---Advertisement---

TSPSC: కొలువు భర్తీకి కొత్త జాబ్ కేలండర్ !


తెలంగాణలో కొత్త కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రచారం, మేనిఫెస్టోలో భాగంగా ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో కొలువులను భర్తీ చేస్తామని జాబ్ కేలండర్ ప్రకటించారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. త్వరలో
తెలంగాణలో కొలువుల భర్తీకి త్వరలో జాబ్ కేలండర్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే TSPSC నియమాకం జరిగింది. TSPSC ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కమిషన్ ముందు పెండింగ్ లో ఉన్న అంశాలపై ఆయన దృష్టిపెట్టారు. వివిధ దశల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆగిపోయి ఉంది. అందుకే కొలువుల భర్తీకి రీ షెడ్యూల్ ప్రకటించాలని నిర్ణయించారు. ఎన్నికల ముందు రెండు సార్లు వాయిదా పడ్డ గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్ ప్రకటించే ఛాన్స్ ఉంది. అలాగే గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేయాలా వద్దా అన్నది కొత్త ఛైర్మన్, సభ్యులు దృష్టి పెట్టాల్సి ఉంది. బయో మెట్రిక్ లేకుండా, ఒక ఎగ్జామ్ సెంటర్ లో టైమ్ కి మించి పరీక్ష రాయించారని ఆరోపణలు వచ్చాయి. అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత అటెండ్ అయిన వారి సంఖ్యకు, తర్వాత చెప్పిన సంఖ్యకు పొంతన లేకుండా పోవడం లాంటి కారణంలో ప్రిలిమ్స్ రద్దుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకెళ్ళింది గత బోర్డు. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటారా… లేక కొత్తగా మళ్ళీ పోస్టులను కలిపి గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. గ్రూప్ 1 విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తదుపరి చర్యలను ఛైర్మన్ మహేందర్ రెడ్డి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

గ్రూప్ 4 రిజల్ట్స్ కోసం అభ్యర్థుల ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు. మొత్తం 8 వేల 39 గ్రూప్ 4 పోస్టులకు 7 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇప్పటికే గ్రూప్ 4 ఫైనల్ కీ కూడా TSPSC రిలీజ్ చేసింది. ఇంక ఫలితాలు విడుదల, ఉద్యోగాల భర్తీ చేపట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 నోటిఫికేషన్లు అలాగే కంటిన్యూ అవుతాయా… లేదంటే పాత నోటిఫికేషన్లకు అదనంగా కొత్త పోస్టులు కలిపి అనుబంధ నోటిఫికేషన్లు ఇస్తారా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం ప్రకారం TSPSC ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలాఖరు లోగా TSPSC కి సంబంధించిన అన్ని సందేహాలను క్లియర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను రేవంత్ రెడ్డి సర్కార్ భర్తీ చేయనుంది.

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!