---Advertisement---

Vote on Account Budget 2024: ఓటాన్ అకౌంట్ బడ్జెట్… మధ్యంతర బడ్జెట్ తేడా ఏంటి?

BUDGET 2024

2024 ఏప్రిల్ లో మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పూర్తి స్థాయి బడ్జెట్ కు బదులుగా మధ్యంతర బడ్జెట్  లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. కేంద్రంలో అధికారంలో ఉన్న NDA ప్రభుత్వం గడువు ఏప్రిల్ తో తీరిపోతుంది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుంది. అందుకే వచ్చే ఆర్ధిక సంవత్సరం అంటే 2024-24 మొత్తానికి సాధారణ బడ్డెట్ (General Budget) ప్రవేశపెట్టే అధికారం అనేది ఈ ప్రభుత్వానికి ఉండదు. అందుకే తిరిగి ప్రభుత్వం ఎన్నికయ్యే వరకూ…. తాత్కాలిక అవసరాల కోసం మాత్రమే ఇలా తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టి పార్లమెంట్ ఆమోదం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం.

సాధారణ బడ్జెట్ స్ధానంలో ఇలా ప్రవేశపెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూ, మధ్యంతర బడ్జెట్ కూ కూడా తేడా అనేది ఉంటుంది. ఈ రెండూ ఒకటి అనుకుంటారు చాలా మంది. కానీ కానే కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 116 ప్రకారం ఓటాన్ అకౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం స్వల్పకాలిక ఖర్చుల కోసం ముందస్తుగా తీసుకునే గ్రాంట్ మాత్రమే. అంటే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే వరకూ… కొన్ని నెలల పాటు మాత్రమే ఇది అమల్లో ఉంటుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) చెప్పిన ప్రకారం చూస్తే ఇది మధ్యంతర బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని తెలుస్తోంది.

మధ్యంతర బడ్జెట్ (Midterm Budget) : కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి… వచ్చే ఆర్థిక సంవత్సరానికి పూర్తిగా బడ్జెట్‌ను సమర్పించేంత వరకు రాబడి, వ్యయాల కోసం నిధులు వాడుకునేందుకు నిర్దిష్ట కాలానికి ప్రవేశపెట్టే బడ్జెట్.

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Vote on Budget): ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది దేశ ఖజానా నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కొన్ని నెలలపాటు ఖర్చులు, ముఖ్యమైన ప్రభుత్వ పథకాలకు నిధులు అవసరం అవుతాయి. అందుకోసం ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం పార్లమెంట్ ను కోరే అనుమతిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను చెబుతారు.

మధ్యంతర బడ్జెట్‌లో ప్రస్తుత ఆర్థిక స్థితి, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలు, రసీదులు, పన్నురేట్లలో మార్పులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలు, వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాలు ఉంటాయి. పార్లమెంటు ఓటాన్ అకౌంట్‌ను ఆమోదిస్తే… అప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, కొనసాగుతున్న ప్రాజెక్టులకు నిధులు అందుతాయి.  వీటితో పాటు ఇతర ప్రభుత్వ ఖర్చులను తీర్చడానికి ఈ నిధులను ఉపయోగిస్తారు. అలాగే చెల్లుబాటు పరంగా చూస్తే… మధ్యంతర బడ్జెట్ ఏడాది పొడవునా చెల్లుబాటు అవుతుంది. కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రం 2 నుంచి 4 నెలల కాలం మాత్రమే చెల్లుబాటు అవుతుందని గమనించాలి.

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!