ఆంధ్రప్రదేశ్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) రాసేందుకు అర్హతలను ఏపీలో సవరించారు. 1 నుంచి 5 తరగతులకు చదువు చెప్పే SGTలకు నిర్వహించే టెట్ – 1 పేపర్ కు రెండేళ్ళ Diploma in Elementary Education (DELed), నాలుగేళ్ళ Bachelor of Elementary Education (BELEd) చేసిన వాళ్ళే అర్హులు. ఓసీలకు ఇంటర్ తత్సమానంలో 50శాతం మార్కులు ఉండాలి. SC/ST/BC దివ్యాంగులకు 5శాతం మినహాయింపు ఉంది. SGT పోస్టులకు B.Ed., చేసిన వారు అర్హులేనంటూ జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దాంతో ఏపీ ప్రబుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహించాలన్న నిబంధనను ఒక్కసారికి కుదించింది వైసీపీ ప్రభుత్వం.
టెట్ పేపర్ 2A కు హాజరయ్యే SC/ST/BC, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులను 40శాతానికి తగ్గించింది. ఈ మినహాయింపు ఒక్కసారికి మాత్రమే. గతంలో టెట్ రాసేందుకు అర్హత మార్కులు 45శాతం ఉండేది. డిగ్రీలో 40శాతం మార్కులు ఉంటే B.Ed., చేయడానికి అనుమతి ఉంది. కానీ టెట్ రాయడానికి మాత్రం 45శాతం మార్కులు డిగ్రీలో ఉండాలన్న నిబంధనపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దాంతో ప్రభుత్వం మినహాయింపు ఇస్తూ వస్తోంది.