---Advertisement---

Telangana Job Calender : మీకు ఉద్యోగం వచ్చినట్టే… ఈ కేలండర్ ఫాలో అయితే !

కాంగ్రెస్ అన్నమాట నిలబెట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి యేటా UPSC తరహాలో జాబ్ కేలండర్ ప్రకటించబోతోంది.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి (CM Revanth Reddy) పదవి చేపట్టగానే ఢిల్లీలో UPSCకి వెళ్ళొచ్చారు. ఆయనతో పాటు అధికారులు కూడా వెళ్ళి UPSC ఎగ్జామ్స్ నిర్వహణ తీరును పరిశీలించారు. దానికి అనుగుణంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ కేలండర్ ను (Telangana Job Calendar released in TG Assembly) రేవంత్ రెడ్డి విడుదల చేయబోతున్నారు. దీనికి చట్టబద్ధత కల్పిస్తామని కూడా అంటున్నారు. అదే జరిగితే ఇక రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా ఆ జాబ్ కేలండర్ ను అమలు చేయాలి.
ప్రతి ఏటా మార్చి నెలలోగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సేకరిస్తారు. ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ లోపు ఎన్ని ఖాళీలు అవుతాయి అన్నది సేకరిస్తారు. ఆ తర్వాత … ఏప్రిల్, మే నెలల్లో వాటికి సంబంధించి… నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తారు. లీగల్ సమస్యలు రాకుండా.. పకడ్బందీగా నోటిఫికేషన్లు రూపొందిస్తారు. ఆ తర్వాత జూన్ 2 అంటే తెలంగాణ అవతరణ దినోత్సవం లోపే ఆ ఏడాదికి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తారు. అంటే ఏప్రిల్, మే నెలల్లో మనకు నోటిఫికేషన్లు వస్తాయి. జూన్ 2 తర్వాత ఇక ఏ నోటిఫికేషన్ ఉండదు.

ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారు ? ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు… ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి… లాంటి వివరాలు… జాబ్ కేలండర్ లో ఉంటాయి. ప్రస్తుతం UPSC, SSC ఈ రెండు సంస్థలు కూడా ఏడాదికి ముందే జాబ్ కేలండర్ ఇస్తున్నాయి. ఆరు నూరైనా అవి అమలవుతాయి. వాయిదాలు, కోర్టు కేసులు లాంటివి ఉండవు. ఒకవేళ… పేపర్ లీకేజీలు అయితే తప్ప… కానీ అలాంటి పరిస్థితి UPSC, SSC లో జరగలేదు.

WATCH THIS VIDEO ABOUT JOB CALANDER

ఏయే నోటిఫికేషన్లు ?

జూన్ 2లోపు తెలంగాణలో అన్ని ప్రభుత్వ శాఖల నోటిఫికేషన్లు రిలీజ్ అవుతాయి.

TGSPSC గ్రూప్ 1,2,3,4 పోస్టులు

పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లు.

DSC ద్వారా SGT, SA పోస్టులు

గురుకులాల్లో టీచర్లు, మోడల్ స్కూళ్ళు

జూనియర్, డిగ్రీ కాలేజీలు, గురుకులాల్లో లెక్చరర్ పోస్టులు

యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులు

వైద్యశాఖ పోస్టులు

RTC లో ఉద్యోగాలు

విద్యుత్ సంస్థలు, సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా జాబ్ కేలండర్ వర్తించేలా నిర్ణయం ఉండొచ్చు.

ఇలా మార్చి నెలలోగా ఖాళీలు గుర్తించి… జూన్ 2 లోపు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే… వాటికి సంబంధించి షెడ్యూల్, ఎగ్జామ్స్… నియామకాలు అన్నీ కూడా డిసెంబర్ 9 లోపు పూర్తి చేస్తారు… అంటే అభ్యర్థులు ప్రతి యేటా డిసెంబర్ చివరి లోపు…. కొత్త సంవత్సరం జనవరిలోగా ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు. మొత్తమ్మీద ఎగ్జామ్స్ డేట్స్ ఓవర్ లాప్ కాకుండా… టైమ్ లేదు… ఎగ్జామ్స్ వాయిదా వేయండి అని నిరుద్యోగులు డిమాండ్ చేసే పరిస్థితి ఉండదని అనుకోవచ్చు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తెస్తున్న కొత్త మార్పు ఇది.

ఇక ప్రభుత్వ కోచింగ్ సెంటర్లు

ఇంకా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి… అంబేద్కర్ నాలెడ్జ్ కేంద్రాలను కూడా ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్ లైన్ శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు. అందుకోసం లేటెస్ట్ టెక్నాలజీని వాడుకోబోతున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఇది ఓ రకంగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు ప్రత్యామ్నాయం అనుకోవాలి. పేద అభ్యర్థులకు సిటీలకు వచ్చి లక్షల రూపాయలు ఖర్చుపెట్టుకోకుండా… ఇంట్లోనే ఆన్ లైన్ లో ప్రభుత్వ కోచింగ్ ను ఉచితంగా పొందే ఛాన్సుంది. దేశంలోనే మంచి సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ ని తీసుకొచ్చి నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు డిప్యూటీ సీఎం. ఈ ప్లాన్ సక్సెస్ అయితే నిరుద్యోగుల బాధలు తీరిపోయినట్టే.

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!