ప్రస్తుతం మనకు మాల్దీవులకు సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఆ దేశాధ్యక్షుడిగా మొహమ్మద్ మయిజ్జు చైనా (China) అనుకూల వైఖరిని అనుసరించడం… భారత్ సైనికులను తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని హెచ్చరించారు కూడా. అయినా సరే… కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో రూ.600 కోట్లు కేటాయించడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం కోసమే బడ్జెట్ లో మాల్దీవులకు రూ.600 కోట్లను కేటాయించారు. కానీ కిందటేదాదితో పోలిస్తే… ఇప్పుడు మాల్దీవుల నిధుల్లో 50శాతం కోత పడింది. 2023-24 బడ్జెట్‌లో మాల్దీవుల అభివృద్ధికి రూ.400కోట్లు ప్రపోజల్స్ పెట్టారు. కానీ సవరించిన అంచనాల ప్రకారం రూ.770 కోట్లు ఖర్చయ్యాయి. ఆ అమౌంట్ తో పోలిస్తే… ప్రస్తుత బడ్జెట్‌లో 22 శాతం తగ్గాయి.
పొరుగు దేశాలకు నిధులు ఎందుకు ఇస్తారంటే…
బడ్జెట్‌లో (Central Budget) కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా విదేశాలకు నిధుల కేటాయింపు జరుపుతుంది. విదేశాంగ శాఖకు రూ.22,154 కోట్లు కేటాయించారు. ఇందులో భూటాన్‌కు రూ. 2068 కోట్లు..నేపాల్‌కు రూ. 700 కోట్లు…ఆఫ్ఘనిస్తాన్‌కు రూ.200 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లు, మాల్దీవులకు రూ.600 కోట్లు కేటాయించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఇరాన్‌తో కలసి నిర్మిస్తున్న చాబహార్ పోర్టు నిర్వహణకు రూ.100 కోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పొరుగు దేశాలతో సంబంధాలను బట్టి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్, లైన్ ఆఫ్ క్రెడిట్ ఇస్తూ ఉంటుంది. వాణిజ్యం, ఇంధన, ఆరోగ్య రంగాలు, ఇంజినీరింగ్, ఐటీ, ఆటలు, సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలకు ఇలా నిధుల కేటాయింపు జరుగుతుంది