---Advertisement---

UPSC Civils 2023 Rankers :  వాళ్ళ సక్సెస్ ప్లాన్ ఫాలో అయ్యా…:సివిల్స్ 18వ ర్యాంక్ విజేత వార్ధా, ఆమె సక్సెస్ ప్లాన్ మీరూ ఫాలో అవ్వాల్సిందే !

UPSC సివిల్స్ 2023 ఫలితాల్లో టాప్‌ 25 ర్యాంకుల్లో 10 మంది మహిళా అభ్యర్థులు. వీళ్ళల్లో 18వ ర్యాంకు సాధించింది   వార్దా ఖాన్‌.  సివిల్స్‌ కల కోసం కార్పొరేట్‌ ఉద్యోగాన్ని కూడా వదిలి పెట్టింది. సొంతంగా ఇంట్లో ప్రిపేర్‌ అవడం… గతంలో ర్యాంక్‌ సాధించిన విజేతలను స్ఫూర్తిగా తీసుకొని విజయం సాధించింది.

ఇంట్లోనే ప్రిపరేషన్… కోచింగ్ సెంటర్ గడప తొక్కలేదు

వార్దాఖాన్‌ది నోయిడాలోని వివేక్‌ విహార్‌ ఏరియా. తొమ్మిదేళ్ల క్రితమే తండ్రి చనిపోయాడు. చిన్నప్పటి నుంచి చదువులో టాలెంట్ చూపించేది. ఢిల్లీ యూనివర్సిటీలో కామర్స్‌ గ్రాడ్యుయేషన్‌ చేసింది. వెంటనే కార్పొరేట్‌ సంస్థలో జాబ్ లో జాయిన్ అయింది. అయినా ఆమెకు satisfaction లేదు. జనంలో తిరుగుతూ… వాళ్ళకి సేవలు అందించడంలో తృప్తి ఉంటుందని అనుకుంది. అందుకే సివిల్స్‌కు ప్రిపేరేషన్ మొదలుపటెట్ది. ఎక్కడా డైరెక్ట్ గా కోచింగ్‌ తీసుకోకుండా ఇంట్లోనే ప్రిపరేషన్ మొదలుపెట్టింది.

ఆన్‌లైన్‌ క్లాసులు విన్నది. గతంలో ర్యాంకులు సాధించిన విజేతల వీడియోలు… వాళ్ళు ఇచ్చిన సూచనలు, వాళ్ళ ప్రిపరేషన్ విధానం వింటూ ప్రిపేర్ అయ్యింది.  సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యేటప్పుడు జనరల్ గా టెన్షన్… గెలుస్తామా లేదా అన్న డౌట్స్ ఉంటాయి. విజేతల వీడియోలు చూస్తే… వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయ్యారని అర్థమైంది. విజేతలైన వాళ్ళు కూడా ఇలాంటి టెన్షన్ పడ్డారని అర్థం చేసుకుంది. కనుక ధైర్యం దానంతట అదే వస్తుంది అని సర్ది చెప్పుకున్నట్టు వార్దాఖాన్‌ వివరించింది.

సివిల్స్‌కి ప్రిపేర్‌ అవ్వాలంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంతో రిలేషన్ కట్‌ చేసుకోవాలి. ఆమెకు నలుగురితో కలవడం, మాట్లాడటం ఇష్టమైనా… దానివల్ల టైమ్ వేస్ట్ అవుతుందని గ్రహించింది. సివిల్స్‌కు ప్రిపేర్‌ అయినన్నాళ్లు ఇతరులతో కలవడం, సోషల్‌ మీడియా చూడటం లాంటివి అన్నీ మానేసింది. చదివీ… చదవీ… మరీ బోర్‌ కొడితే మాత్రం… ఈ సిలబస్‌ ను ఇన్నిగంటల్లో పూర్తి చేస్తే… అరగంట సేపు ఎవర్నైనా ఫ్రెండ్‌ని కలవడానికి నాకు ఛాన్సుంది… అని తనకు తనే చిన్న చిన్న లంచాలు ఇచ్చుకుంటూ చదివినట్టు వార్ధాఖాన్ చెబుతోంది.

సివిల్స్ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేసింది ?

సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతుండగా వార్దా ఖాన్‌ను మాక్‌ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న అడిగారు. నువ్వు సోషియాలజీ చదివావు . సమాజంలో మూడు మార్పులు తేవాలనుకుంటే ఏం తెస్తావ్… దానికి వార్దా ఖాన్‌ చెప్పిన సమాధానం

  1. మహిళల విషయంలో సమాజానికి ఉన్న మూస అభిప్రాయం మారాలి. వాళ్ళకి అన్ని విధాలా ముందుకెళ్లడానికి సమాన అవకాశాలు కల్పించగల దృష్టి కావాలి.
  2. దేశాభివృద్ధిలో గిరిజనులకు అన్యాయం జరుగుతోంది. వారి సంస్కృతిని గౌరవిస్తూనే వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలి.
  3. దేశానికి ప్రమాదకరంగా మారడానికి అవకాశం ఉన్న మత వైషమ్యాలను నివారించాలి.

తన మెయిన్‌ ఇంటర్వ్యూ కూడా ఇలాగే ఆసక్తికరంగా సాగినట్టు వార్దా చెప్పింది.

సో… మీరు ఏ ఎగ్జామ్ లో అయినా విజేత కావాలంటే ఇలాంటి సక్సెస్ ప్లాన్ కావాలి.

All the best from Exams Centre247 (App & Website), Telangana Exams plus (app)

Join with this link: GROUP. 1 PRELIMS TESTS SERIES & MAINS GUIDANCE, MATERIALS COURSE

UPSC Civils 2023 Rankers: Follow their success plan…: Civils 18th rank winner Wardha, you must follow her success plan!

10 Women Candidates in Top 25 Ranks in UPSC Civils 2023 Results Warda Khan got 18th rank among them. She also left her corporate job for a civil dream. Preparing at home on your own… took inspiration from previous rank winners and succeeded.

Preparation at home… Coaching center did not tread the threshold

Wardakhand is Vivek Vihar area of Noida. Father died nine years ago. Showed talent in studies since childhood. Graduated in Commerce from Delhi University. Immediately joined the job in a corporate organization. But she is not satisfied. She thought that there would be satisfaction in serving people while roaming around. That’s why the preparation for civils started. Instead of taking direct coaching from anywhere, she started her preparation at home.

Heard online classes. Prepared by listening to the videos of the winners who have achieved ranks in the past… their instructions and their preparation method. While preparing for civils, there is general tension…doubts whether we will win or not. If you watch the videos of the winners, you can see that they felt the same way. I understand that even the winners are under similar tension. So Varda Khan explained that Sardi said that courage comes by itself.

To prepare for Civils, we have to cut our relation with the world around us. Although she likes meeting and talking with four people… she realizes that it is a waste of time. When I was preparing for civils, I stopped meeting others and watching social media. Vardha Khan says that she used to read while giving small bribes to herself saying, “Read… Read… If you get too bored… If you finish this syllabus in these few hours… I will have a chance to meet any friend for half an hour”.

How did civils interview?

Warda Khan was asked a question in mock interview while preparing for civils. You studied sociology. If you want to bring three changes in the society, what would you bring… Warda Khan’s answer to that

Society’s stereotypes about women should change. They need a vision that gives them equal opportunities to advance all the way.
Tribals are being treated unfairly in national development. They should be brought into development while respecting their culture.
Religious conflicts that could become dangerous for the country should be avoided.

Warda said that her main interview was also interesting.

So… If you want to be a winner in any exam, you need a success plan like this.

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!