాధించారు. కష్టాలో ఉండే వారికి మంచి చేయాలన్న ఆలోచనలతో IAS చదవాలనుకున్నారు ఓబులేష్. సివిల్స్ లక్ష్యంతో 2011లో ప్రిపరేషన్ ప్రారంభించి… అదే ఏడాది APPSC గ్రూప్-1 అప్లై చేశారు. ఇంటర్వ్యూ దాకా వెళ్ళినా… కోర్టు ఆదేశాలతో మళ్ళీ 2016లో ఎగ్జామ్స్ రాశారు. విజయం సొంతం చేసుకున్నారు.
హార్డ్ వర్క్ చేసే అలవాటు… ఓపిక… ఉంటే సివిల్స్, గ్రూప్-1 ఎగ్జామ్స్ లో తప్పకుండా విజేతలుగా నిలుస్తారని అంటున్నారు ఓబులేష్. సివిల్స్ కోసం సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. ఆ అనుభవం గ్రూప్-1 సక్సెస్ కు ఉపయోగపడింది. గ్రూప్-1 మెయిన్స్ కోసం ఆరు వారాలే మాత్రమే ప్రిపేర్ అయ్యారట. అప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం చేస్తుండటంతో… సెలవు పెట్టి ప్రిపరేషన్ మొదలు పెట్టారు. ప్రిలిమ్స్ ఫలితాలకు మెయిన్స్ కీ మధ్య రెండు నెలల కంటే తక్కువ టైమ్ ఉంది. అయినా భయపకుండా పట్టుదలగా చదివారు. అప్పటికే ఎగ్జామ్స్ కి సంబంధించిన అన్ని అంశాలపై మంచి బేస్ సంపాదించారు ఓబులేష్. సివిల్స్ కి ప్రిపేర్ అయి ఉండటం కూడా కలిసొచ్చింది.
ఆరు వారాల్లో Group.1 Mains ఎలా సాధ్యం అంటే…
Group.1 Mains లో ఐదు పేపర్లు ఉన్నాయి. ప్రతి పేపర్ ని సెక్షన్ల వారీగా విభజించి, ఏ సెక్షన్ నుంచి ఎలాంటి ప్రశ్నలకు అవకాశం ఉంటుందో అంచనా వేసుకున్నారు. కొంతవరకు సెలక్టివ్ గా చదివారు ఓబులేష్. ప్రీవియస్ క్వొశ్చన్ పేపర్లు స్టడీ చేశారు. గతంలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు… ఇప్పుడు ఎలా అడిగే అవకాశం ఉంది… అన్న దానిపై బాగా అనలైజ్ చేసారు. ఏ అంశాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలి, వేటిని ప్రక్కన పెట్టాలో అంచనా వేసుకున్నారు. సిలబస్ లోని చాలా అంశాలు సమకాలీన విషయాలతోనే ముడి పడి ఉంటాయి. ఇదే అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి… ప్రతి సబ్జెక్టుకు రెండు ట్రెండ్స్ ని లింక్ చేసుకుని ప్రిపేరయ్యారు. వారానికో పేపర్ చొప్పున…. ఐదు వారాల్లో ఐదు పేపర్లు కవర్ చేసారు. చివరివారం రోజులు రివిజన్ కు కేటాయించా. ప్రిపరేషన్లో రివిజన్ అనేది చాలా చాలా ముఖ్యం అంటున్నారు గ్రూప్ 1 విజేత ఓబులేష్. ఎగ్జామ్ రాసే సమయానికి… మొత్తం సబ్జెక్టులను కనీసం మూడు సార్లయినా రివిజన్ చేయాల్సిందే. గతంలో మూడు సార్లు సివిల్స్ మెయిన్స్ రాసిన అనుభవం…. గ్రూప్-1 మెయిన్స్ ఆరు వారాల్లోనే కంప్లీట్ చేయడానికి ఉపయోగపడింది. ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండటం కూడా ఇందుకు కారణం.
గ్రూప్ 1 ప్రిపరేషన్ కు ఎంత టైమ్ కావాలి?
Group.1 కొట్టాలంటే కనీసం ఆరు నెలల నుంచి One Year టైమ్ అవసరం. ఎంత టైమ్ ప్రిపేరయితే సక్సెస్ అవుతామన్నది అభ్యర్థుల శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అందరికీ వర్తించేలా చెప్పాలంటే… ఏడాది కాలం పాటు కచ్చితమైన ప్లానింగ్… హార్డ్ వర్క్ చేయగలిగితే Group.1 విజేతలు కావడం సాధ్యమవుతుంది.
