TSPSC Member Arunakumari : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలిగా ఉన్న అరుణకుమారి కూడా రాజీనామా చేశారు. తన రిజీనామా లెటర్ ను గవర్నర్ తమిళిసైకి (TS Governor Tamilisai) పంపారు. 2021 మే 21న TSPSC ఛైర్మన్, సభ్యులను BRS ప్రభుత్వం నియమించింది. అరుణ కుమారి తప్ప అందరూ రాజీనామా చేశారు. జనార్ధన్ రెడ్డి, ముగ్గురు సభ్యుల రాజీనామాను గవర్నర్ గతంలోనే ఆమోదించారు. ఈమధ్యే రిజైన్ చేసిన సుమిత్రానంద్ రిజైన్ ని ఇంకా ఆమోదించలేదు. అరుణకుమారి రిజైన్ తో మొత్తం పాత టీమ్ అంతా తప్పుకున్నట్టు అయింది. రెండు రోజుల క్రితమే కొత్త ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి (Mahendar Reddy) బాధ్యతలు చేపట్టారు. అయితే మిగతా సభ్యులు రిజైన్ చేసినప్పుడు అరుణకుమారి చేయలేదు. ఆమెను బలవంతంగా తొలగించాలంటే గవర్నర్ కి కూడా సాధ్యం కాదు. రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి. కానీ అరుణకుమారితో పాటు ఆమె భర్తపై గతంలో అక్రమ ఆస్తుల సంపాదనపై ఏసీబీ కేసులు ఉన్నాయి. వాటిని సీఎం రేవంత్ రెడ్డి తిరగదోడే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దాంతో రిజైన్ చేసినట్టు తెలిసింది.