---Advertisement---

చరిత్ర మలుపు తిప్పిన ఆ రెండు తీర్పులు

Supreme Court 75 Yrs :

సుప్రీం కోర్టు ఏర్పాటైన 75 యేళ్ళల్లో ఎన్నో తీర్పులు ఇచ్చింది. అయినా 1973 నాటి కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, 1967లో ఇచ్చిన గోలక్ నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ తీర్పులు చరిత్రలో నిలిచి పోయాయి. కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ మూలస్వరూపాన్ని మార్చడానికి వీల్లేదని కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. ఇది ప్రాథమిక హక్కుల కేసుగా గుర్తింపు పొందింది. రాజ్యాంగంలో సవరణలను 7-6 మెజార్టీతో ఈ తీర్పు కొట్టివేసింది. 13 మందితో కూడిన నాటి ధర్మాసనంలో తెలుగు వారైన న్యాయమూర్తి జస్టిస్ పి.జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. 1967 నాటి గోలక్ నాధ్ కేసులో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను తొలగిం చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ అధికారం పార్లమెంటుకు లేదని అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది.

 

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!