ప్రిలిమ్స్… మెయిన్స్ కి కలిపి ఒకటే ప్రిపరేషన్
గ్రూప్ 1 లో ప్రిలిమ్స్ కు, మెయిన్స్ కి వేర్వేరుగా ప్రిపరేషన్ అనేది ఉండకూడదు. రెండింటిలో ఉండే కామన్ టాపిక్స్ డివైడ్ చేసుకొని… ప్రిలిమ్స్, మెయిన్స్ కి ఒకేసారి చదవాలి. ఉదాహరణకు సిలబస్ లో ఇండియన్ ఎకానమీని తీసుకుంటే… అందులో అగ్రికల్చర్ సెక్టార్ నుంచి…
ప్రిలిమ్స్ లో అయితే…. ఈ ఏడాది ఇండియన్ అగ్రికల్చర్ గ్రోట్ రేట్ ఎలా ఉంది?
ఈ గ్రోత్ రేట్ … గత ఏడాదితో పోలిస్తే పెరిగిందా? తగ్గిందా?
ఒకవేళ తగ్గితే ఏయే కారణాల వల్ల తగ్గింది. పెరిగితే ఏ కారణాల వల్ల పెరిగింది.
ఇలాంటి బేసిక్ ఫ్యాక్ట్స్ అడిగే అవకాశం ఉంటుంది.
అదే మెయిన్స్ అయితే అదే సిలబస్ నుంచి
భారత వ్యవసాయరంగం అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది, వివరించండి…. లాంటి ప్రశ్నలకు అవకాశం ఉంటుంది. ఒకే టాపిక్ నుంచి ప్రిలిమ్స్ మెయిన్స్ లో ఎలాంటి ప్రశ్నలను అడగడానికి అవకాశం ఉంటుందో విశ్లేషించుకుంటూ చదవాలి. ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కవరయ్యేలా లోతైన విశ్లేషణతో సమగ్రంగా చదవాలి. అప్పుడే విజేతలు అవడానికి అవకాశం ఉంటుంది.
కోచింగ్ ఉంటేనే గ్రూప్ 1 కొడతామా ?
కోచింగ్ తప్పనిసరి అని మాత్రం చెప్పడం లేదంటున్నారు గ్రూప్ విజేత ఓబులేష్. కోచింగ్ తీసుకోవడం మంచిదే. అయితే మంచి ప్రమాణాలతో నడిచే సంస్థల్లో కోచింగ్ తీసుకోవాలి. అవగాహన లేక అంతగా పేరు లేని ఇనిస్టిట్యూట్ లో సివిల్స్ కోచింగ్ తీసుకొని రెండేళ్ళ టైమ్ నష్టపోయానని చెప్పారు.
గ్రూప్-1 ప్రిపేరయ్యే వాళ్ళూ ఇవి గుర్తుంచుకోండి ….
ఆర్థిక సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి. నేను కూడా పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ వాటిని పరిష్కరించుకున్నానని చెబుతున్నారు గ్రూప్ 1 విజేత ఓబులేష్. ఇలా పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ సివిల్స్, గ్రూప్-1 సాధించిన వాళ్ళు దేశంలో వందల మంది ఉన్నారు.
ఫలానా సమస్య వల్ల… నేను కోరుకున్న జీవితాన్ని సాధించకలేకపోతున్నానని మనకు మనం సాకులు చెప్పుకోవద్దు. ప్రతి సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చు. చదువే అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నా… కోరుకున్న ప్రతీదీ సాధించాలన్నా కూడా చదువే మార్గం చూపిస్తుంది. సివిల్స్, గ్రూప్-1 లాంటి ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే హార్డ్ వర్క్ చేయడంతో పాటు క్రమశిక్షణ విషయంలో రాజీ పడకూడదు.
గుర్తుంచుకోండి…
కనీసం ఏడాది అయినా మరో ఆలోచన, వ్యాపకం లేకుండా హార్డ్ వర్క్ చేయాల్సిందే. టైమ్ పాస్ వ్యవహారాలూ, ఫంక్షన్లూ, పార్టీలు.. అన్నీ మర్చిపోవాలి… ప్రతి ఎగ్జామ్ యొక్క సరళిని అర్థం చేసుకుని సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేసేవాళ్ళే విజేతలుగా నిలుస్తారని 2018 గ్రూప్-1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 15వ ర్యాంక్ సాధించి.. SC విభాగంలో స్టేట్ టాపర్ గా నిలిచారు వై.ఓబులేష్ చెబుతున్నారు.
మీరు కూడా అదే బాటలో నడవాలని… www.examscentre247.com వెబ్ సైట్ కోరుకుంటోంది.
(Exams Centre247 app త్వరలోనే మీ ముందుకు వస్తోంది… Telangana Exams plus యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మేం అందిస్తున్న గ్రూప్ 1 కోర్సుల్లో జాయిన్ అవ్వండి.