Supreme Court 75 Years : 1950 జనవరి 28 ఉదయం 9.45 గంటలకు న్యాయమూర్తులు మొదటిసారి సమావేశం అయ్యారు అప్పుడే సుప్రీంకోర్టు అధికారిక ప్రారంభంగా గుర్తించారు. ప్రస్తుత కోర్టు నడుస్తున్న భవనం అందుబాటులోకి వచ్చేదాక పాత పార్లమెంటు భవనంలోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ లో సుప్రీంకోర్టును (Supreme Court) నిర్వహించారు. అప్పట్లో సుప్రీంకోర్టు ఏడాదికి 28 రోజులు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు మాత్రమే నిర్వహించారు. తర్వాత ఏడాదికి 190 రోజులు పనిచేసే స్థాయికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు ఏర్పడే నాటికి న్యాయమూర్తుల సంఖ్య 8 (7+1) ఉంటే… ఇప్పుడు 34 మందికి చేరింది. ప్రస్తుతం ఢిల్లీలోని తిలక్ మార్గ్ లో ఉన్న సుప్రీంకోర్టు బిల్డింగ్ 17 ఎకరాల్లో త్రికోణాకార స్థలంలో నిర్మించారు. 1954 అక్టోబరు 29న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే 1958 15 ఆగస్టు 4న ఈ కోర్టును ప్రారంభించారు. ఇది న్యాయ దేవాలయం అన్నారు బాబూ రాజేంద్ర ప్రసాద్. సుప్రీంకోర్టు చిహ్నంగా సారానాథ్ (Saranath ) లోని అశోకుడి స్తూపం నుంచి ధర్మచక్రాన్ని స్వీకరించారు. ఈ చిహ్నం కింద న్యాయం: ఎక్కడుంటే విజయం అక్కడే అని అర్థం వచ్చే… ‘యతో ధర్మస్తతో జయః అని సంస్కృత సూక్తి రాసి ఉంటుంది.